Devara Trailer Time: దేవర ట్రైలర్ రిలీజ్‍కు టైమ్ ఖరారు.. మాస్ యాక్షన్ ట్రీట్ సిద్ధం!
Devara Trailer Release Date Time: దేవర సినిమా ట్రైలర్ విడుదలకు టైమ్ కూడా ఫిక్స్ అయింది. ఈ ట్రైలర్ యాక్షన్‍తో నిండిపోయి ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. యాక్షన్ ఫీస్ట్ అంటూ మూవీ టీమ్ కూడా హింట్ ఇచ్చేసింది. దేవర ట్రైలర్ ఎప్పుడు రానుందంటే..
సినీ ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్న దేవర సినిమా ట్రైలర్ ఇంకొక్క రోజులో సెప్టెంబర్ 10న రానుంది. భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ నుంచి యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ రెడీ అయింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవరపై క్రేజ్ విపరీతంగా ఉంది. ఈ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈ మూవీ ట్రైలర్ రేపు (సెప్టెంబర్ 10) వచ్చేయనుంది. ఏ సమయానికి రానుందో టైమ్ కూడా నేడు ఖరారైంది.
ఏ సమయానికి వస్తుందంటే..
దేవర మూవీ ట్రైలర్ రేపు (సెప్టెంబర్ 10) సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవ టీమ్ నేడు (సెప్టెంబర్ 9) వెల్లడించింది. ట్రైలర్ డేట్‍ను వినాయక చవితి సందర్భంగానే మూవీ టీమ్ ప్రకటించింది. అయితే, టైమ్‍ను ఇప్పుడు ఖరారు చేసింది.
మాస్ ట్రీట్
దేవర నామసంవత్సరంలో మాస్ ట్రీట్‍ను తీసుకొస్తున్నామని మూవీ టీమ్ వెల్లడించింది. “భయం, కోపం -ఓ భయంకరమైన విశ్వరూపం. దేవర నామసంవత్సరంలో చాలా గుర్తుండిపోయే ఓ మాస్ ట్రీట్ తీసుకొస్తున్నాం. దేవర ట్రైలర్ రేపు సాయంత్రం 5.04 గంటలకు” అని ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్వీట్ చేసింది.
దేవర మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అనేలా మరో పోస్టర్ తీసుకొచ్చింది. అగ్నికీలలు ఎగిసిపడుతున్న సముద్రం నుంచి ఇంటెన్స్‌గా ఎన్టీఆర్ చూస్తున్నట్టు ఈ పోస్టర్ ఉంది. అలాగే, మరో రోల్‍లో కత్తి పట్టుకొని సముద్రంలోకి నడిచివెళుతున్నట్టుగా ఉంది.
ముంబైలో ట్రైలర్ లాంచ్
దేవర సినిమా ట్రైలర్ లాంచ్ రేపు ముంబైలో జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ముంబైకు చేరుకున్నారు ఎన్టీఆర్. ట్రైలర్ లాంచ్‍తో పాటు అక్కడి మీడియాతోనే ఆయన మాట్లాడనున్నారు. ప్రమోషన్లను షురూ చేయనున్నారు. ఈ సినిమా కోసం జోరుగా ప్రమోషన్లను చేసేలా మూవీ టీమ్ ప్లాన్ చేసిందని తెలుస్తోంది. దేవర మూవీ సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో రిలీజ్ కానుంది.
దేవర చిత్రం నుంచి గతంలో వచ్చిన గ్లింప్స్ మొత్తం యాక్షన్‍తో అదిరిపోయింది. సముద్రాన్ని ఎన్టీఆర్ ఎరుపెక్కించేశారు. రేపు వచ్చే ట్రైలర్ కూడా మాస్ యాక్షన్‍తో పవర్‌ఫుల్‍గా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన మూడు పాటలతో మెప్పించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఇచ్చారో అనే ఉత్కంఠ కూడా ఉంది.
దేవర సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేసిన మూవీ కావడం, హైవోల్టేజ్ యాక్షన్‍తో వస్తుండటంతో హైప్ విపరీతంగా ఉంది. పాన్ ఇండియా రేంజ్‍లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ చిత్రంపై హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ చాలా కాన్ఫిడెంట్‍గా ఉన్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, శృతి మరాఠే, ప్రకాశ్ రాజ్ కీరోల్స్ చేశారు.