OTT Malayalam Thriller Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-ott malayalam crime investigation thriller movie thalavan to stream in sonyliv ott from september 10th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Malayalam Thriller Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Malayalam Thriller Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
Aug 27, 2024 01:52 PM IST

OTT Malayalam Thriller Movie: సూపర్ హిట్ మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ తలవన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన సుమారు నాలుగు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి అడుగు పెడుతుండటం విశేషం. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేశారు.

ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Malayalam Thriller Movie: మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ తలవన్. ఈ ఏడాది మే 24న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.25 కోట్లు వసూలు కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమా సోనీలివ్ ఓటీటీలోకి రాబోతోంది. బిజు మేనన్, ఆసిఫ్ అలీ నటించిన ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని ఈ మధ్యే అనౌన్స్ చేశారు.

తలవన్ ఓటీటీ రిలీజ్ డేట్

మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కొంతకాలంగా కన్నూరు స్క్వాడ్, అబ్రహం ఓజ్లర్, అన్వేషిపిన్ కండెతుమ్, గరుడన్, గోలమ్ లాంటి సినిమాలు వచ్చాయి. 

ఇక తాజాగా తలవన్ రూపంలో అదే జానర్ మూవీ సోనీలివ్ ఓటీటీలో సెప్టెంబర్ 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మే నెలలోనే థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సుమారు నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది.

ఏంటీ తలవన్ మూవీ?

త‌ల‌వ‌న్ మూవీకి జిస్ జాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మూవీలో మియా జార్జ్‌, అనుశ్రీ హీరో హీరోయిన్లుగా న‌టించారు. పోలీస్ ఆఫీస‌ర్లుగా బిజు మేన‌న్‌, ఆసిఫ్ అలీ యాక్టింగ్‌తో పాటు క‌థ, ట్విస్ట్ బాగున్నాయంటూ త‌ల‌వ‌న్ మూవీపై ఆడియెన్స్ ప్ర‌శంస‌లు కురిపించారు. ఓ పోలీస్ ఆఫీస‌ర్ జీవితంలో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు జిస్ జాయ్ ఈ మూవీని తెర‌కెక్కించాడు.

త‌ల‌వ‌న్ క‌థ ఇదే...

ఎస్ఐ కార్తిక్ వాసుదేవ‌న్ (ఆసిఫ్ అలీ) ట్రాన్స్‌ఫ‌ర్‌పై సీఐ జ‌య‌శంక‌ర్ (బిజు మేన‌న్‌) ప‌నిచేస్తోన్న పోలీస్ స్టేష‌న్‌కు వ‌స్తాడు. కార్తిక్ దూకుడు మ‌న‌స్త‌త్వం జ‌య‌శంక‌ర్‌కు న‌చ్చ‌దు. ఓ కేసులో అరెస్ట్ అయిన మ‌నుదాస్ అనే స్నేహితుడిని జ‌య‌శంక‌ర్ అనుమ‌తి లేకుండా కార్తిక్ విడుద‌ల‌ చేస్తాడు. ఆ విష‌యంలో కార్తిక్‌తో జ‌య‌శంక‌ర్ గొడ‌వ‌ ప‌డతాడు. జ‌య‌శంక‌ర్‌పై రివేంజ్ తీర్చుకునేందుకు ఎదురుచూస్తుంటాడు కార్తిక్‌.

ఈ గొడవ జ‌రిగిన కొన్నాళ్ల త‌ర్వాత జయశంకర్ ఇంటి టెర్రస్ పై రమ్య అనే యువ‌తి డెడ్‌బాడీ దొరుకుతుంది. ర‌మ్య‌తో జ‌య‌శంక‌ర్‌కు ఎఫైర్ ఉంద‌నే పుకార్లు ఉండ‌టంతో ఈ హ‌త్య అత‌డే చేశాడ‌ని పోలీసులు అనుమానిస్తారు. అత‌డిని అరెస్ట్ చేస్తారు. అస‌లు ర‌మ్య‌ను ఎవ‌రు హ‌త్య ఎవ‌రు? ఈ నేరంలో జ‌య‌శంక‌ర్ ఎలా చిక్కుకున్నాడు? ఈ మ‌ర్డ‌ర్ కేసును ఇన్వేస్టిగేష‌న్ చేసే బాధ్య‌త‌ను కార్తిక్ చేప‌ట్ట‌డానికి కార‌ణం ఏమిటి? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

పోలీస్ పాత్ర‌ల‌తో..

పోలీస్ పాత్ర‌ల‌తో మ‌ల‌యాళంలో బిజు మేన‌న్ చేసిన సినిమాలు అన్ని హిట్ట‌య్యాయి. అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్‌, తుండు, శివ‌మ్‌, పాత్ర‌మ్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో పోలీస్ ఆఫీస‌ర్ రోల్స్ చేశాడు బిజు మేన‌న్‌. మ‌ల‌యాళంలో హీరోగా డిఫ‌రెంట్ సినిమాలు చేస్తోన్న అతడు.. తెలుగులో ఓ రెండు సినిమాల్లో క‌నిపించాడు.

గోపీచంద్ ర‌ణంతో పాటు రవితేజ ఖ‌త‌ర్నాక్ సినిమాల్లో విల‌న్‌గా న‌టించాడు. అంతేకాదు అతని హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీని తెలుగులో పవన్ కల్యాణ్.. భీమ్లా నాయక్ తో రీమేక్ చేసిన విషయం తెలిసిందే.