తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Darling: డార్లింగ్ మూవీ అపరిచితుడుకు ఇన్సిప్రేషన్.. డైరెక్టర్ అశ్విన్ రామ్ క్లారిటీ

Darling: డార్లింగ్ మూవీ అపరిచితుడుకు ఇన్సిప్రేషన్.. డైరెక్టర్ అశ్విన్ రామ్ క్లారిటీ

Sanjiv Kumar HT Telugu

12 July 2024, 6:16 IST

google News
  • Director Ashwin Ram About Darling Aparichithudu: ప్రియదర్శి, నభా నటేష్ నటించిన డార్లింగ్ మూవీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అపరిచితుడుకు ఇన్సిప్రేషన్ అనే ప్రశ్నపై మూవీ డైరెక్టర్ రామ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

డార్లింగ్ మూవీ అపరిచితుడుకు ఇన్సిప్రేషన్.. డైరెక్టర్ అశ్విన్ రామ్ క్లారిటీ
డార్లింగ్ మూవీ అపరిచితుడుకు ఇన్సిప్రేషన్.. డైరెక్టర్ అశ్విన్ రామ్ క్లారిటీ

డార్లింగ్ మూవీ అపరిచితుడుకు ఇన్సిప్రేషన్.. డైరెక్టర్ అశ్విన్ రామ్ క్లారిటీ

Darling Aparichithudu: ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'డార్లింగ్'. ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది.

డార్లింగ్ సినిమా జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అశ్విన్ రామ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. అలాగే సినిమాకు సంబంధించి ఆసక్తికర విశేషాలు చెప్పారు.

'డార్లింగ్' అపరిచితుడు మూవీ ఇన్స్‌ప్రెషన్ అనుకోవచ్చా?

లేదండి. స్ల్పిట్ పర్సనాలిటీ కామన్‌గా కనిపించవచ్చు. కానీ కథ, కాన్‌ఫ్లిక్ట్ పరంగా ఈ రెండు డిఫరెంట్ మూవీస్. అపరిచితుడులో శంకర్ గారు లార్జ్ స్కేల్‌లో సోషల్ ఇష్యూస్‌ని డీల్ చేశారు. డార్లింగ్‌లో హోం ఇష్యూస్ డీల్ చేస్తున్నాం (నవ్వుతూ).

ప్రభాస్‌ను అందరూ డార్లింగ్ అని పిలుస్తారు. అదే టైటిల్ పెట్టడంపై?

ప్రభాస్ గారి డార్లింగ్ కల్ట్ హిట్ మూవీ. ప్రభాస్ గారిని అందరూ డార్లింగ్ అంటారని మా యూనిట్ అందరికీ తెలుసు. అయితే ఈ కథకు డార్లింగ్ అనే టైటిల్ యాప్ట్. వైఫ్ అండ్ హస్బెండ్ ప్రేమగా పిలుచుకునే పదం డార్లింగ్. మా సినిమాకి ఇది పర్ఫెక్ట్ టైటిల్. ఇప్పటివరకూ ప్రభాస్ గారి ఫ్యాన్స్ నుంచి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన తర్వాత ఇది పర్ఫెక్ట్ టైటిల్ అని ప్రేక్షకులే చెబుతారు.

డార్లింగ్ నవ్విస్తుందా ? ఎమోషనల్ టచ్‌తో మెసేజ్ కూడా ఉందా?

నాకు సందేశాలు ఇవ్వడం ఇష్టం ఉండదు. సినిమా చూసినప్పుడు ఎంటర్‌టైనింగ్‌గా ఉండాలనేది మాత్రమే చూస్తాను. ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూనే ఒక సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో కూడిన సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. డార్లింగ్ కూడా అలా చేసిన సినిమానే.

డార్లింగ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనిపించింది. మరి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సరిఫికేట్ ఇవ్వడంపై?

ఇందులో స్ల్పిట్ పర్శనాలిటీ డిస్ఆర్డర్‌తో డీల్ చేశాం. అది సెన్సిటివ్ డిస్ఆర్డర్. ఆ కారణంగానే యూ/ఏ ఇచ్చారు. ఒక్క కట్ కూడా చెప్పలేదు. చాలా క్లీన్ ఫిల్మ్ ఇది. పెద్దల సమక్షంలో పిల్లలు చూడొచ్చు. సెన్సార్ బోర్డ్ వారితో పాటు ఇప్పటివరకూ సినిమా చూసిన అందరికీ డార్లింగ్ చాలా నచ్చింది.

ఈ మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ కథలు పెద్దగా రాలేదు కదా.. డార్లింగ్ విషయంలో మీ అంచనాలు ఏంటీ?

వైఫ్ అండ్ హస్బెండ్ అంటే సిమిలర్ టు లవ్ స్టొరీ. మ్యారేజ్‌ని హ్యాండిల్ చేయడంలో డిఫరెంట్ పర్స్పెక్టివ్ చూపించే కథ ఇది. డెఫినెట్‌గా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.

వైఫ్ అండ్ హస్బెండ్ 'రాజారాణి' గుర్తుకు వస్తుంది. ఆ సినిమా పోలికలు ఇందులో ఉంటాయా?

రాజారాణికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. రొమాంటిక్ కామెడీకి రాజారాణి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. డార్లింగ్‌లో వైఫ్ అండ్ హస్బెండ్‌కి సంబధించిన డిఫరెంట్ పర్స్పెక్టివ్‌ని ప్రెజెంట్ చేస్తున్నాం. మురగదాస్ గారి ప్రొడక్షన్‌లో మూడు సినిమాలకి పని చేశాను. ధనుష్ గారి సినిమాకి కూడా పని చేశాను.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం