Devara Collection: ఏడో రోజు 65 శాతం పడిపోయిన దేవర కలెక్షన్స్.. అయినా 342 కోట్ల వసూళ్లు.. మరి లాభాలు ఎంతంటే?
Devara 7 Days Worldwide Box Office Collection: దేవర మూవీ కలెక్షన్స్ ఏడో రోజు 65 శాతానికి పైగా పడిపోయాయి. కానీ, జూనియర్ ఎన్టీఆర్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ దేవర వారం రోజుల్లో బాగానే లాభాలను చవిచూసింది. ఈ క్రమంలోనే దేవర వారం రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఏంటనే పూర్తి వివరాల్లోకి వెళితే..
Devara 1st Week Box Office Collection: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన తొలి సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ దేవర సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైంది. అయితే, వారం రోజులు పూర్తి చేసుకున్న దేవర మూవీ ఏడో రోజు వసూళ్లు మాత్రం పడిపోయాయి.
పడిపోయిన దేవర కలెక్షన్స్
గాంధీ జయంతి సెలవుల అనంతరం గురువారం (అక్టోబర్ 3) దేవర బాక్సాఫీస్ వద్ద 65.48 శాతం పడిపోయింది. అంటే, అక్టోబర్ 2న ఆరో రోజున రూ. 21 కోట్ల (ఆ ముందు రోజుతో పోలిస్తే 50 శాతం పెరుగుదల) నెట్ కలెక్షన్స్ రాబట్టిన దేవర ఏడో రోజు మాత్రం రూ. 7.25 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ లెక్కన ఆరో రోజుతో పోలిస్తే.. ఏడో రోజున 65.48 శాతం కలెక్షన్స్ పడిపోయాయి.
ఏడో రోజు దేవర సినిమా కలెక్ట్ చేసిన 7.25 కోట్లల్లో తెలుగు నుంచి రూ. 4.65 కోట్లు, హిందీ నుంచి 2.25 కోట్లు, కర్ణాటక వెర్షన్‌కు 8 లక్షలు, తమిళనాడులో 25 లక్షలు, మలయాళంలో అతి తక్కువగా 2 లక్షలు నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అదే తెలుగు రాష్ట్రాల్లో దేవరకు ఏడో రోజున రూ. 2.81 కోట్ల షేర్, రూ. 4.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి.
ఇండియా వైడ్‌గా
వారం రోజుల్లో దేవరకు ఇండియావ్యాప్తంగా రూ. 215.6 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. వీటిలో తెలుగు నుంచి 164 కోట్లు, హిందీ ద్వారా 44 కోట్లు, కర్ణాటక నుంచి 1.58 కోట్లు, తమిళ వెర్షన్‌కు 4.8 కోట్లు, మలయాళంలో 1.22 కోట్ల నెట్ వసూళ్లు ఉన్నాయి. అలాగే, ఇండియా వైడ్‌గా దేవరకు రూ. 255 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
దేవర చిత్రానికి వారం రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 122.45 కోట్ల షేర్ కలెక్షన్స్ రాగా.. రూ. 172.25 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది. అలాగే, వరల్డ్ వైడ్‌గా రూ. 324.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వస్తే.. 199.43 కోట్ల షేర్, 342.30 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన దేవర సినిమాకు రూ. 182.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగి రూ. 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది.
బ్రేక్ ఈవెన్ పూర్తి-లాభాలు
అతి తక్కువ రోజుల్లోనే ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకున్న దేవర సినిమా ఇప్పటికీ రూ. 15.43 కోట్ల లాభాలను రాబట్టింది. అలాగే, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో 153.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌కు 155 కోట్లకుపైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేసి రూ. 12.15 కోట్ల ప్రాఫిట్ కొల్లగొట్టింది దేవర చిత్రం.
ఇక ఇతర రాష్ట్రాలైన కర్ణాటకలో రూ. 14.85 కోట్లు, తమిళనాడులో 3.85 కోట్లు, కేరళలో 83 లక్షలు, హిందీతోపాటు ఇతర స్టేట్స్‌లో 25.35 కోట్లు, ఓవర్సీస్‌లో 32.10 కోట్ల షేర్ కలెక్షన్స్‌ను దేవర సినిమా ఏడు రోజుల్లో కొల్లగొట్టింది. అలాగే, ఓవర్సీస్‌లో 69.10 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.