Jr NTR Thanks Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. ట్వీట్ వైరల్
Jr NTR Thanks Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్. దేవర మూవీ టికెట్ల ధరలను పెంచడంతోపాటు అర్ధరాత్రి షోలకు అనుమతి ఇవ్వడంపై స్పందిస్తూ.. తారక్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Jr NTR Thanks Revanth Reddy: దేవర మూవీ టికెట్ల ధరల పెంపుతోపాటు అర్ధరాత్రి షోలు, రోజుకు ఆరు షోలకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు చెప్పాడు. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 27) మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్లలో బిజీగా ఉన్న తారక్.. ఎక్స్ వేదికగా రేవంత్ కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు.
జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా దేవర. సాధారణంగా ఏ పెద్ద సినిమా రిలీజైనా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు, అదనపు షోలను ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వడం తెలుగు రాష్ట్రాల్లో సాధారణమైపోయింది. దేవర మూవీకి కూడా అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.
పది రోజుల పాటు టికెట్ల ధరలను పెంచుకోవడంతోపాటు అదనపు షోలకు కూడా అనుమతి ఇవ్వడం విశేషం. దీంతో ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు.
ఆ ఇద్దరికీ థ్యాంక్స్
"దేవర రిలీజ్ కోసం కొత్త జీవోను జారీ చేసినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంతటి మద్దతు ఇస్తున్నందుకు నేను రుణపటి ఉంటాను" అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.
దేవర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దయిన తర్వాత అతడు లాస్ ఏంజెల్స్ వెళ్లాడు. అక్కడి బియాండ్ ఫెస్ట్ 2024లోనే దేవర వరల్డ్ ప్రీమియర్ షో వేయనున్నారు. దీనికోసమే అతడు అక్కడికి వెళ్లాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాతి నుంచీ దేవర హంగామా మొదలు కానుంది.
భారీగా పెరిగిన టికెట్ల ధరలు
దేవర మూవీ టికెట్ల ధరలను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఇక్కడి మల్టీప్లెక్స్ లలో గరిష్ఠంగా రూ.413, సింగిల్ స్క్రీన్లలో రూ.295 పరిమితి విధించారు. తొలి రోజు మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయి. ఇక రెండో రోజు నుంచి మల్టీప్లెక్స్ లలో గరిష్ఠంగా రూ.354, సింగిల్ స్క్రీన్లలో రూ.206 రేట్లు అమలు చేయనున్నారు.
దేవర మూవీ షోలు గురువారం అర్ధరాత్రి దాటిని తర్వాత ఒంటి గంట నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ షోలు ఉండే థియేటర్ల జాబితాను కూడా రిలీజ్ చేశారు. ఇక రోజుకు ఆరు షోలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ తోపాటు జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ నటించారు.
స్పెషల్ షోలు ఈ థియేటర్లలోనే..
29 థియేటర్లలో సెప్టెంబర్ 27న అర్ధరాత్రి దేవర ఒంటి గంట షోలు ఉండనున్నాయి.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‍రోడ్స్ - సుదర్శన్ 35ఎంఎం, దేవీ 70ఎంఎం, సంధ్య 35ఎంఎం, సంధ్య 70ఎంఎం థియేటర్లు
కూకట్‍పల్లి - విశ్వనాథ్, మల్లికార్జున, భ్రమరాంబ, అర్జున్ థియేటర్లు
ఎర్రగడ్డ - గోకుల్ థియేటర్లు
మూసాపేట - శ్రీరాములు
అత్తాపూర్ - ఎస్‍వీసీ ఈశ్వర్
ఆర్సీ పురం - ఎస్‍వీసీ సంగీత
మల్కాజ్‍గిరి - శ్రీసాయిరాం
దిల్‍సుఖ్‍నగర్ - కోనార్క్
కర్మాన్‍ఘాట్ - ఎస్‍వీసీ శ్రీలక్ష్మి
మాదాపూర్ - బీఆర్ హైటెక్
గచ్చిబౌలీ - ఏఎంబీ సినిమాస్
ఆమిర్ పేట్ - ఏఏఏ సినిమాస్
కూకట్‍పల్లి - పీవీఆర్ నెక్సస్ మాల్
ఎన్టీఆర్ గార్డెన్స్ - ప్రసాద్ మల్టీప్లెక్స్
నల్లగడ్డ - అపర్ణ థియేటర్
ఖమ్మం - శ్రీతిరుమల, వినోద, సాయిరామ్, శ్రీనివాస, కేపీఎస్ ఆదిత్య
మిర్యాలగూడ - విట్రోస్ సినీప్లెక్స్
మహబూబ్‍నగర్ - ఏవీడీ తిరుమల కాంప్లెక్స్
గద్వాల్ - ఎస్‍వీసీ మల్టీప్లెక్స్