Devara History: చరిత్ర సృష్టించిన జూనియర్ ఎన్టీఆర్ దేవర.. అక్కడ ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమా రికార్డు
10 September 2024, 13:00 IST
- Devara History: జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేయడం విశేషం. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా.. మంగళవారం (సెప్టెంబర్ 10) సాయంత్రం ట్రైలర్ రిలీజ్ రిలీజ్ చేయనున్నారు.
చరిత్ర సృష్టించిన జూనియర్ ఎన్టీఆర్ దేవర.. అక్కడ ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమా రికార్డు
Devara History: దేవర మూవీకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో తాజాగా ఆ సినిమా క్రియేట్ చేసిన రికార్డు చూస్తే తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన ఈ మూవీ.. నార్త్ అమెరికాలో రిలీజ్ కు మూడు వారాల ముందే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. సెప్టెంబర్ 27న సినిమా రిలీజ్ కానుండగా.. ఇప్పటికే టికెట్ల అమ్మకాల్లో మిలియన్ డాలర్ల మార్క్ అందుకోవడం విశేషం.
అత్యంత వేగంగా మిలియన్ డాలర్స్ మార్క్
దేవర మూవీ అత్యంత వేగంగా మిలియన్ డాలర్స్ మార్క్ అందుకున్న ఇండియన్ సినిమాగా నార్త్ అమెరికాలో చరిత్ర సృష్టించింది. కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే ఈ సినిమాకు ఇంత క్రేజ్ ఏర్పడటం చూస్తుంటే.. తారక్ మూవీ కోసం అతని అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
మూవీ రిలీజ్ కు ఇంకా సుమారు మూడు వారాల సమయం ఉంది. కానీ అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ లోనే మిలియన్ డాలర్ల మార్క్ చేరుకుంది దేవర మూవీ. ఆర్ఆర్ఆర్ తర్వాత రెండున్నరేళ్లకు వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇదే కావడంతో దేవరకు హైప్ మామూలుగా లేదు.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి?
నార్త్ అమెరికాలోనే దేవర సినిమాకు ఈ స్థాయి క్రేజ్ నెలకొంది. ఆ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయితే మరెన్ని రికార్డులు బ్రేకవుతాయో అన్న ఆసక్తి సినీ ప్రేక్షకుల్లో నెలకొంది. ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25, 2022న రిలీజైంది. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.
అయితే ఆ తర్వాత అతడు నటించిన మరో సినిమా రిలీజ్ కాలేదు. సుమారు 30 నెలల తర్వాత ఇప్పుడు దేవర వస్తోంది. కొరటాల శివ డైరెక్షన్ లోనే గతంలో తారక్ నటించిన జనతా గ్యారేజ్ క్రియేట్ చేసిన రికార్డుల నేపథ్యంలో దేవర మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
దేవర మూవీ గురించి..
దేవర మూవీని సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఫిమేల్ లీడ్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించాడు. ఈ ఇద్దరు బాలీవుడ్ స్టార్లకు ఇదే తొలి తెలుగు సినిమా. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు.
ఇప్పటికే వచ్చిన మూడు పాటలూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. మూడేళ్ల కిందటే మూవీని అనౌన్స్ చేయగా.. సినిమా నిర్మాణం మెల్లగా సాగింది. గతేడాది సినిమా అధికారిక టైటిల్ అనౌన్స్ చేశారు.
మరోవైపు ఈ సినిమా ప్రమోషన్లలో జూనియర్ ఎన్టీఆర్ చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం అతడు ఆదివారమే (సెప్టెంబర్ 8) ముంబైకి వెళ్లాడు. తన ఎడమ చేతికి తగిలిన గాయం నుంచి కూడా తారక్ పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తున్నాడు.