Vikrant Massey: మా అన్న 17 ఏళ్ల వయసులోనే ఇస్లాంలోకి మారాడు: 12th ఫెయిల్ నటుడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్-vikrant massey 12th fail actor reveals about his brother conversion and his thoughts on religion bollywood news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vikrant Massey: మా అన్న 17 ఏళ్ల వయసులోనే ఇస్లాంలోకి మారాడు: 12th ఫెయిల్ నటుడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Vikrant Massey: మా అన్న 17 ఏళ్ల వయసులోనే ఇస్లాంలోకి మారాడు: 12th ఫెయిల్ నటుడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
Feb 20, 2024 01:43 PM IST

Vikrant Massey: 12th ఫెయిల్ మూవీతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన నటుడు విక్రాంత్ మస్సీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన అన్న 17 ఏళ్ల వయసులోనే ఇస్లాంలోకి మారాడని, తన తల్లి ఓ సిక్కు, తండ్రి ఓ క్రిస్టియన్ అని చెప్పాడు.

12th ఫెయిల్ నటుడు విక్రాంత్ మస్సీ తన కుటుంబం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు
12th ఫెయిల్ నటుడు విక్రాంత్ మస్సీ తన కుటుంబం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు

Vikrant Massey: బాలీవుడ్ నటుడు విక్రాంత్ మస్సీ ఈ మధ్యే 12th ఫెయిల్ మూవీతో సక్సెస్ సాధించాడు. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ శర్మ బయోపిక్ అయిన ఈ మూవీలో విక్రాంత్ ఆయన పాత్ర పోషించాడు. అతని నటనకు దేశమంతా ఫిదా అయింది. అయితే తాజాగా అన్‌ఫిల్టర్డ్ విత్ సందిష్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన అన్న ఇస్లాంలోకి మారడం, మతంపై తన కుటుంబ ఆలోచనల గురించి వివరించాడు.

మా అన్న అందుకే మతం మారాడు..

బాలీవుడ్ నటుడు విక్రాంత్ పేరు చూడగానే అతడో హిందూ అని అనుకుంటారు. కానీ అతని అన్న పేరు మోయిన్. దీనికి కారణం అతడు 17 ఏళ్ల వయసులోనే ఇస్లాంలోకి మారాడట. ఈ విషయాన్ని విక్రాంత్ తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. "నా అన్న పేరు మోయిన్. నన్ను విక్రాంత్ అంటారు. మరి అతని పేరు మోయిన్ అని ఎందుకంటారు? అతడు ఇస్లాంలోకి మారాడు. నా కుటుంబం దానికి అనుమతి ఇచ్చింది.

ఇందులో నీకు సంతృప్తి లభిస్తే అలాగే కానీ అని నా కుటుంబం మా అన్నతో చెప్పింది. అతడు 17 ఏళ్ల వయసులోనే మతం మారాడు. అది చాలా పెద్ద నిర్ణయం. మా అమ్మ ఓ సిక్కు. మా నాన్న చర్చికి వెళ్లే క్రిస్టియన్. వారానికి రెండుసార్లు చర్చికి వెళ్తాడు. చిన్నతనం నుంచే నేను మతం, ఆధ్యాత్మికత గురించి ఎన్నో వాదాలను నేను విన్నాను" అని విక్రాంత్ చెప్పాడు.

"మా అన్న ఇస్లాంలోకి మారతానంటే ఎలా అనుమతి ఇచ్చావంటూ మా బంధువులు నాన్నను నిలదీశారు. కానీ అది మీకు అనవసరం అని వాళ్లతో చెప్పాడు. అతడు నా కొడుకు.. తనకు ఏం కావాలో ఎంచుకునే హక్కు అతనికి ఉంది అని స్పష్టం చేశాడు. ఆ తర్వాత నేను మతం గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. ఇది కేవలం మనిషి సృష్టించిందే" అని విక్రాంత్ స్పష్టం చేశాడు.

విక్రాంత్ ఫ్యామిలీ ఇదీ..

12th ఫెయిల్ మూవీ నటుడు విక్రాంత్ మస్సీ తండ్రి పేరు జాలీ మస్సీ, తల్లి మీనా మస్సీ. అతడు 2022లో షీతల్ ఠాకూర్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్యే వాళ్లకు ఓ బాబు కూడా పుట్టాడు. ఫిబ్రవరి 7న బాబు జన్మించగా.. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఈ దంపతులు పంచుకున్నారు. విక్రాంత్ మస్సీ ఇప్పటికే చాలా బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించినా ఈ 12th ఫెయిల్ ద్వారా దేశం మొత్తానికీ పరిచయమయ్యాడు.

ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విక్రాంత్ మస్సీ.. హసీన్ దిల్‌రుబా సీక్వెల్ లో నటించబోతున్నాడు. ఈ మూవీ తొలి పార్ట్ లో తాప్సీ పన్ను నటించింది. ఆ మూవీ అంత సక్సెస్ సాధించలేదు. ఇప్పుడీ సెకండ్ పార్ట్ లో రిద్ధి డోగ్రా, రాశీ ఖన్నా ఫిమేల్ లీడ్స్ గా నటించనున్నారు.

Whats_app_banner