Devara Second Single: దేవర నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్.. చుట్టమల్లే అంటూ ఎన్టీఆర్, శ్రీదేవిని గుర్తు చేసిన తారక్, జాన్వీ-devara second single jr ntr janhvi kapoor romantic song chuttamalle anirudh ravichander song ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara Second Single: దేవర నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్.. చుట్టమల్లే అంటూ ఎన్టీఆర్, శ్రీదేవిని గుర్తు చేసిన తారక్, జాన్వీ

Devara Second Single: దేవర నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్.. చుట్టమల్లే అంటూ ఎన్టీఆర్, శ్రీదేవిని గుర్తు చేసిన తారక్, జాన్వీ

Hari Prasad S HT Telugu
Aug 05, 2024 07:04 PM IST

Devara Second Single: దేవర మూవీ నుంచి మచ్ అవేటెడ్ సెకండ్ సింగిల్ వచ్చేసింది. సోమవారం (ఆగస్ట్ 5) సాయంత్రం ఈ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ రొమాంటిక్ సాంగ్ లో ఎన్టీఆర్, శ్రీదేవిలను గుర్తు చేసేలా జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కనిపించడం విశేషం.

దేవర నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్.. చుట్టమల్లే అంటూ ఎన్టీఆర్, శ్రీదేవిని గుర్తు చేసిన తారక్, జాన్వీ
దేవర నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్.. చుట్టమల్లే అంటూ ఎన్టీఆర్, శ్రీదేవిని గుర్తు చేసిన తారక్, జాన్వీ

Devara Second Single: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ నటించిన 'దేవర: పార్ట్ 1' చిత్రంలోని రెండో పాటను సోమవారం విడుదల చేశారు. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ పాటకు తెలుగులో చుట్టమల్లె, హిందీలో ధీరే ధీరే, తమిళంలో పాతవైకుం, కన్నడలో స్వాతిముత్తే సిక్కంగైతే, మలయాళంలో కన్నినాథన్ కమనోత్తం అనే పేర్లు ఉన్నాయి.

దేవర నుండి చుట్టమల్లె సాంగ్

సోమవారం (ఆగస్ట్ 5) సాయంత్రం పాట విడుదలకు ముందు, దేవర అధికారిక ఎక్స్ ఖాతా ఈ పాట గురించి చెబుతూ.. "మేము ఇప్పటికే దాని ట్రాన్స్ లో ఉన్నాము. ఈ రైడ్ లో మీరు కూడా మాతో చేరతారని కచ్చితంగా భావిస్తున్నాం" అని టీజ్ చేసింది. అనంతరం రామజోగయ్య శాస్త్రి రచించిన 'చుట్టమల్లె చుట్టేస్తాందె తుంటరి చూపు'అంటూ సాగిన పాట రిలీజైంది.

ఈ పాటలో తారక్, జాన్వీ స్టెప్పులు అదిరిపోయాయి. ఈ రొమాంటిక్ సాంగ్ లో ఈ ఇద్దరి మధ్య కెమెస్ట్రీ చాలా బాగుంది. తొలిసారి కలిసి నటిస్తున్నట్లుగా ఎక్కడా అనిపించలేదు. ఈ సాంగ్ ను బాలీవుడ్ సింగర్ శిల్పారావు పాడింది. ఈ 3 నిమిషాల 44 సెకన్ల నిడివి గల పాటలో జాన్వీ సంప్రదాయ దుస్తులు ధరించగా, జూనియర్ ఎన్టీఆర్ మరింత సమకాలీన దుస్తుల్లో కనిపించారు. వీళ్ల రొమాన్స్ ఒకప్పటి సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవిలను గుర్తు చేసిందంటూ కొందరు కామెంట్ చేయడం విశేషం.

అనిరుధ్ మ్యూజిక్ అదుర్స్

దేవర పార్ట్ 1 నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఫుల్ మాస్ బీట్ తో సాగగా.. అందుకు పూర్తి భిన్నంగా ఈ సెకండ్ సింగిల్ మెలోడియస్ గా సాగింది. ఈ పాట కోసం అనిరుధ్ తో కలిసి పనిచేయడం గురించి శిల్పా మాట్లాడుతూ “ఈ పాటలో పనిచేయడం నాకు పూర్తిగా కొత్త అనుభవం. తెలుగు సంగీతంలోని స్లో డాన్స్ ఫీల్ ని అంత సాఫీగా క్యాప్చర్ చేస్తూ, బౌన్సీ పదాలతో ఈ పాట ఎంత మధురమైన, ఫ్రెష్ వైబ్ ను కలిగి ఉంది. అనిరుధ్ తో కలిసి పనిచేయడం అద్భుతం. ఇది కేవలం రికార్డింగ్ కంటే జామ్ సెషన్ లా అనిపించింది” అనిచెప్పింది.

ఈ రొమాంటిక్ ట్రాక్ చూసి అభిమానులు కూడా హ్యాపీగా ఫీలయ్యారు.ఓ అభిమాని తన ఇన్ స్టాగ్రామ్ లో 'సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవిని గుర్తుకు తెస్తుంది' అని కామెంట్ చేశాడు. మరొకరు ఈ పాట 'వెరీ వెరీ క్యూట్' అని అన్నారు. ఈ పాటను చూసిన చాలా మంది జాన్వీ ఇన్ స్టాగ్రామ్ లో 'జూనియర్ శ్రీదేవి' అని కామెంట్లు కూడా చేశారు.

జాన్వీ కపూర్ తెలుగు అరంగేట్రం

దేవర: పార్ట్ 1లో జాన్వీ, సైఫ్ ఇద్దరూ దక్షిణాదిన అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో పనిచేయడం గురించి ఆమె పిటిఐతో మాట్లాడుతూ, తెలుగులో పనిచేయడం తన తల్లి, దివంగత శ్రీదేవికి దగ్గరగా ఉందని అన్నారు.

“ఏదో ఒక విధంగా మా అమ్మకు దగ్గరగా ఉండటం, ఆ వాతావరణంలో ఉండటం, అలాగే ఆ భాష వినడం, మాట్లాడటం నాకు అలాంటి ఫీలింగ్ కలిగిస్తోంది. ఎన్టీఆర్ సార్, రామ్ చరణ్ సార్ కుటుంబాలతో మామ్ కు ఎంతో చరిత్ర ఉంది. ఈ ఇద్దరు టాలెంటెడ్ నటులతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను” అని చెప్పింది.

దేవర: పార్ట్ 1 మూవీ ఏంటి?

రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో దేవర పార్ట్ 1పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అతడు గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్లు మూవీ ప్రమోషన్లు చూస్తే తెలుస్తోంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని 2021లో ప్రకటించి 2023లో ప్రొడక్షన్ మొదలుపెట్టారు. ఈ చిత్రం కోసం బాబీ డియోల్ ను కూడా తీసుకున్నారని, రెండో భాగంలో ఆయన మరింత ముఖ్యమైన పాత్రను పోషిస్తారని ఇటీవల విశ్వసనీయ వర్గాలు హిందూస్తాన్ టైమ్స్ కు తెలిపాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదల కానుంది.