తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Harish Shankar: నువ్ నాకేమైనా పెగ్గు కలిపావా.. దమ్ముంటే ఫొటో వేసి రాయ్.. హరీష్ శంకర్ మాస్ కామెంట్స్

Harish Shankar: నువ్ నాకేమైనా పెగ్గు కలిపావా.. దమ్ముంటే ఫొటో వేసి రాయ్.. హరీష్ శంకర్ మాస్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

12 February 2024, 8:18 IST

  • Harish Shankar Comments In Eagle Success Meet: డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా ఓ వెబ్ సైట్‌పై నిప్పులు చెరిగాడు. దమ్ముంటే తన ఫొటో వేసి రాయమని మాస్ వార్నింగ్ ఇచ్చాడు. రవితేజ ఈగల్ సక్సెస్ మీట్‌లో తన ఆవేదనను చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్.

నువ్ నాకేమైనా పెగ్గు కలిపావా.. దమ్ముంటే ఫొటో వేసి రాయ్.. హరీష్ శంకర్ మాస్ కామెంట్స్
నువ్ నాకేమైనా పెగ్గు కలిపావా.. దమ్ముంటే ఫొటో వేసి రాయ్.. హరీష్ శంకర్ మాస్ కామెంట్స్

నువ్ నాకేమైనా పెగ్గు కలిపావా.. దమ్ముంటే ఫొటో వేసి రాయ్.. హరీష్ శంకర్ మాస్ కామెంట్స్

Harish Shankar Speech At Eagle Success Meet: మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ఈగల్. యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటించారు.

ట్రెండింగ్ వార్తలు

Mahesh Babu - Ram Charan: ఓటేసిన మహేశ్ బాబు, రామ్‍చరణ్.. స్టైలిష్ లుక్‍లో స్టార్ హీరోలు

Bollywood: వాటి గురించి సుశాంత్ సింగ్ చాలా బాధపడేవారు: మనోజ్ బాజ్‍పేయ్

Pavithra Jayaram: టీవీ సీరియల్ నటి మృతి.. తిరిగి రావా అంటూ భర్త చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్

Kannappa Teaser Date: కన్నప్ప సినిమా టీజర్ రిలీజ్‍కు డేట్ ఖరారు.. ప్రతిష్టాత్మక వేదికపై..

ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై అన్ని వర్గాల పేక్షకులను అలరించి పబ్లిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుంది ఈగల్. ఈ నేపథ్యంలో ఈగల్ మేకర్స్ పబ్లిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ని నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ వెబ్ సైట్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ధైర్యముంటే తన ఫొటో వేసి ఆర్టికల్ రాయమని మాస్ కామెంట్స్ చేశాడు.

హరీష్ శంకర్ తన మనసులోని మాటలను వేదికలపై బహిరంగంగానే బయటపెడుతుంటాడు. తాజాగా ఈగల్ సక్సెస్ మీట్‌లో కూడా మరోసారి తన ఆవేదనను బయటపెట్టాడు. ఓ గాసిప్ వెబ్ సైట్‌పై హరీష్ శంకర్ ఫైర్ అయ్యాడు. గ్రేట్ వెబ్ సైట్ అంటూ పీపుల్స్ మీడియా సంస్థ కూడా అధికారికంగా పోస్టర్ విడుదల చేసింది. ఆ వెబ్ సైట్ ఈగల్ సినిమాకు 1.5 రేటింగ్ ఇచ్చింది. అదే వెబ్ సైట్ యాత్ర 2 మూవీకి 3 రేటింగ్స్ ఇచ్చింది. దీనిపై ఇదివరకే ట్విటర్‌లో కౌంటర్స్ వేసిన హరీష్ శంకర్ తాజాగా ఫైర్ అయ్యాడు.

"ఓ వెబ్ సైట్ ఇలానే రాస్తుంటుంది. ఎందుకు ఇలా కొత్త టీమ్ చేసిన ప్రయత్నాన్ని నీరు గార్చడం. రెండో సినిమాతో దర్శకుడు నిలబడాలనుకున్న ఓ కెమెరామెన్‌ను, వంద సినిమాలు తీయడానికి రెడీగా ఉన్న నిర్మాతను ఇలా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. మా సినిమా వాళ్లకు ఈ ట్రోలింగ్ కొత్తేం కాదు. అన్నీ తెగించే ఇండస్ట్రీలోకి వచ్చాం. సినిమాలు పుట్టాకే వెబ్ సైట్స్ పుట్టాయి" అని హరీష్ శంకర్ చురకలు అంటించాడు.

"ఓ వెబ్ సైట్ మరీ దారుణంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంది. ఓ డైరెక్టర్ నాలుగేళ్లుగా సినిమా తీయట్లేదు. రాత్రంతా తాగుతూ ఉన్నాడు. గతంలో పవన్ కల్యాణ్‌తో బ్లాక్ బస్టర్ తీశాడు అని రాస్తారు. ఫొటో వేయరు. అది ఇంకెవరు నేనే. నా ఫొటో, పేరు రాసే ధైర్యం లేదు. ధైర్యం ఉంటే నా ఫొటో వేసి రాయండి. నేను కౌంటర్ ఇస్తాను. నువ్వేమైనా నాకు పెగ్గు కలిపావా. ఐస్ వేశావా. నీకు తెలుసా. మనం ఒకే జట్టుగా ఉన్నాం. మీరు ఆ గట్టు మీద, మేము ఈ గట్టు మీద లేము" అని హరీష్ శంకర్ అన్నాడు.

"అందరం కలిస్తేనే సినీ పరిశ్రమ కాదు. కూడదు.. ఇలానే నెగెటివ్ ఆర్టికల్స్ రాస్తాం. మీ సినిమాలు వస్తాయి కదా. మీ సంగతి చూస్తాం అనుకుంటే మీ అభిమాన హీరో చెప్పిన డైలాగ్, చేసిన సింబల్ గుర్తుంది కదా" అని ఆ సైగ చేశాడు హరీష్ శంకర్. దీంతో హరీష్ శంకర్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం