Devara Collection: మరింత పతనమైన దేవర కలెక్షన్స్.. కానీ, పెరిగిన లాభాలు.. 8 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Devara 8 Days Worldwide Box Office Collection: దేవర మూవీ కలెక్షన్స్ ఎనిమిదో రోజు మరింతగా తగ్గిపోయాయి. ఏడో రోజుతో పోలిస్తే.. 17.24 శాతం బాక్సాఫీస్ కలెక్షన్స్ పతనం అయ్యాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాకు 8 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్, లాభాలు ఎంతో ఓ లుక్కేద్దాం.
Devara Worldwide Collection: దేవర సినిమా కలెక్షన్స్ మరింత పతనం అయ్యాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన సినిమా దేవర. మొదటి పార్ట్‌గా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దేవర సినిమాకు తొలి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి.
8వ రోజు పతనం
ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ మధ్యలో పెరుగుతూ వచ్చాయి దేవర కలెక్షన్స్. ఇక వారం రోజున 65 శాతానికి పైగా తగ్గిన దేవర కలెక్షన్స్ ఎనిమిదో రోజు మరింతగా పతనం అయ్యాయి. 7వ రోజుతో పోలిస్తే.. 8వ రోజున ఇండియాలో 17.24 శాతం వసూళ్లు తగ్గాయి. దేవర సినిమాకు డే 8న ఇండియా వ్యాప్తంగా రూ. 6 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.
దేవర 8 డేస్ కలెక్షన్స్
వాటిలో రూ. 3.8 కోట్ల తెలుగు నుంచి, హిందీ నుంచి 2 కోట్లు, కర్ణాటక నుంచి 3 లక్షలన్, మలయాళం వెర్షన్‌కు 2 లక్షలు, తమిళంలో రూ. 15 లక్షలుగా నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక షేర్ కలెక్షన్స్ చూస్తే.. ఏపీ తెలంగాణలో 8వ రోజున రూ. 2.63 కోట్లు రాగా.. మొత్తం 8 రోజుల్లో రూ. 125.8 కోట్లు వచ్చాయి. అలాగే, రూ. 176.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి.
ఇండియాలో వసూళ్లు
కర్ణాటక రాష్ట్రంలో 8 రోజుల్లో దేవర చిత్రానికి 15.15 కోట్లు, తమిళనాడులో రూ. 3.90 కోట్లు, కేరళలో 85 లక్షలు, హిందీతోపాటు ఇతర రాష్ట్రాల్లో 26.30 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఓవర్సీస్‌లో 32.50 కోట్ల షేర్ వచ్చింది. ఇక ఇండియా వ్యాప్తంగా 8 రోజుల్లో 221.6 కోట్ల నెట్ కలెక్షన్స్‌ను దేవర సినిమా రాబట్టింది.
దేవర వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ఈ నెట్ కలెక్షన్స్‌లో తెలుగు నుంచి 167.8 కోట్లు, హిందీ నుంచి 46 కోట్లు, కర్ణాటక నుంచి 1.61 కోట్లు, తమిళంలో 4.95 కోట్లు, మలయాళంలో 1.24 కోట్లుగా నెట్ ఇండియా కలెక్షన్స్ ఉన్నాయి. అలాగే, రూ. 262.25 కోట్లుగా దేవర ఇండియా గ్రాస్ కలెక్షన్స్‌గా ఉన్నాయి. ఓవర్సీస్‌లో 70.75 కోట్ల నెట్ వసూళ్లు వస్తే ఓవరాల్ వరల్డ్ వైడ్‌గా 333 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.
దేవర లాభాలు
అలాగే, ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా 8 డేస్‌లో రూ. 203.73 కోట్ల షేర్, రూ. 350.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక, వరల్డ్ వైడ్‌గా రూ. 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసుకున్న దేవర మూవీ ఇప్పటికీ అంటే 8 రోజుల్లో రూ. 19.73 కోట్ల లాభాలను చవిచూసింది. దీంతో దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా హిట్‌గా నలిచింది.