తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Fathers Day Ott: ఓటీటీలో తండ్రీ కొడుకుల ఎమోషనల్ మూవీ- ఇవాళే రిలీజ్, అప్పుడే ట్రెండింగ్- ఫాదర్స్ డేకు మస్ట్ వాచ్ సినిమా!

Fathers Day OTT: ఓటీటీలో తండ్రీ కొడుకుల ఎమోషనల్ మూవీ- ఇవాళే రిలీజ్, అప్పుడే ట్రెండింగ్- ఫాదర్స్ డేకు మస్ట్ వాచ్ సినిమా!

Sanjiv Kumar HT Telugu

14 June 2024, 16:17 IST

google News
  • Dear Nanna Movie OTT Trending: ఓటీటీలో విడుదలైన రోజే ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది డియర్ నాన్న. తండ్రీ కొడుకుల అనుబంధాన్ని చాటిచెప్పే ఈ తెలుగు సినిమా ఫాదర్స్ డే స్పెషల్‌గా వచ్చి మంచి ఆదరణ పొందుతోంది. మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడాలనే వివరాల్లోకి వెళితే..

ఓటీటీలో తండ్రీ కొడుకుల ఎమోషనల్ మూవీ- ఇవాళే రిలీజ్, అప్పుడే ట్రెండింగ్- ఈ ఫాదర్స్ డేకు మస్ట్ వాచ్ సినిమా!
ఓటీటీలో తండ్రీ కొడుకుల ఎమోషనల్ మూవీ- ఇవాళే రిలీజ్, అప్పుడే ట్రెండింగ్- ఈ ఫాదర్స్ డేకు మస్ట్ వాచ్ సినిమా!

ఓటీటీలో తండ్రీ కొడుకుల ఎమోషనల్ మూవీ- ఇవాళే రిలీజ్, అప్పుడే ట్రెండింగ్- ఈ ఫాదర్స్ డేకు మస్ట్ వాచ్ సినిమా!

Dear Nanna OTT Release: యంగ్ టాలెంటెడ్ చైతన్య రావ్ (Chaitanya Rao), యష్ణ చౌదరి (Yashna Chowdary) లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం 'డియర్ నాన్న'. సూర్య కుమార్ భగవాన్ దాస్, సంధ్య జనక్, శశాంక్, మధునందన్, సుప్రజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. అంజి సలాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాకేష్ మహంకాళి నిర్మించారు. ఫాదర్ డే స్పెషల్‌గా (Fathers Day 2024) ఈ చిత్రం జూన్ 14న నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

డియర్ నాన్న (Dear Nanna Movie) చూసిన ఆడియన్స్ సినిమాకి టాప్ రేటింగ్స్ ఇస్తున్నారు. కరోనా బ్యాక్ డ్రాప్‌లో ఫాదర్ సన్ ఎమోషన్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేసిన ఈ సినిమా కంటెంట్ ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేస్తోంది. చెఫ్ కావాలని కలలు కనే చైతన్య రావ్ తన జీవితంలో ఎదురైన సంఘటనలు, తనలో కలిగిన మార్పుని దర్శకుడు అంజి సలాది ఆలోచన రేకెత్తించే విధంగా ఎఫెక్టివ్‌గా చూపించారు.

తండ్రి కొడుకులుగా నటించిన చైతన్య రావ్, సూర్య కుమార్ భగవాన్ దాస్ మధ్య ఎమోషనల్ సీన్స్ మెయిన్ హైలెట్‌గా నిలిచాయి. మెడికల్ షాప్ తనకి బిజినెస్ కాదని చెప్పే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో మెడికల్ షాప్‌ల ప్రాధాన్యత, వారు చేసిన త్యాగాలు, చూపిన తెగువని దర్శకుడు చాలా ప్రభావితంగా చూపించాడు.

చైతన్య రావ్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యష్ణ చౌదరి స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. సూర్య కుమార్ భగవాన్ దాస్‌తో (Surya Kumar Bhagwan Das) పాటు సంధ్య జనక్, శశాంక్, మధునందన్, సుప్రజ్ సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. అనిత్ కుమార్ మాధాడి కెమరాపనితనం ఆకట్టుకుంది. గిఫ్టన్ ఎలియాస్ నేపథ్య సంగీతం మరో ఆకర్షణగా నిలిచింది.

మంచి ఎమోషన్స్, వాల్యుబుల్ స్టొరీ, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, సూపర్ పెర్ఫార్మెన్స్‌లతో వచ్చిన డియర్ నాన్న ఈ వీకెండ్ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ మూవీగా స్ట్రీమ్ అవుతోంది. డియర్ నాన్న సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో (Aha OTT) స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన తొలి రోజు పూర్తిగా గడవకముందే మంచి రెస్పాన్స్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది డియర్ నాన్న మూవీ.

ఇకపోతే ఈ మధ్య చైతన్య రావు వరుస సినిమాలతో అట్రాక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే రెండు రోజుల ముందుగా అంటే జూన్ 12న చైతన్య రావు నటించిన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ పారిజాత పర్వం సినిమా కూడా ఓటీటీలోకి వచ్చేసింది. బ్యూటిఫుల్ శ్రద్ధా దాస్ నటించిన ఈ సినిమా ఆహా ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతోంది.

ఇదే కాకుండా చైతన్య రావు నటించిన మిడిల్ క్లాస్ బయోపిక్ మూవీగా వచ్చిన శరతులు వర్తిస్తాయి కూడా ఆహా ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. చైన్ బిజినెస్ మోసాలకు సంబంధించి, తెలంగాణ బ్యాక్ డ్రాప్ మధ్య తరగతి కుటుంబాల సంఘర్షణ సముహారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇలా చైతన్య రావు నటించిన మూడు సినిమాలు వరుసగా ఆహా ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవడం విశేషంగా మారింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం