Chuttamalle Song: చుట్టమల్లే పాటను ఆలియా భట్ ఎంత బాగా పాడిందో చూడండి.. ఆశ్చర్యపోయిన జూనియర్ ఎన్టీఆర్-chuttamalle song alia bhatt sings devara song jr ntr praises her karan johar show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chuttamalle Song: చుట్టమల్లే పాటను ఆలియా భట్ ఎంత బాగా పాడిందో చూడండి.. ఆశ్చర్యపోయిన జూనియర్ ఎన్టీఆర్

Chuttamalle Song: చుట్టమల్లే పాటను ఆలియా భట్ ఎంత బాగా పాడిందో చూడండి.. ఆశ్చర్యపోయిన జూనియర్ ఎన్టీఆర్

Hari Prasad S HT Telugu
Sep 24, 2024 02:06 PM IST

Chuttamalle Song: చుట్టమల్లే చుట్టేస్తాందె అంటూ దేవర మూవీలోని పాటను బాలీవుడ్ నటి ఆలియా భట్ పాడిన వీడియో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి చేసిన ఓ టాక్ షోలో ఆమె ఇలా ఓ తెలుగు పాటను ఎంతో అందంగా పాడి ఆశ్చర్యపరిచింది.

చుట్టమల్లే పాటను ఆలియా భట్ ఎంత బాగా పాడిందో చూడండి.. ఆశ్చర్యపోయిన జూనియర్ ఎన్టీఆర్
చుట్టమల్లే పాటను ఆలియా భట్ ఎంత బాగా పాడిందో చూడండి.. ఆశ్చర్యపోయిన జూనియర్ ఎన్టీఆర్

Chuttamalle Song: దేవర మూవీ నుంచి వచ్చిన చుట్టమల్లే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు కదా. ఈ పాట కాపీ అన్న విమర్శలు ఎన్ని వచ్చినా.. ఎన్టీఆర్ అభిమానులను మాత్రం బాగా ఆకట్టుకుంది. ఇప్పుడీ పాటను బాలీవుడ్ నటి ఆలియా భట్ పాడింది. దేవర ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ తో కలిసి ఆలియా, తారక్ చేసిన టాక్ షోలో భాగంగా ఆమె ఈ పాట పాడింది.

ఆలియా నోట చుట్టమల్లే సాంగ్

ఆలియా భట్ ఓ బాలీవుడ్ నటి. హిందీ, ఇంగ్లిష్ ఎంతో అనర్గళంగా మాట్లాడగలదు. కానీ అలాంటి నటి నోట ఇప్పుడు దేవర మూవీలోని చుట్టమల్లే సాంగ్ రావడం ఆశ్చర్యం కలిగించింది. అది కూడా ఎంతో ప్రొఫెషనల్ సింగర్ లాగా, తెలుగు బాగా తెలిసిన వ్యక్తిలాగా అలవోకగా పాడేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్.. దేవర కా జిగ్రా పేరుతో ఓ టాక్ షో ఏర్పాటు చేశాడు. దీనికి ఈ ఇద్దరు స్టార్లను ఆహ్వానించాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ఈ శుక్రవారమే (సెప్టెంబర్ 27) రిలీజ్ కానుండగా.. ఆలియా భట్ జిగ్రా అనే మూవీలో నటిస్తోంది. దీంతో ఇద్దరినీ కలిపి అతడీ షో చేశాడు. ఇందులో చుట్టమల్లే పాట పాడి ఎన్టీఆర్ ను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది ఆలియా భట్.

ఆలియాతో అనుబంధంపై ఎన్టీఆర్

ఇదే టాక్ షోలో ఆలియా భట్ తో తనకు ఉన్న ఫ్రెండ్షిప్ గురించి జూనియర్ ఎన్టీఆర్ షేర్ చేసుకున్నాడు. నార్త్ ఇండస్ట్రీలో, బాంబేలో తనకు ఆలియాను మించిన ఫ్రెండ్ లేరని తారక్ ఈ సందర్భంగా అన్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీలో ఆలియా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా నుంచే వీళ్ల ఫ్రెండ్షిప్ మొదలైంది.

ఆలియా నటనకు తాను చాలా పెద్ద అభిమానిని అని, ఇండియాలో ఇప్పటి యాక్టర్స్ లో బెస్ట్ అని తారక్ అనడం విశేషం. అటు ఆలియా కూడా జూనియర్ ఎన్టీఆర్ నటనను ఆకాశానికెత్తింది. సెట్లోకి తొలిసారి అడుగుపెట్టినప్పుడు తారక్ ను చూసి భయపడ్డానని, అయితే అతడు చాలా కామ్ గా ఉంటాడని చెప్పింది. తారక్ తన నటనంతా కళ్లలోనే చూపించేస్తాడని, అందుకే తనకు భాష రాకపోయినా అతడు ఏం చెబుతున్నాడన్నది అర్థం చేసుకునేదానినని తెలిపింది.

చుట్టమల్లే సాంగ్ లిరిక్స్

దేవర మూవీలోని చుట్టమల్లే సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. ఈ పాట లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం.. మీరూ ఆలియాలాగా పాడేసేయండి.

చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు

ఊరికే ఉండదు కాసేపూ....

అస్తమానం నీ లోకమే నా మైమరపు

చేతనైతే నువ్వే నన్నాపు

రా నా నిద్దర కులాసా నీ కలలకిచ్చేశా

నీ కోసం వయసు వాకిలి కాశా....

రా నా ఆశలు పోగేశా నీ గుండెకు అచ్చేశా

నీ రాకకు రంగం సిద్ధం చేశా

ఎందుకు పుట్టిందో పుట్టింది

ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది

పుడతానే నీ పిచ్చి పట్టింది

నీపేరు పెట్టింది.. వయ్యారం

ఓణీ కట్టింది గోరింట పెట్టింది

సామికి మొక్కులు కట్టింది

చుట్టమల్లే చుట్టేస్తాంది.. హా చుట్టేస్తాంది.. చుట్టమల్లే చుట్టేస్తాంది..

చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు

ఊరికే ఉండదు కాసేపూ....

మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి

హత్తుకోలేవా మరి సరసన చేరీ..

వాస్తుగా పెంచానిట్టా వందకోట్ల సొగసిరి

ఆస్తిగా అల్లేసుకో కొసరి కొసరీ..

చెయ్యరా ముద్దుల దాడి

ఇష్టమేలే నీ సందడి

ముట్టడించి ముట్టేసుకోలేవ

ఓసారి చెయిజారి

రా ఏ బంగరు నక్లీసు.. నా ఒంటికి నచ్చట్లే

నీ కౌగిలితో నను సింగారించు

రా ఏ వెన్నెల జోలాలి నను నిద్దర పుచ్చట్లే

నా తిప్పలు కొంచెం ఆలోచించు

ఎందుకు పుట్టిందో పుట్టింది

ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది

పుడతానే నీ పిచ్చి పట్టింది

నీపేరు పెట్టింది వయ్యారం

ఓణీ కట్టింది గోరింట పెట్టింది

సామికి మొక్కులు కట్టింది

చుట్టమల్లే చుట్టేస్తాంది.. హా చుట్టేస్తాంది.. చుట్టమల్లే చుట్టేస్తాంది..

చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు

ఊరికే ఉండదు కాసేపూ....