Devara Collection: మళ్లీ 60 శాతం తగ్గిన దేవర కలెక్షన్స్- అక్కడ లక్ష మాత్రమే- కానీ, 400 కోట్లకు దగ్గరిగా- లాభాలు ఎంతంటే?
08 October 2024, 14:46 IST
Devara 11 Days Worldwide Box Office Collection: దేవర మూవీ కలెక్షన్స్ 11వ రోజు కూడా పడిపోయాయి. పదో రోజుతో పోలిస్తే.. 11వ రోజు సుమారుగా 60 శాతం వరకు నెట్ కలెక్షన్స్ తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ థ్రిల్లర్ దేవర సినిమాకు 11 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్, లాభాలపై ఓ లుక్కేద్దాం.
దేవర మూవీ 11 రోజుల కలెక్షన్స్, లాభాలు
Devara Worldwide Collection: దేవర మూవీ కలెక్షన్స్ హెచ్చు తగ్గులతో కొనసాగుతున్నాయి. వీకెండ్స్‌లో బాగా కలెక్షన్స్ కొల్లగొడుతోన్న దేవర మూవీ వీక్ డేస్ వచ్చేసరికి చాలా పతనం అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా 11వ రోజు కూడా ఇండియాలో దెవర నెట్ కలెక్షన్స్ తగ్గిపోయాయి.
అతి తక్కువగా తమిళనాడులో
సెప్టెంబర్ 11వ రోజు అయిన సోమవారం నాడు దేవర సినిమాకు భారతదేశంలో రూ. 5 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. వాటిలో తెలుగు నుంచి రూ. 3.48 కోట్లు, హిందీ నుంచి రూ. 1.35 కోట్లు, కర్ణాటక నుంచి 5 లక్షలు, తమిళనాడు నుంచి మరి తక్కువగా 1 లక్ష, ఇక మలయాళం వెర్షన్‌లో రెండు లక్షలు మాత్రమే వచ్చాయి.
ఈ లెక్కన పదో రోజు వచ్చిన రూ. 12.65 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో పోలిస్తే.. పదకొండో రోజు వచ్చేసరికి దేవరకు 60.47 శాతం కలెక్షన్స్ తగ్గాయి. ఇదివరకు కూడా 8వ రోజున 60 శాతానికిపైగా వసూళ్లు పడిపోయాయి.
ఇక ఇండియావైడ్‌గా 11 రోజుల్లో దేవర మూవీ రూ. 248.75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ కలెక్షన్స్‌లో తెలుగు నుంచి రూ. 185.2 కోట్లు, హిందీ ద్వారా 54.6 కోట్లు, కర్ణాటక నుంచి 1.93 కోట్లు, తమిళం నుంచి 5.7 కోట్లు, మలయాళం ద్వారా 1.32 కోట్లుగా ఉన్నాయి.
దేవర షేర్ కలెక్షన్స్
ఇక ఇండియా వైడ్‌గా 11 రోజుల్లో దేవరకు రూ. 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, వరల్డ్ వైడ్‌గా 369 కోట్ల నెట్ కలెక్షన్స్ జమ అయ్యాయి. ఇవన్నీ పక్కన పెడితే తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో 11వ రోజున దేవర చిత్రానికి రూ. 2.54 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే, 11 రోజుల్లో రూ. 138.37 కోట్లు షేర్, రూ. 197.40 కోట్ల గ్రాస్ రాబట్టింది ఈ చిత్రం.
టోటల్ ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో దేవర చిత్రానికి 225.64 కోట్ల షేర్ కలెక్షన్స్ వస్తే.. రూ. 391.60 కోట్ల గ్రాస్ వసూలు అయింది. అంటే, 400 కోట్ల గ్రాస్‌కు దేవర దగ్గరిలో ఉంది. వీటిలో కర్ణాటక నుంచి రూ. 16.65 కోట్లు, తమిళనాడులో 4.03 కోట్లు, కేరళలో 94 లక్షలు, హిందీతోపాటు ఇతర మిగిలిన రాష్ట్రాల్లో రూ. 30.70 కోట్లు షేర్ వసూళ్లు రాగా.. ఓవర్సీస్‌లో దాదాపుగా రూ. 34.95 కోట్లు వచ్చినట్లు సమాచారం.
దేవర ప్రాఫిట్
ఇక ఆస్ట్రేలియాలో 950K డాలర్స్ కొల్లగొట్టింది. అంటే దాదాపుగా 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ అక్కడ రాబట్టింది దేవర సినిమా. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ టీమ్ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే, 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసిన దేవర సినిమా 11 డేస్‌లో ఇప్పటికీ రూ. 41.64 కోట్ల లాభాలు సాధించి.. కమర్షియల్‌గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
కాగా.. దేవర చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడీగా నటించిన విషయం తెలిసిందే. జనతా గ్యారేజ్ సినిమా తర్వాత ఎన్టీఆర్-కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవరపై మంచి అంచనాలతో రిలీజ్ అయి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కానీ, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా సత్తా చాటుతోంది.
టాపిక్