Prabhas Marriage: ప్రభాస్ లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్.. కాబోయే భార్య గురించేనా డార్లింగ్ పోస్ట్?
Prabhas Special Person: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అతి త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారా అనే అనుమానం తాజాగా మొదలైంది. అందుకు కారణం ప్రభాస్ పెట్టిన కొత్త ఇన్‌స్టా పోస్టే. ఇందులో తన లైఫ్‌లోకి స్పెషల్ వస్తోందని, డార్లింగ్స్ వెయిట్ చేయండని ఆ పోస్ట్‌లో ప్రభాస్ తెలిపాడు.
Prabhas Marraige: టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లో మొదటగా చెప్పే పేరు ప్రభాస్ (Prabhas). డార్లింగ్ అని పిలుచుకునే తన అభిమాన హీరో పెళ్లి ఎప్పుడు అవుతుంది, ఎవరితో జరుగుతుంది అని ఎంతో కాలంగా వెయి కన్నులతో అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
పెళ్లిపై రూమర్స్
కానీ, పెళ్లి గురించి ఎప్పుడు ప్రస్తావించిన ఏదో ఒక కారణం చెప్పి, కవర్ చేసి తప్పించుకున్నాడు ప్రభాస్. అనేక షోలలో పెళ్లిపై, పెళ్లిపిల్లపై కౌంటర్స్ సైతం వేశాడు ప్రభాస్. అలాంటి డార్లింగ్ అతి త్వరలో పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్నడని తెలుస్తోంది. ప్రభాస్ పెళ్లి గడియలు చాలా దగ్గర్లో ఉన్నాయని అర్థం అవుతోంది.
క్రేజీయెస్ట్ టాపిక్
ప్రస్తుతం నెట్టింట్లో మరోసారి ప్రభాస్ పెళ్లి (Prabhas Wedding) టాపిక్ క్రేజియెస్ట్ టాపిక్ అవుతోంది. త్వరలో ప్రభాస్ వివాహం చేసుకోనున్నాడా అనే అనుమానం, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకు కారణం డార్లింగ్ ప్రభాస్ తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో కొత్త స్టోరీ పెట్టడమే.
స్పెషల్ పర్సన్ రానున్నారు
తాజాగా ప్రభాస్ ఇన్‌స్టాలో ఒక కొత్త స్టోరీ పెట్టాడు. అందులో "డార్లింగ్స్.. చివరిగా నా జీవితంలోకి అత్యంత స్పెషల్ పర్సన్ రాబోతున్నారు. వెయిట్ చేయండి" అని స్మైలింగ్ ఎమోజీతో రాసుకొచ్చాడు ప్రభాస్. ఈ స్టోరీ క్షణంలో వైరల్ అయింది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
కాబోయే భార్య గురించే
ఇది చూసిన నెటిజన్స్, డార్లింగ్ ఫ్యాన్స్, కామన్ ఆడియెన్స్ అంతా ప్రభాస్ పెళ్లి చేసుకోనున్నాడా, ఆ అమ్మాయి అదే ప్రభాస్ కాబోయే భార్య గురించే చెబుతున్నాడా అని అనుమానాలు, ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రభాస్ ఇలాంటి పోస్ట్ పెట్టడం ఇదే మొదటి సారి అని, ఇది ఏ సినిమా గురించి కాదని, కాబోయే భార్య గురించే అని ఫ్యాన్స్ డిస్కషన్ మొదలుపెట్టారు.
ఇంకొన్ని రోజులు
ఇలా మరోసారి ప్రభాస్ మ్యారేజ్ టాపిక్ ట్రెండింగ్ అవుతోంది. ఇక వెయిట్ చేయండి అని ప్రభాస్ చెప్పాడు. కాబట్టి, ఇంకాస్తా సమయమో, కొన్ని రోజులో ప్రభాసే అసలు విషయం చెప్పేవరకు ఆగాల్సిందే. అంతవరకు ఈ సస్పెన్స్, క్యూరియాసిటీ మెయింటేన్ చేయాల్సిందే అని తెలుస్తోంది.
ప్రతి హీరోయిన్‌తో
కాగా ప్రభాస్‌కు ప్రస్తుతం 44 ఏళ్లు (Prabhas Age). ఇప్పటివరకు ప్రభాస్ పెళ్లిపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. ప్రభాస్ ఏ హీరోయిన్‌తో మూవీ చేస్తే వారితో లవ్ ఎఫైర్ టాపిక్ వచ్చేది. అందరికంటే ఎక్కువ ప్రభాస్-అనుష్క (Anushka) పెళ్లి టాపిక్ వైరల్ అయింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన బిల్లా, బాహుబలి సినిమాలు డార్లింగ్ అభిమానులకే కాదు ఆడియెన్స్‌కు సైతం ఎంతో నచ్చాయి.
రూమర్స్‌కు చెక్
ఈ సినిమాలో వీరి జోడీకి నూటికి నూట ఇరవై శాతం మార్కులు పడ్డాయి. ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని ఎన్నోసార్లు రూమర్స్ వచ్చాయి. కానీ, వారు మాత్రం జస్ట్ ఫ్రెండ్స్ అని ఓపెన్‌గా చెప్పాశారు. ఆ తర్వాత సాహో బ్యూటి శ్రద్ధా కపూర్, ఆదిపురుష్ సీత కృతి సనన్‌తో సైతం ప్రభాస్ పెళ్లి జరుగనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ లేటెస్ట్ పోస్ట్‌తో వీటన్నింటికి చెక్ పడనుంది.