Aamir Khan Biggest Flop Movie: బాలీవుడ్‌లో రజనీకాంత్ కెరీర్ ముగించిన ఆమిర్ ఖాన్ సినిమా ఇది.. డైరెక్టర్ కెరీరూ ముగిసింది-aamir khan biggest flop movie super star rajinikanths last in bollywood flashback ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aamir Khan Biggest Flop Movie: బాలీవుడ్‌లో రజనీకాంత్ కెరీర్ ముగించిన ఆమిర్ ఖాన్ సినిమా ఇది.. డైరెక్టర్ కెరీరూ ముగిసింది

Aamir Khan Biggest Flop Movie: బాలీవుడ్‌లో రజనీకాంత్ కెరీర్ ముగించిన ఆమిర్ ఖాన్ సినిమా ఇది.. డైరెక్టర్ కెరీరూ ముగిసింది

Hari Prasad S HT Telugu
Feb 15, 2024 03:52 PM IST

Aamir Khan Biggest Flop Movie: రజనీకాంత్ తమిళంలోనే కాదు పాన్ ఇండియా లెవల్లో సూపర్ స్టార్. అయితే బాలీవుడ్ లో అతని కెరీర్ ముగించిన ఆమిర్ ఖాన్ సినిమా ఒకటుంది. ఆ మూవీ తీసిన డైరెక్టర్ కూడా మళ్లీ కనిపించలేదు.

బాలీవుడ్‌లో రజనీకాంత్ కెరీర్ ముగించిన ఆమిర్ ఖాన్ సినిమా
బాలీవుడ్‌లో రజనీకాంత్ కెరీర్ ముగించిన ఆమిర్ ఖాన్ సినిమా

Aamir Khan Biggest Flop Movie: ఆమిర్ ఖాన్, రజనీకాంత్.. 1990ల్లో ఇండియన్ సినిమాలో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న హీరోలు. ఈ ఇద్దరూ కలిసి తీసిన ఓ మూవీ ఆమిర్ ఖాన్ కెరీర్లోనే అతి పెద్ద ఫ్లాప్ మూవీగా మిగిలిపోయిందంటే నమ్మగలరా? అంతేకాదు ఈ సినిమా రజనీకాంత్ బాలీవుడ్ కెరీర్ ను, మూవీ తీసిన డైరెక్టర్ దిలీప్ శంకర్ కెరీర్ నూ ముగించింది. ఆ సినిమా పేరు ఆతంక్ హీ ఆతంక్.

రజనీకాంత్, ఆమిర్ ఖాన్ కలిసి నటించినా..

ఆమిర్ ఖాన్ అంటే చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తాడని పేరుంది. అతని కెరీర్లో ఫ్లాపుల సంఖ్య చాలా తక్కువ. అయితే 1995లో అతడు చాలా పెద్ద పొరపాటు చేశాడు. హాలీవుడ్ లో వచ్చిన గాడ్ ఫాదర్ మూవీ స్ఫూర్తిగా ఆ ఏడాది ఆతంక్ హీ ఆతంక్ అనే మూవీ చేశాడు. అందులో రజనీకాంత్, జూహీ చావ్లా కూడా నటించారు. ఈ మూవీకి దిలీప్ శంకర్ దర్శకత్వం వహించాడు.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. ఆమిర్ ఖాన్, రజనీకాంత్ లాంటి స్టార్లు నటించినా.. ఆతంక్ హీ ఆతంక్ సినిమా కేవలం రూ.2 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అదే ఏడాది ఆమిర్ ఖాన్ నటించిన రాజా హిందుస్థానీ, రంగీలా సినిమాలు రూ.20 కోట్లకుపైగా వసూలు చేయగా.. ఈ మూవీ మాత్రం అసలు ఎవరికీ గుర్తు లేకుండా పోయింది.

రజనీకాంత్ కెరీర్ ముగిసింది

రజనీకాంత్ 1990ల నాటికే సినిమాల్లో అడుగు పెట్టి దశాబ్దానికిపైనే అయింది. తమిళంలో బాషా సినిమాతో సూపర్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు. హిందీలోనూ అప్పటికే హమ్, చాల్‌బాజ్ లాంటి సినిమాలతో నార్త్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కానీ ఆమిర్ ఖాన్ తో కలిసి ఆతంక్ హీ ఆతంక్ మూవీలో నటించడం మాత్రం రజనీకి తీరని నష్టం చేసింది.

హిందీతో పూర్తి స్థాయి రోల్లో రజనీ కనిపించిన చివరి సినిమా అదే. అతని బాలీవుడ్ కెరీర్ అక్కడితో ముగిసింది. 2000లో వచ్చిన బులందీ మూవీలో అతిథి పాత్రలో మాత్రం నటించాడు. ఆ తర్వాత 2011లో షారుక్ ఖాన్ రా.వన్‌లోనూ గెస్ట్ రోల్ ప్లే చేశాడు. సౌత్ ఇండియాలో ముఖ్యంగా తమిళ సినిమాల్లో తన స్టార్ స్టేటస్ కాపాడుకున్నా.. బాలీవుడ్ లో అతని కెరీర్ ముగించిన చెడ్డపేరును ఆమిర్ ఖాన్ మూటగట్టుకున్నాడు.

డైరెక్టర్ ఎక్కడ?

ఇక ఆ మూవీని డైరెక్ట్ చేసిన దిలీప్ శంకర్ కూడా తర్వాత కనిపించకుండా పోయాడు. అంతకుముందు 1988లో కాల్ చక్ర మూవీని దిలీప్ శంకర్ డైరెక్ట్ చేశాడు. అలాంటి దర్శకుడిగా ఇద్దరు పెద్ద స్టార్లను డైరెక్ట్ చేసే అవకాశం దక్కినా.. అది బిగ్గెస్ట్ ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత దిలీప్ శంకర్ కెరీర్ కూడా ముగిసిపోయింది. తర్వాత ఏవో సరిగా పేరు కూడా తెలియని రెండు సినిమాలు చేసినా.. అవి కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ గా మిగిలిపోయాయి.

Whats_app_banner