తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi September 2nd Episode: బ్రహ్మముడి- అపర్ణకు మళ్లీ గుండెపోటు- రాజ్‌ను కాపాడిన కావ్య- పోలీసులకు దొరికేసిన రాహుల్

Brahmamudi September 2nd Episode: బ్రహ్మముడి- అపర్ణకు మళ్లీ గుండెపోటు- రాజ్‌ను కాపాడిన కావ్య- పోలీసులకు దొరికేసిన రాహుల్

Sanjiv Kumar HT Telugu

02 September 2024, 7:35 IST

google News
  • Brahmamudi Serial September 2nd Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 2వ తేది ఎపిసోడ్‌లో అపర్ణకు హార్ట్ స్టోక్ వస్తుంది. డాక్టర్ వచ్చి ట్యాబ్లెట్స్ రోజు వాడాలని చెబుతాడు. నేనే సరిగా చూసుకోలేదు. మొదటిసారి తప్పు చేశాను అని కావ్య అంటుంది. అప్పుకు కల్యాణ్ అబద్ధం చెబుతాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో

బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 2వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 2వ తేది ఎపిసోడ్‌

బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 2వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో కల్యాణ్‌ను మోటివేట్ చేస్తుంది కావ్య. బతకడం మంచిదే, కానీ, నచ్చినట్లు బతకడం కూడా ముఖ్యమే. ఇది మీరు కోరుకున్నది చేరుకోడానికి ఇది సరిపోదు. కానీ ఒక అడుగు ముందు వేయడానికి ఆత్మ స్థైర్యం నింపుతుంది. వ్యక్తిగతంగా ఎదగండి. అప్పుడే ఇంట్లోవాళ్లే అసాధ్యుడని నమ్ముతారు. స్పీడ్ బ్రేకర్స్ కూడా వస్తుంటాయి. వాటిని దాటుకుంటూ వెళ్లాలి అని ఆటో డబ్బు ఇచ్చి వెళ్లిపోతుంది కావ్య.

ముట్టుకోనివ్వని అపర్ణ

రాత్రిపూట అపర్ణకు గుండెలో మంట పుడుతుంది. ఏంటీది గ్యాస్టిక్ ప్లాబ్లమా అని అనుకుంటుంది. పక్కనే సుభాష్ అది గమనిస్తూ ఉంటాడు. అపర్ణ నువ్ బాగానే ఉన్నావా అని సుభాష్ అడిగితే పట్టించుకోదు. ఏడమ చేతి పట్టినట్లు, మెడ పట్టుకున్నట్లు అపర్ణకు అవుతుంది. గుండెలో నొప్పి మొదలు అయి అపర్ణ విలవిల్లాడుతుంది. సుభాష్ చూస్తుంటే ముట్టుకోనివ్వదు. దాంతో వెళ్లి రాజ్‌ను పిలుచుకువస్తాడు రాజ్. ఏమైంది మమ్మీ అని కంగారుగా అడుగుతాడు రాజ్.

ఎడమ చేయి లాగేస్తుందిరా. ఏంటో తెలియట్లేదు. ఏదోలా ఉంది అని అపర్ణ అంటే.. సుభాష్‌ను డాక్టర్‌కు కాల్ చేయమని రాజ్ చెబుతాడు. దాంతో సుభాష్ డాక్టర్‌కు కాల్ చేస్తాడు. డాక్టర్ వచ్చి అపర్ణను చెక్ చేస్తాడు. మెడిసిన్ కరెక్ట్‌గా వేసుకుంటున్నారా అని డాక్టర్ అడిగితే.. లేదు బాగానే ఉందని ఆపేసాను అని అపర్ణ చెబుతుంది. సరే మెడిసిన్ రాసిస్తాను క్రమం తప్పకుండా వేసుకోండని డాక్టర్ చెబుతాడు. హాల్లో మమ్మీ పోయిందంటావా అని రాహుల్ అంటాడు.

మళ్లీ స్ట్రోక్ వచ్చే ఛాన్స్

రేయ్.. ఏంట్రా ఆ మాటలు అని రుద్రాణి వారిస్తుంది. అంటే, పరిస్థితి చూస్తే అలాగే ఉందని రాహుల్ అంటాడు. ఇంతలో డాక్టర్ బయటకు వస్తాడు. ఎలా ఉంది. డేంజర్‌ ఏం లేదుగా అని రాజ్ అడుగుతాడు. మీరంత చదువుకున్నవాళ్లే కదా. ఇంత కెర్లెస్‌గా ఉంటే ఎలా. ఒకసారి హార్ట్ ఎటాక్ వచ్చింది. మీకు మీరుగా డెసిషియన్ తీసుకోని ట్యాబ్లెట్స్ మానేస్తే ఎలా. తనకు బీపీ ఉంది. అది ఎక్కువైతే మళ్లీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. తనతోపాటు ఎవరైనా ఉంటే మంచిది అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు.

