తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ali Bollywood Movie: బాలీవుడ్‌లోకి క‌మెడియ‌న్ అలీ రీఎంట్రీ - ల‌వ్‌స్టోరీలో ఫుల్‌లెంగ్త్ రోల్‌

Ali Bollywood Movie: బాలీవుడ్‌లోకి క‌మెడియ‌న్ అలీ రీఎంట్రీ - ల‌వ్‌స్టోరీలో ఫుల్‌లెంగ్త్ రోల్‌

03 December 2024, 13:48 IST

google News
  • Ali Bollywood Movie:టాలీవుడ్ సీనియ‌ర్ క‌మెడియ‌న్ అలీ దాదాపు ఐదేళ్ల త‌ర్వాత బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. వెల్‌క‌మ్ టూ ఆగ్రా పేరుతో హిందీ సినిమా చేస్తోన్నాడు. ఇటీవ‌లే ముంబాయిలో ఈ సినిమా మొద‌లైంది. ఈ బాలీవుడ్ మూవీలో అనుషమాన్‌ఝా, సారా అంజలి, ఆకాశ్‌ ధబాడే కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్నారు.

అలీ బాలీవుడ్ మూవీ
అలీ బాలీవుడ్ మూవీ

అలీ బాలీవుడ్ మూవీ

Ali Bollywood Movie: టాలీవుడ్ క‌మెడియ‌న్ అలీ బాలీవుడ్‌లో ఓ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. వెల్‌కమ్‌ టు ఆగ్రా పేరుతో ఓ సినిమా చేస్తోన్నాడు. ఇటీవ‌లే ముంబాయిలో ఈ బాలీవుడ్ మూవీ ప్రారంభ‌మైంది. ఈ సినిమాకు ఆశిష్ కుమార్ దూబే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. అనుషమాన్‌ఝా, సారా అంజలి, ఆకాశ్‌ ధబాడే కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు.

ఆగ్రా ల‌వ్ స్టోరీ...

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా కేంద్రంగా జ‌రిగే ప్రేమ‌క‌థతో వెల్ క‌మ్ టూ ఆగ్రా మూవీ తెర‌కెక్కుతోంద‌ని అలీ తెలిపాడు. ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ క‌నిపించ‌బోతున్న‌ట్లు పేర్కొన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు తాను చేసిన పాత్ర‌ల‌కు పూర్తిగా భిన్నంగా ఈ బాలీవుడ్ మూవీలో క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని చెప్పాడు. కామెడీ, ఎమోష‌న‌ల్ మిక్స్‌గా సాగుతుంద‌ని తెలిపాడు. స‌ల్మాన్ ఖాన్ ద‌బాంగ్ 3 అనంత‌రం దాదాపు ఐదేళ్ల గ్యాప్ త‌ర్వాత వెల్‌క‌మ్ టూ ఆగ్రా మూవీతో అలీ బాలీవుడ్‌లోకీ రీఎంట్రీ ఇస్తోన్నాడు. హిందీలో టోట‌ల్ ధ‌మాల్‌, ముఖాబులాతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో క‌మెడియ‌న్‌గా క‌నిపించాడు అలీ.

1250 సినిమాలు...

సుదీర్ఘ కెరీర్‌లో తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో క‌లిపి 1250 సినిమాలు చేశాడు అలీ. హీరోగా 52 సినిమాలు చేశాడు. అలీ హీరోగా న‌టించిన య‌మ‌లీల‌, ఘ‌టోత్క‌చుడు, పిట్ట‌ల‌దోర సినిమాలు పెద్ద హిట్ట‌య్యాయి. ఈ ఏడాది క‌మెడియ‌న్‌గా గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది, స‌రిపోదా శ‌నివారం, డ‌బుల్ ఇస్మార్ట్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేశాడు. గ‌తంతో పోలిస్తే సినిమాల స్పీడును త‌గ్గించాడు. సినిమాల‌తో పాటు అలీతో జాలీగా, అలీతో స‌ర‌దాగా అనే టాక్ షోస్ చేశాడు. య‌మ‌లీల ఆ త‌ర్వాత అనే టీవీ సీరియ‌ల్‌లో లీడ్ రోల్‌లో క‌నిపించాడు.

రాజ‌కీయాల‌కు గుడ్‌బై...

చాలా కాలంగా వైఎస్ఆర్‌సీసీ పార్టీలో కొన‌సాగాడు అలీ. ఏపీ ఎల‌క్ట్రానిక్ మీడియా అడ్వైజ‌ర్‌గా ప‌నిచేశాడు. ఈ ఏడాది జూన్‌లో రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ప‌ది మందికి సాయం చేయ‌డం కోస‌మే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని తెలిపాడు. ఇక నుంచి తాను ఏ పార్టీకి చెందిన వ్య‌క్తిని కాద‌ని ఓ వీడియో ద్వారా ప్ర‌క‌టించాడు.

తదుపరి వ్యాసం