Tamannaah Bhatia: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. టాప్ హీరోయిన్‍గా వెలుగొందుతోంది. ఇప్పుడు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‍ల్లోనూ అదరగొడుతోంది. భోళా శంకర్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా భాటియా హీరోయిన్‍గా చేసింది. ఆగస్టు 11వ తేదీన ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లను వేగంగా చేస్తోంది చిత్ర యూనిట్. భోళా శంకర్ కోసం కొన్ని ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటోంది తమన్నా.
భోళా శంకర్ సినిమా కోసం దర్శకుడు మెహర్ రమేశ్, హీరోయిన్ తమన్నా, సుశాంత్ కలిసి ఓ ఇంటర్వ్యూ చేశారు. కమెడియన్ ఆది ఇంటర్వ్యూలో వారిని ప్రశ్నలు అడిగాడు. ఈ క్రమంలో తాను నటించిన టాలీవుడ్ హీరోల గురించి ఏమనుకుంటున్నారంటూ పేర్లను చెప్పాడు ఆది. దీనికి తమన్నా సమాధానాలు చెప్పింది.
చిరంజీవి, ప్రభాస్, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ గురించి తమన్నాను అడిగాడు ఆది. ఈ పేర్లకు ఒక్కొక్కటిగా సమాధానాలు ఇచ్చింది తమన్నా. చిరంజీవి ప్రత్యేకమైన వ్యక్తి.. వన్ అండ్ ఓన్లీ.. ఎవరూ ఆయనలా ఉండలేరని తమన్నా చెప్పింది. పవన్ కల్యాణ్ చాలా మాస్, చాలా స్టైలిష్ అని తెలిపింది. ప్రభాస్.. అందరి డార్లింగ్ అని తమన్నా చెప్పింది. మహేశ్ బాబు చాలా అందంగా ఉంటారని, మోస్ట్ గ్లామరస్ హీరో అని తమన్నా తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ ఆల్ రౌండర్ అని, ఏదైనా చేయగలని తమన్నా అభిప్రాయపడింది. ఎన్టీఆర్ డ్యాన్స్, ఫైట్స్ అన్నీ తనకు ఇష్టమని తమన్నా చెప్పింది.
అల్లు అర్జున్ తెలుగు సినీ ఇండస్ట్రీకి స్టైలిష్ స్టార్ అని, ఇప్పుడు దేశమంతా పాపులర్ అయ్యారని తమన్నా చెప్పింది. రామ్ చరణ్ తనకు రాయల్ అని, ఎప్పుడూ రాయల్‍గా ఉంటారని, తాను కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అలాగే ఉన్నారని తమన్నా చెప్పింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్ రాయల్ అని తమన్నా అభిప్రాయపడింది. హీరోలందరి మీద తమన్నా ఫీలింగ్ ఏంటో ఆడియన్స్ ఎప్పటి నుంచో తెలుసుకోవాలని అనుకుంటున్నారని, అందుకే తాను ఈ ప్రశ్న వేశానని ఆది చెప్పుకొచ్చాడు.
కాగా, వేదాళం సినిమాకు భోళా శంకర్ చిత్రం సీన్ బై సీన్ రీమేక్ కాదని తమన్నా స్పష్టం చేసింది. హీరో చిరంజీవికి తగ్గట్టుగా.. తెలుగు ఆడియన్స్‌కు నచ్చే విధంగా తెరకెక్కిందని తమన్నా చెప్పింది.
భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా భాటియా హీరోయిన్‍గా నటించింది. చిరూ చెల్లెలి పాత్రను స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ పోషించింది. సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే వచ్చిన భోళా శంకర్ ట్రైలర్, పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఆగస్టు 11వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.