Nani 30 OTT Rights Price: భారీ ధరకు అమ్ముడుపోయిన నాని 30వ సినిమా ఓటీటీ రైట్స్
Nani 30 OTT Rights Price:నాని హీరోగా డెబ్యూడెంట్ డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ కంప్లీట్ కాకముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోవడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Nani 30 OTT Rights Price: దసరా (Dasara) సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు హీరో నాని (Nani). గత నాలుగైదేళ్లుగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తోన్న నాని ఈ సినిమాతో కెరీర్‌లో మర్చిపోలేని విజయాన్ని అందుకున్నాడు. మార్చి 30న థియేటర్లలో రిలీజైన దసరా మూవీ వంద కోట్లకుపైగా కలెక్షన్స్ సొంతం చేసుకున్నది.
ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సక్సెస్‌తో నాని తదుపరి సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. దసరా తర్వాత డెబ్యూడెంట్ డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేస్తోన్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో శరవేగంగా జరుగుతోంది.
షూటింగ్ కంప్లీట్ కాకముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ 36 కోట్లకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. భారీ పోటీ మధ్య ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను దక్కించుకోన్నట్లు సమాచారం. నాని కెరీర్‌లో అత్యధిక ధరకు డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఏడు కోట్లకు టీ సిరీస్ కొనుగోలు చేసినట్లు సమాచారం.
డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్‌తోనే నిర్మాతలు పెట్టిన బడ్జెట్‌లో యాభై శాతం రికవరీ అయినట్లు చెబుతోన్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న ఈ సినిమా రిలీజ్ కానుంది. నాని హీరోగా నటిస్తోన్న 30వ సినిమా ఇది.