తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi Watch Cost : మెగాస్టార్ చిరంజీవి వాచ్ ధర ఎంతో తెలుసా? రెండు లగ్జరీ కార్లు వస్తాయ్

Chiranjeevi Watch Cost : మెగాస్టార్ చిరంజీవి వాచ్ ధర ఎంతో తెలుసా? రెండు లగ్జరీ కార్లు వస్తాయ్

Anand Sai HT Telugu

04 August 2023, 12:48 IST

google News
    • Chiranjeevi Watch Price : మెగాస్టార్ చిరంజీవి వాచ్ చాలా మందిని ఆకర్షించింది. ఆ వాచ్ వివరాలను తెలుసుకోవడానికి నెటిజన్లు ఇంటర్నెట్లో వెతుకుతున్నారు. ఈ వాచ్ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా?
చిరంజీవి వాచ్ ధర
చిరంజీవి వాచ్ ధర

చిరంజీవి వాచ్ ధర

సెలబ్రెటీలు చాలా సందర్భాలలో ఖరీదైన వస్తువులను ధరించి తిరుగుతుంటారు. వారు ధరించే బ్రాండెడ్ వస్తువుల ధర లక్షలాది రూపాయలు.. కొంతమందివి కోట్లలో కూడా ఉంటాయి. ఒక్కోసారి చిన్నదే కదా అనుకుంటాం.. దాని విలువ కోట్ల రూపాయలకు మించి ఉంటుంది. అభిమానులు ఆ ఖరీదైన వస్తువు ధర తెలిసి షాక్ అవుతారు. ఇప్పుడు చిరంజీవి ధరించిన వాచ్(Chiranjeevi Watch) అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వాచ్ ఖరీదు కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ వాచ్‌తో రెండు లగ్జరీ కార్లను కూడా కొనుగోలు చేయవచ్చని కొందరి అభిప్రాయం.

దర్శకుడు సాయి రాజేష్(Sai Rajesh) దర్శకత్వంలో తెరకెక్కిన ‘బేబీ’ సినిమా(Baby Cinema) బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా అందరి అంచనాలకు మించి భారీ విజయం సాధించింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి జంటగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. సినీ తారలు సైతం ఈ చిత్రాన్ని సంబరాలు చేసుకుంటున్నారు. ఇటీవలే ఈ చిత్ర విజయోత్సవ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ముఖ్య అతిథిగా వచ్చి.. చిత్ర బృందాన్ని సత్కరించారు. ఈ సమయంలో ఆయన చేతికి పెట్టుకున్న వాచ్ పలువురిని ఆకర్షించింది. ఆ వాచ్ వివరాలను తెలుసుకోవడానికి నెటిజన్లు ఇంటర్నెట్లో వెతుకుతున్నారు. ఈ వాచ్ ఖరీదు ఎంత ఉంటుందో అని చూస్తున్నారు.

కొన్ని నివేదికల ప్రకారం, చిరంజీవి రోలెక్స్(Rolex) కాస్మోగ్రాఫ్ డేటోనా వాచ్ ధరించారు. దీని ధర 2,30,000 డాలర్లు. అంటే భారత కరెన్సీ ప్రకారం 1.90 కోట్ల రూపాయలు. ఈ వాచ్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం వైరల్ అవుతోంది.

మెగాస్టార్ వాచ్ కలెక్షన్స్ బాగుంటుంది. ఆయన కారు కూడా అందంగా ఉంటుంది. ఇక చిరు వాడే.. మరో వాచ్ కూడా భారీ ధరనే ఉంది. ఎ లాంగే అండ్ సోహ్నే వాచ్.. లాంగే కంపెనీకి చెందిన ఈ వాచ్ ధర.. దాదాపు రూ.33 లక్షలపైనే ఉంటుంది. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. చిరంజీవి వాచీతో లైఫ్ టైమ్ హ్యాపీగా బతికేయోచ్చని.. పలువురు కామెంట్స్ చేస్తున్నారు. చిరు మాత్రమే కాదు.. రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(NTR).. ఇలా పలవురు సెలబ్రెటీల వాచీలకు భారీ ధరలు ఉన్నాయి.

ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం 'భోళా శంకర్' సినిమాలో(Bhola Shankar Cinema) నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్(Keerthy Suresh) చిరంజీవి చెల్లెలుగా నటిస్తోంది. ఆగస్ట్ 11న సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

తదుపరి వ్యాసం