Harish Shankar on Venkatesh Maha: వెంకటేష్ మహాకు క్లాస్ పీకిన హరీష్ శంకర్.. పేరు ఎత్తకుండానే పగిలిపోయేలా ఇచ్చిపడేశాడు!-harish shankar slams venkatesh maha indirectly in balagam success meet
Telugu News  /  Entertainment  /  Harish Shankar Slams Venkatesh Maha Indirectly In Balagam Success Meet
వెంకటేష్ మహాకు క్లాస్ పీకిన హరీష్ శంకర్
వెంకటేష్ మహాకు క్లాస్ పీకిన హరీష్ శంకర్

Harish Shankar on Venkatesh Maha: వెంకటేష్ మహాకు క్లాస్ పీకిన హరీష్ శంకర్.. పేరు ఎత్తకుండానే పగిలిపోయేలా ఇచ్చిపడేశాడు!

11 March 2023, 15:45 ISTMaragani Govardhan
11 March 2023, 15:45 IST

Harish Shankar on Venkatesh Maha: టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్.. బలగం సక్సెస్ మీట్‌లో వెంకటేష్ మహాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన పేరు ప్రస్తావించకుండానే ఇటీవలే జరిగిన కేజీఎఫ్ వివాదంపై స్పందించారు.

Harish Shankar on Venkatesh Maha: టాలీవుడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా వివాదం ఇప్పడప్పుడే తగ్లేలా కనిపించట్లేదు. కేజీఎఫ్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసి కాంట్రవర్సీకి దారి తీసిన వెంకటేష్ మహాపై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. ఆ సినిమాలో పాత్రను నీచ్ కమీనే అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అతడిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అనంతరం సదరు దర్శకుడు తను వాడిన మాటలకు క్షమాపణలు చెప్పాడే కానీ.. తన అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోవట్లేదని కుండబద్దలు కొట్టేశాడు. దీంతో ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్.. పరోక్షంగా వెంకటేష్ మహాకు క్లాస్ పీకారు. బలగం మూవీ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. క్లాస్, మాస్ అన్ని సినిమాలను ఆదరించాలని పేరు ప్రస్తావించుకుండానే వెంకటేష్ మహాకు క్లాస్ పీకారు.

"క్లాస్, మాస్, కమర్షియల్ సినిమాలనేవి ఇండస్ట్రీలోని వారు అర్థం కావటానికి పెట్టుకున్న పేర్లు. కానీ ప్రేక్షకులు వాటినేమి పట్టించుకోరు. వాళ్లకు కావాల్సింది మంచి సినిమా. పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలను చూసినే అదే మాస్ ప్రేక్షకులు సాగరసంగమం, స్వాతిముత్యం లాంటి సినిమాలను ఎడ్లబండ్లు కట్టుకుని మరీ చూశారు. సినిమా ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నంటినీ వదిలేసి మనం ఒకరిపై ఒకరం విమర్శించుకుంటున్నాం. సైకిల్‌పై వెళ్లే వాడు బయట గాలిని ఎంజాయ్ చేస్తాడు. కారులో వెళ్లేవాడు ఏసీ గాలిని ఆస్వాదిస్తుటాడు. అలాగని సైకిల్‌పై వెళ్లేవాడు కారులో ఉన్నవాడిని తిట్టనక్కర్లేదు. కారులో వెళ్లే వాడు సైకిల్‌పై ఉన్నవాడిని చిన్నచూపు చూడన్నక్కర్లేదు" అని హరీష్ శంకర్ స్పష్టం చేశారు.

"మన ఆరోగ్యానికి పెరుగన్న మంచిదే. కానీ బయట ఎక్కువగా బిర్యానీ సేల్ అవుతుందని, పెరుగన్న ఎందుకు కొనట్లేదని అనుకోకూడదు. బిర్యానీ తినండి.. తర్వాత పెరుగన్న కూడం తీసుకోండి అనాలి మనం బిర్యానీ, పెరుగన్నం రెండిటినీ ఆదరించాలి." అని వెంకటేష్ మహా గురించి పరోక్షంగా ప్రస్తావించారు హరీష్ శంకర్.

ఇటీవల టాలీవుడ్ దర్శకులు వెంకటేష్ మహా, నందిని రెడ్డి, వివేక్ ఆత్రేయ, మోహన కృష్ణ ఇంద్రగంటి, శివ నిర్వాణ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కమర్షియల్ సినిమాల గురించి ప్రస్తావన రాగానే దర్శకుడు వెంకటేష్ మహా కేజీఎఫ్-2 సినిమా గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. అందులోని హీరో పాత్ర గురించి నీచ్ కమీనే కుత్తే అంటూ అసభ్యకరమైన పదాలను వాడాడు. హిందీ పదాలే అయినప్పటికీ ఆ మాటలు చాలా మంది తెలుగువారికి మింగుడుపడట్లేదు. ఒకటి, రెండు సినిమాలు హిట్ కాగానే.. ఇంత దారుణంగా మాట్లాడటం సరికాదంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేస్తున్నారు.

టాపిక్