తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara Second Single: దేవర రెండో పాటపై కాపీ ఆరోపణలు.. అచ్చం ఆ పాటలానే ఉందంటూ ట్రోల్స్

Devara Second Single: దేవర రెండో పాటపై కాపీ ఆరోపణలు.. అచ్చం ఆ పాటలానే ఉందంటూ ట్రోల్స్

06 August 2024, 15:13 IST

google News
    • Devara Second Single: దేవర నుంచి వచ్చిన రెండో పాట త్వరగా పాపులర్ అయింది. అయితే, ఈ పాట ట్యూన్ కాపీ అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టులు చేస్తూ.. ట్రోల్స్ చేస్తున్నారు.
Devara Second Single: దేవర రెండో పాటపై కాపీ ఆరోపణలు.. అచ్చం ఆ పాటలానే ఉందంటూ ట్రోల్స్
Devara Second Single: దేవర రెండో పాటపై కాపీ ఆరోపణలు.. అచ్చం ఆ పాటలానే ఉందంటూ ట్రోల్స్

Devara Second Single: దేవర రెండో పాటపై కాపీ ఆరోపణలు.. అచ్చం ఆ పాటలానే ఉందంటూ ట్రోల్స్

దేవర సినిమాపై ఫుల్ క్రేజ్ ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు హైరేంజ్‍లో ఉన్నాయి. తమిళ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దేవర నుంచి సోమవారం (ఆగస్టు 5) రెండో పాట రిలీజ్ అయింది. చుట్టమల్లే అంటూ వచ్చిన ఈ పాట మెప్పిస్తోంది. ఈ సాంగ్‍కు మెలోడియస్ ట్యూన్ ఇచ్చారు అనిరుధ్. అయితే, ఈ పాట ట్యూన్ కాపీ అంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

ఈ పాటకు కాపీ అంటూ..

దేవర నుంచి వచ్చిన ఈ రెండో పాటకు కాపీ ట్యూన్‍ను అనిరుధ్ ఇచ్చాడంటూ కొందరు నెటిజన్లు అంటున్నారు. శ్రీలంకకు చెందిన సింహలీస్ పాట ‘మనికే మాగే హితే’ చాలా పాపులర్ అయింది. ఈ పాటను యోహానీ, సతీషన్ ఆలపించారు. అయితే, దేవర నుంచి వచ్చిన ఈ రెండో పాట ట్యూన్ అచ్చం ‘మనికే మాగే హితే’లాగే ఉందంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది.

ట్రోలింగ్

అనిరుధ్ రవిచందర్ కాపీ ట్యూన్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్నారు. దేవర పాటను.. ‘మనికే మాగే హితే’ సాంగ్‍ను రెండింటినీ పోల్చుతూ వీడియోలను పెడుతున్నారు. వీటిపై మీమ్‍లు చేస్తున్నారు. అనిరుధ్‍ను ట్రోలింగ్ చేస్తూ రకరకాల వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇది హాట్‍టాపిక్‍గా మారింది.

మరోవైపు, కొందరు ఈ కాపీ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. వినేందుకు ట్యూన్ దగ్గరిగా ఉన్నంత మాత్రం పూర్తిగా కాపీ అనడం కరెక్ట్ కాదంటూ కౌంటర్స్ వేస్తున్నారు. కావాలనే కొందరు ట్రోల్ చేస్తున్నారని డిఫెండ్ చేస్తున్నారు.

భారీగా వ్యూస్

అయితే, దేవర నుంచి వచ్చిన ఈ రెండో పాటకు భారీగా వ్యూస్ దక్కుతున్నాయి. ఈ సాంగ్ లిరికల్ వీడియోలో ఎన్టీఆర్, జాన్వీ కెమెస్ట్రీ, విజువల్స్ అదిరిపోయాయి. బీచ్ లొకేషన్‍లో తీసిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. అనిరుధ్ ఇచ్చిన ట్యూన్ మెలోడియస్‍గా ఉంది. దీంతో ఈ పాట వెంటనే చార్ట్ బస్టర్ అయింది.

దేవర నుంచి వచ్చిన ఈ రెండో పాట ఒక్క రోజు గడవకముందే ఐదు భాషల్లో కలిపి 25 మిలియన్ వ్యూస్ దాటింది. యూట్యూబ్‍లో ట్రెండింగ్‍లో అగ్రస్థానంలో దూసుకెళుతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సాంగ్ వచ్చింది. తెలుగు, హిందీలో ఇప్పటికే భారీ వ్యూస్ దక్కించుకుంటోంది.

దేవర నుంచి మొదటి పాటగా మే 20న ఫియర్ సాంగ్ వచ్చింది. ట్రెండీగా ఫాస్ట్ బీట్‍తో ఈ పాటకు అదిరిపోయే ట్యూన్ ఇచ్చారు అనిరుధ్. ఇప్పటికే ఈ సాంగ్ మార్మోగుతోంది. అయితే, ఈ సాంగ్‍పై కూడా మొదట కాపీ అంటూ ఆరోపణలు వచ్చాయి. లియో మూవీలో బాడాస్‍కు దగ్గరిగా ఉందంటూ అభిప్రాయాలు వినిపించాయి. అయితే, ‘ఫియర్ సాంగ్’ మాత్రం భారీగా సక్సెస్ అయింది. మూవీపై అంచనాలను పెంచేసింది. ఇప్పుడు వచ్చిన రెండో పాటపై కూడా కాపీ ఆరోపణలు వస్తున్నా.. ప్రేక్షకులను మాత్రం మెప్పిస్తోంది.

దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌తో పాటు సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, ప్రకాశ్ రాజ్ కీరోల్స్ చేస్తున్నారు.

తదుపరి వ్యాసం