Crime Thriller Movie: ఓటీటీలోకి వస్తున్న తాప్సీ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సీక్వెల్.. ఎక్కడ చూడాలంటే?
15 July 2024, 12:01 IST
- Crime Thriller Movie: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ సీక్వెల్ వస్తోంది. ఈ సినిమాలో తాప్సీతోపాటు 12th ఫెయిల్ హీరో విక్రాంత్ మస్సీ నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీలోకి వస్తున్న తాప్సీ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సీక్వెల్.. ఎక్కడ చూడాలంటే?
Crime Thriller Movie: రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీస్ ఇష్టపడే వారికి గుడ్ న్యూస్. ఇప్పుడు అలాంటి మూవీ సీక్వెలే ఓటీటీలోకి రాబోతోంది. ఒకప్పుడు టాలీవుడ్ లో నటించిన తాప్సీ పన్ను, విక్రాంత్ మస్సీ నటించిన ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా మూవీ స్ట్రీమింగ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ సోమవారం (జులై 15) అనౌన్స్ చేసింది. ఈ మూవీ ఆగస్ట్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా స్ట్రీమింగ్
నెట్‌ఫ్లిక్స్ లో మూడేళ్ల కిందట అంటే 2021లో హసీన్ దిల్‌రుబా మూవీ రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తన భర్తను హత్య చేసిందని పోలీసులు అనుమానించే రాణి అనే పాత్రలో తాప్సీ పన్ను ఈ సినిమాలో నటించింది. ఇప్పుడీ మూవీకి సీక్వెల్ రాబోతోంది. ఈ సినిమా పేరు ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా.
ఈ సీక్వెల్ ఆగస్ట్ 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 12th ఫెయిల్ మూవీ స్టార్ విక్రాంత్ మస్సీ ఈ సినిమాలో రిషు పాత్రలో నటించాడు. ఇక అభిమన్యుగా సన్నీ కౌశల్, మృత్యుంజయ్ గా జిమ్మీ షెర్గిల్ నటించారు. గతేడాది డిసెంబర్ లోనే ఈ సీక్వెల్ షూటింగ్ పూర్తయింది. ఆ తర్వాత ఫిబ్రవరి 29న నెట్‌ఫ్లిక్స్ ఓ టీజర్ కూడా రిలీజ్ చేసింది.
హసీన్ దిల్‌రుబా కథేంటంటే?
హసీన్ దిల్‌రుబా ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ప్రియుడి కోసం తన భర్తను హత్య చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొనే ఓ మహిళ చుట్టూ తిరిగే కథ ఇది. ఇందులో రాణి అనే పాత్రలో తాప్సీ నటించింది. ఆమె భర్త రిషూగా విక్రాంత్ మస్సీ కనిపించాడు. ఇంట్లో పేలుడు జరిపి ఓ ప్లాన్ ప్రకారం తన భర్తను హత్య చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటుంది రాణి.
ఈ కేసులో పోలీసుల విచారణ జరుగుతుండగా.. మూవీ ప్రస్తుతం, ఫ్లాష్‌బ్యాక్ కలిపి నడుస్తూ ఉంటుంది. తన బాయ్‌ఫ్రెండ్ వదిలేయడంతో బలవంతంగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొని రిషూ (విక్రాంత్ మస్సీ)తో కాపురం చేస్తుంటుంది రాణి. అయితే వాళ్ల సెక్స్ జీవితం అంత ఆనందంగా సాగదు.
ఈ సమయంలోనే వాళ్ల ఇంటికి రిషూ కజిన్ నీల్ త్రిపాఠీ (సన్నీ కౌశల్) వస్తాడు. అతన్ని చూసి ఆకర్షితురాలైన రాణి.. అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. పెళ్లి చేసుకుంటాననీ చెబుతుంది. దీంతో నీల్ ఆ ఇంటి నుంచి పారిపోతాడు. అతని గురించి ఆమె తన భర్తకు చెప్పగా.. అతడో శాడిస్టులా మారిపోయి రాణిని హింసిస్తూ ఉంటాడు.
ఫ్లాష్‌బ్యాక్ లో ఈ కథను నడిపిస్తూనే.. ప్రస్తుతం జరుగుతున్న పోలీసుల విచారణను కూడా సినిమాలో చూపిస్తుంటారు. భర్తతో రాణికి అంత మంచి సంబంధాలు లేవని తెలియడంతో ఆమెనే హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా ఓ చేయి కోల్పోయిన తన భర్త తిరిగి వస్తాడు. అటు పోలీసులు కూడా ఈ నేరం రాణి చేసిందని నిరూపించలేకపోతారు. తొలి భాగం అలా ముగిసిపోతుంది. ఈ సీక్వెల్లో ఏం జరుగుతుందన్నది చూడాలి.