తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara Pre-release Business: భారీగా దేవర ప్రీరిలీజ్ బిజినెస్.. తెలంగాణలో బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Devara Pre-release business: భారీగా దేవర ప్రీరిలీజ్ బిజినెస్.. తెలంగాణలో బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Hari Prasad S HT Telugu

25 September 2024, 17:35 IST

google News
    • Devara Pre-release business: దేవర ప్రీరిలీజ్ బిజినెస్ చాలా భారీగానే జరిగింది. తెలంగాణ ఏరియాలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే అద్భుతమే జరగాలి. ఎందుకంటే ఇప్పటి వరకూ ఆర్ఆర్ఆర్ తప్ప జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఏ మూవీ ఆ మార్క్ అందుకోలేదు.
భారీగా దేవర ప్రీరిలీజ్ బిజినెస్.. తెలంగాణలో బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?
భారీగా దేవర ప్రీరిలీజ్ బిజినెస్.. తెలంగాణలో బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

భారీగా దేవర ప్రీరిలీజ్ బిజినెస్.. తెలంగాణలో బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Devara Pre-release business: దేవర మూవీ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. శుక్రవారం (సెప్టెంబర్ 27) మూవీ రిలీజ్ కానున్నా.. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాతి నుంచే షోలు ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల హంగామా మామూలుగా లేదు. అయితే ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ కూడా అంతే భారీ స్థాయిలో జరిగింది.

దేవర ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు

దేవర మూవీకి ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే తెలంగాణలో మాత్రం ఇది మరో లెవల్లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ ఇక్కడ సేఫ్ జోన్ లోకి వెళ్లాలంటే కనీసం రూ.53 కోట్లు అయినా వసూలు చేయాలని తాజాగా ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది. ఈ మూవీ హైదరాబాద్ లో రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ అవుతోంది.

పైగా ప్రభుత్వం కూడా టికెట్ల ధరలను పెంచుకోవడానికి, అదనపు షోలకు అనుమతి ఇచ్చింది. దీంతో మేకర్స్ ఈ టార్గెట్ అందుకుంటామన్న నమ్మకంతో ఉన్నారు. నైజాం ఏరియాలో కనీసం రూ.45 కోట్లు వస్తేగానీ బ్రేక్ ఈవెన్ చేరుకునే అవకాశం లేదని ఓ ట్రేడ్ ఎక్స్‌పర్ట్ చెప్పినట్లు సదరు రిపోర్టు తెలిపింది.

దేవర సాధిస్తాడా?

అయితే నైజాం ఏరియాలో ఇంత భారీ వసూళ్లు సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రమే తెలంగాణ ప్రాంతంలో రూ.50 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.

దీంతో దేవర ఆ మార్క్ అందుకోవడం అంత సులువుగా కనిపించడం లేదు. తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు వస్తేనే దేవర మూవీకి మంచి ఓపెనింగ్స్ లభించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినా అది కష్టమే.

ఆరేళ్ల తర్వాత తారక్ సోలో హీరోగా నటించిన మూవీ దేవర. ఆర్ఆర్ఆర్ తర్వాత రెండున్నరేళ్లకు రిలీజ్ అవుతున్న మూవీ ఇది. దీంతో ఈ మూవీపై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. తండ్రీకొడుకులుగా డ్యుయల్ రోల్లో తారక్ నటించిన దేవర మూవీని కొరటాల శివ డైరెక్ట్ చేయగా.. యువసుధ ఆర్ట్స్, కల్యాణ్ రామ్ ఈ మూవీని నిర్మించారు.

సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిందీ దేవర పార్ట్ 1. మూవీకి సీక్వెల్ కూడా ఉండనుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లాంటి బాలీవుడ్ నటీనటులు కూడా నటించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు.

దేవర ఓటీటీ వివరాలు

దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విడుదలకు రెండు రోజుల ముందుగా దేవర ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఓ అప్డేట్ వైరల్ అవుతోంది.

దేవర ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ దిగ్గజ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని సమాచారం. అయితే, థియేట్రికల్ రిలీజ్ అయిన 50 రోజుల తర్వాతే దేవర ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్‌తో మేకర్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు టాక్ నడుస్తోంది. దేవర టాక్ ఎలా ఉన్నా, బాక్సాఫీస్ కలెక్షన్స్ తగ్గినా.. పెరిగినా.. ఓటీటీ రిలీజ్ విషయంలో ఏమాత్రం మార్పు లేదని తెలుస్తోంది.

తదుపరి వ్యాసం