తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dasara Hindi Streaming : నెట్‌ఫ్లిక్స్‌లో దసరా హిందీ వెర్షన్.. ఎప్పుడంటే?

Dasara Hindi Streaming : నెట్‌ఫ్లిక్స్‌లో దసరా హిందీ వెర్షన్.. ఎప్పుడంటే?

Anand Sai HT Telugu

24 May 2023, 9:50 IST

    • Dasara Hindi Streaming : నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా సూపర్ హిట్ అయింది. పాన్ ఇండియా లెవెల్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్మురేపింది. తెలుగులో ఓటీటీలోకి వచ్చింది. హిందీ వెర్షన్ విడుదలకు సిద్ధంగా ఉంది.
నాని దసరా
నాని దసరా

నాని దసరా

నాని- కీర్తి సురేశ్(Nani Kerthy Suresh) జంటగా నటించిన చిత్రం దసరా. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ సాధించింది. నాని కెరీర్లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చింది. ఇప్పటికే తెలుగు వెర్షన్ ఓటీటీలో విడుదలైంది. హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Rajinikanth: ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌తో భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియ‌న్ మూవీ తీయోచ్చు - ద‌ళ‌ప‌తి విజ‌య్ రికార్డ్ బ్రేక్‌

Satya OTT: ఓటీటీలోకి నెలకాకముందే తమిళ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్.. అందులో ఆరోజు నుంచే స్ట్రీమింగ్!

Krishna mukunda murari serial today: కృష్ణకి షాకుల మీద షాకులు ఇస్తున్న మీరా.. ఆదర్శ్, ముకుంద పెళ్ళికి ముహూర్తం ఫిక్స్

Blink OTT: ద‌స‌రా హీరో దీక్షిత్ శెట్టి సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రచించి, దర్శకత్వం వహించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా దసరాలో నాని, కీర్తి సురేష్, ధీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సముద్రఖని, సాయి కుమార్ తదితరులు నటించారు. మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో దసరా ఏప్రిల్ 27 నుంచి స్ట్రీమిగ్ . ఇప్పుడు హిందీ వెర్షన్ మే 25 నుంచి ప్రసారం చేయనున్నారు.

దసరా చిత్రం(Dasara Cinema) పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైనప్పటికీ మిగిలిన భాషల్లో అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో మెరుగైన కలెక్షన్లను సాధించిన ఈ సినిమా కేజీఎఫ్, పుష్ప మాదిరిగా ఇతర రాష్ట్రాల్లో మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయింది. 100 కోట్ల గ్రాస్‌ను ఎప్పుడో దాటిన ఈ మూవీ 120 కోట్లకు చేరువలో ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

ఇటీవల బాలీవుడ్ స్టార్ సల్మాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ కంటే కూడా దసరా చిత్రానికి అత్యధికంగా ఓపెనింగ్స్ వచ్చాయి. బాలీవుడ్ మూవీ తలదన్నే రీతిలో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా చిత్రం పీరియాడికల్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కింది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు. నేచురల్ స్టార్ నాని సరసన కీర్తి సురేష్(Keerthy Suresh) హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్ర పోషించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా పాన్ఇండియా స్థాయిలో విడుదలైంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం