తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiru Leaks: నా తమ్ముడి సినిమా.. ఇంతకన్నా ఎక్కువ లీక్ చేయకూడదు.. చిరంజీవి కామెంట్స్

Chiru Leaks: నా తమ్ముడి సినిమా.. ఇంతకన్నా ఎక్కువ లీక్ చేయకూడదు.. చిరంజీవి కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

21 April 2024, 6:15 IST

  • Chiranjeevi Launched Bhaje Vayu Vegam Teaser: కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భజే వాయి వేగం. మెగాస్టార్ చిరంజీవి తాజాగా భజే వాయి వేగం టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిరు లీక్స్ గురించి మరోసారి ఆసక్తిగా కామెంట్స్ చేశారు.

నా తమ్ముడి సినిమా.. ఇంతకన్నా ఎక్కువ లీక్ చేయకూడదు.. చిరంజీవి కామెంట్స్
నా తమ్ముడి సినిమా.. ఇంతకన్నా ఎక్కువ లీక్ చేయకూడదు.. చిరంజీవి కామెంట్స్

నా తమ్ముడి సినిమా.. ఇంతకన్నా ఎక్కువ లీక్ చేయకూడదు.. చిరంజీవి కామెంట్స్

Chiranjeevi About Bhaje Vayu Vegam: ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న సినిమా "భజే వాయు వేగం". ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి ఏప్రిల్ 20న రిలీజ్ చేశారు. విశ్వంభర సినిమా సెట్‌లో భజే వాయి వేగం టీజర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ టీజర్‌తో పాటు టైటిల్ ఇట్రెస్టింగ్‌గా, ఇప్రెసివ్‌గా ఉందని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

Prabhas Marriage: ప్రభాస్ లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్.. కాబోయే భార్య గురించేనా డార్లింగ్ పోస్ట్?

Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన బాహుబలి ప్రీక్వెల్.. కానీ, అదొక్కటే నిరాశ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Anushka: అరుంధ‌తిలో అనుష్క ఫ‌స్ట్ ఛాయిస్ కాదు - ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని మిస్‌ చేసుకున్న మ‌ల‌యాళం హీరోయిన్ ఎవ‌రంటే?

Malayalam Movie: గుక్క‌తిప్పుకోకుండా ఒకేసారి ఈ మ‌ల‌యాళం మూవీ టైటిల్ చెప్ప‌గ‌ల‌రా? - ఓ సారి ట్రై చేయండి?

తన అభిమాని, తమ్ముడు లాంటి కార్తికేయ హీరోగా నటించిన "భజే వాయు వేగం" సినిమా విజయం సాధించాలని మెగాస్టార్ తన బెస్ట్ విషెస్ అందించారు. "భజే వాయు వేగం"చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా టీజర్ విడుదల సందర్భంగా చిరు లీక్స్‌పై, సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. "యూవీ కాన్సెప్ట్స్‌లో విక్కీ నిర్మాతగా, దర్శకుడు ప్రశాంత్ రెడ్డి చంద్రపు రూపొందిస్తున్న భజే వాయు వేగం సినిమా టీజర్, టైటిల్ ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. నా అభిమాని, తమ్ముడు లాంటి కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. నా అభిమాని హీరోగా ఓ మంచి సినిమాలో నటిస్తున్నాడంటే ఆ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను" అని చిరంజీవి అన్నారు.

"ప్రశాంత్ రెడ్డి లాంటి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ టాలీవుడ్‌కు రావాలి. ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ ఎంతమంది కొత్త కాన్సెప్ట్స్‌తో వస్తే అంత ఫ్రెష్‌గా మన ఫిలిం ఇండస్ట్రీ ముందుకు సాగుతుంది. యంగ్ డైరెక్టర్స్‌ను నేను ఎప్పుడూ ఆహ్వానిస్తుంటాను. భజే వాయు వేగం సినిమా టీజర్ చూస్తుంటే తండ్రీ కొడుకు మధ్య మంచి ఎమోషన్‌తో సాగే సినిమా అనిపిస్తోంది. యాక్షన్ బాగుంది" అని చిరంజీవి తెలిపారు.

"ఈ సినిమా స్టోరీ నాకు తెలిసినా ఇంతకంటే ఎక్కువ లీక్ చేయాలనుకోవడం లేదు. భజే వాయు వేగం సినిమా టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా" అని చిరంజీవి పేర్కొన్నారు. తన తమ్ముడు లాంటి కార్తికేయ నటించిన సినిమా అని, దాని గురించి లీక్ చేయకూడదని ఇదివరకు చిరు లీక్స్ ఎలా వైరల్ అయ్యాయో తెలిసి ఇలా మెగాస్టార్ కామెంట్స్ చేశారని తెలుస్తోంది.

ఇక భజే వాయు వేగం సినిమా టీజర్ చూస్తే.. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు, ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు వేట ప్రారంభిస్తారు. మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్ అంతా ఇదే టాస్క్ మీద ఫోకస్ చేస్తుంది. మరోవైపు కార్తికేయ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూనే తండ్రితో ఆయనకున్న ఎమోషనల్ బాండింగ్‌ను చూపించారు.

రాహుల్ టైసన్ క్యారెక్టర్ ఈ సినిమాలో కీలకంగా ఉండబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒకడుంటాడు. వాడి కోసం ఏం చేయడానికైనా మనం వెనకాడం, నా లైఫ్‌లో అది మా నాన్న అని కార్తికేయ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఫాదర్, సన్ ఎమోషన్, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సులు టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి.

భజే వాయు వేగం టీజర్‌లో హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో పాటు కార్తికేయ గుమ్మకొండ ఎనర్జిటిక్‌గా కనిపించారు. అన్ని ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో "భజే వాయు వేగం" సినిమా రూపొందించినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ఇక భజే వాయు వేగం సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను త్వరలో అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం