తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2: పుష్ప 2 మూవీకి యాడ్ కానున్న మరికొన్ని సీన్లు! రన్‍టైమ్ ఎంత కానుందంటే..

Pushpa 2: పుష్ప 2 మూవీకి యాడ్ కానున్న మరికొన్ని సీన్లు! రన్‍టైమ్ ఎంత కానుందంటే..

21 December 2024, 10:18 IST

google News
    • Pushpa 2 The Rule: పుష్ప 2 సినిమాకు అదనంగా మరిన్ని సీన్లను జోడించాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. దీంతో రన్‍టైమ్ మరింత పెరుగనుంది. ఆ వివరాలు ఇవే..
Pushpa 2: పుష్ప 2 మూవీకి యాడ్ కానున్న మరికొన్ని సీన్లు! రన్‍టైమ్ ఎంత కానుందంటే..
Pushpa 2: పుష్ప 2 మూవీకి యాడ్ కానున్న మరికొన్ని సీన్లు! రన్‍టైమ్ ఎంత కానుందంటే..

Pushpa 2: పుష్ప 2 మూవీకి యాడ్ కానున్న మరికొన్ని సీన్లు! రన్‍టైమ్ ఎంత కానుందంటే..

‘పుష్ప 2: ది రూల్’ చిత్రం బాక్సాఫీస్‍ను షేక్ చేస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సీక్వెల్ చిత్రం రికార్డులను బద్దలుకొట్టుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా బాలీవుడ్‍లో అత్యధిత కలెక్షన్లు సాధించిన మూవీగా ఈ చిత్రం నిలిచింది. రూ.1,500 కోట్ల గ్రాస్ వసూళ్ల విషయంలోనూ చరిత్ర సృష్టించింది. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన పుష్ప 2 ఇంకా జోరు చూపిస్తోంది. ఈ తరుణంలో మూవీ టీమ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. అదనంగా మరింత ఫుటేజ్ యాడ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఎంత ఫుటేడ్ యాడ్ కానుందంటే..

‘పుష్ప 2: ది రూల్’ సినిమాకు సుమారు 20 నిమిషాల మేర ఫుటేజ్ యాడ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఆ మేర సీన్లను అదనంగా సినిమాకు జోడించే ప్రయత్నాల్లో ఉన్నారట. త్వరలోనే ఈ మూవీకి ఈ అదనపు సీన్లను యాడ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎప్పుడు ఈ కొత్త వెర్షన్ థియేటర్లలోకి వస్తుందో చూడాలి.

నిడివి ఎంతకు పెరగొచ్చు?

‘పుష్ప 2: ది రూల్’ సినిమా 3 గంటల 20 నిమిషాల రన్‍టైమ్‍తో వచ్చింది. సాధారణంగా యాక్షన్ మూవీకి ఇది చాలా ఎక్కువ రన్‍టైమ్. అయితే, చిత్రం ఎంగేజింగ్‍గా ఉండటంతో ప్రేక్షకులకు రన్‍టైమ్ ఇబ్బందిగా అనిపించలేదు. ఇది ప్లస్ కూడా అయింది. అయితే, ఇప్పుడు మరో 20 నిమిషాల ఫుటేజ్ యాడ్ చేస్తే పుష్ప 2 మూవీ రన్‍టైమ్ ఏకంగా 3 గంటల 40 నిమిషాలకు చేరుతుంది. ఈ కొత్త వెర్షన్‍ వస్తే ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

పుష్ప 2 చిత్రానికి అదనపు ఫుటేజ్ యాడ్ చేయడం గురించి దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ కూడా ఓ ట్వీట్ చేశారు. ఇప్పటికే 3 గంటల 20 నిమిషాలు ఉన్న మూవీకి.. మరో 20 నిమిషాల ఫుటేజ్ జోడించడం మైత్రీ మూవీ మేకర్స్ మాస్టర్ స్ట్రోక్ అంటూ పోస్ట్ చేశారు.

నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి కూడా పుష్ప 2 చిత్రం ఈ అదనపు సీన్లతో ఉండే వెర్షన్ స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. అయితే, ఇంకా స్ట్రీమింగ్ డేట్ ఖరారు కాలేదు. వీటిపై ఇటీవల రూమర్లు వస్తున్నాయి. దీంతో మూవీ టీమ్ స్పందించింది. 56 రోజుల కంటే ముందు ఓటీటీలోకి పుష్ప 2 రాదని, థియేటర్లలో పెద్ద స్క్రీన్‍లపై ఎంజాయ్ చేయాలంటూ క్లారిటీ ఇచ్చింది.

పుష్ప 2 చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1,500 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటింది. అత్యంత వేగంగా ఈ మార్క్ దాటిన చిత్రం చరిత్ర సృష్టించింది. హిందీ నెట్ కలెక్షన్లు 15 రోజుల్లోనే రూ.632కోట్లు అధిగమించింది. దీంతో స్త్రీ2ను వెనక్కి నెట్టి బాలీవుడ్‍లో ఆల్‍టైమ్ అత్యధిక వసూళ్ల రికార్డును ఈ మూవీ సాధించింది. ఈ చిత్రానికి వసూళ్లు ఇంకా జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్‍కు జోడీగా రష్మిక మందన్నా నటించగా.. ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, జగదీశ్ ప్రతాప్ బండారీ కీలక పాత్రలు చేశారు.

తదుపరి వ్యాసం