పేరుకు దుగ్గిరాల కుటుంబం. ఇంట్లో ఇంతమంది ఉన్నాం. కానీ, మా వదిన ట్యాబ్లెట్స్ వేసుకుంటుందో కూడా చూసుకోవడం లేదు. ఏం కావ్య నువ్ కూడా మీ అత్తను పట్టించుకోవట్లేదా. నీ అవసరం ఉంటేనే పట్టించుకుంటావా అని రుద్రాణి అంటుంది. నువ్ కూడా ఇంటి సభ్యురాలివే కదా. నీకు బాధ్యత ఉంది కదా అని ఇందిరాదేవి అంటుంది. ఎప్పుడు పక్కనే ఉన్న అన్నయ్యకే తెలియదు. నా కోడలు అనుకునే కావ్యకు తెలియదు ట్యాబ్లెట్స్ మానేసిందని. ఇక నాకెలా తెలుస్తుందని రుద్రాణి అంటుంది.

అపర్ణకు ఇలా అయిందని జాలి పడకుండా ఇలా మాట్లాడటానికి సిగ్గుగా లేదా నీకు అని ఇందిరాదేవి అంటుంది. ఊరుకోండి అమ్మమ్మ. ఏమైనా గానీ రుద్రాణి గారు అన్నది కరెక్టే. నేనే అత్తయ్యగారిని చూసుకోవాల్సింది. మొదటి సారి తప్పు చేశాను. అత్తయ్యను చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఇకనుంచి కరెక్ట్ టైమ్‌కు మందులు వేసుకునేలా నేను చూసుకుంటాను అని కావ్య అంటుంది. ప్రతి రెండు గంటలకు ట్యాబ్లెట్స్ వేయాలి. నీకు కుదరనప్పుడు నాకు చెప్పు. మమ్మీ ఆరోగ్య విషయంలో నెగ్లెట్ చేయకు అని రాజ్ అంటాడు.

మరోవైపు ఇంటికి కల్యాణ్ వెళ్తాడు. ఏంట్రా సంతోషంగా ఉన్నావ్ అని అప్పు అడిగితే.. కళ్లు మూసుకోమ్మని చేతిలో 500 నోటు పెడతాడు కల్యాణ్. ఏంటిదని అడిగితే.. మీ శ్రీవారి మొదటి సంపాదన అని కల్యాణ్ చెబుతాడు. ఇంతకీ జాబ్ ఏంటని అప్పు అడిగితే.. పికప్ డ్రాప్ అని కల్యాణ్ అంటాడు. అంటే డ్రైవర్ పనా. పెద్ద కుటుంబం నుంచి వచ్చి డ్రైవర్‌గా చేస్తావా. నాకు నచ్చలేదని అప్పు అంటుంది. డ్రైవర్ కాదు. పికప్ డ్రాప్ గురించి డేటా ఎంట్రీ అని కల్యాణ్ అబద్ధం చెబుతాడు.

ఇంకో జాబ్ చూసుకుంటా

అలా అయితే నెలకు జీతం ఇవ్వాలి కదా అని అప్పు అంటుంది. వాళ్లు అలాగే అన్నారు. నాకు డబ్బు కావాలని డైలీ పేమెంట్ అడిగాను అని కల్యాణ్ అంటాడు. కానీ, నువ్ చదివిని చదువుకు ఇది చాలా చిన్న పని. టైమ్ చూసుకుని వేరే దాంట్లో జాయిన్ అవ్వమని అప్పు అంటుంది. ఉద్యోగం చేస్తున్నానంటేనే ఇలా అన్నావ్. ఇంకా డ్రైవర్‌గా చేస్తున్నానంటే ఇంట్లోనే కూర్చోపెడుతుందనుకున్న కల్యాణ్.. ఇది చేస్తూనే ఇంకో జాబ్ చూసుకుంటా అని చెబుతాడు.

మరుసటి రోజు ఉదయం. హాల్లో నా ఎడమ కన్ను పొద్దున్నుంచి అదురుతుందని రుద్రాణి అంటుంది. నీకు మంచి జరుగుతుందనా రాహుల్ అంటే.. లేదు ఎదుటివాళ్లకు చెడు జరుగుతుందని రుద్రాణి అంటుంది. ఇంతలో పోలీసులు వస్తారు. అది చూసి ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. ఎక్కడికి వస్తున్నామో తెలిసే వచ్చాం సార్. పైనుంచి పర్మిషన్ తీసుకునే వచ్చాం అని పోలీసులు అంటారు. ఏం జరిగిందని రాజ్ అడిగితే.. ఎర్లీ మార్నింగ్ దొంగ బంగారాన్ని మా వాళ్లు పట్టుకున్నారు. అది స్వరాజ్ గ్రూప్ కంపెనీకే సప్లై అవుతుందని తేలిందని ఎస్సై అంటాడు.

దాంతో అంతా షాక్ అవుతారు. మీరు పొరబడి ఉంటారు. మా వందేళ్ల చరిత్ర ఉన్న మా కంపెనీలో అలాంటి హేయమైన పని ఎవరు చేయరని సీతారామయ్య అంటాడు. సారీ సార్ మీ ఇంటికి అరెస్ట్ వారెంట్‌తో రావాల్సి వచ్చింది. పూర్తి ఆధారాలతోనే వచ్చాం. దీనికి పూర్తి బాధ్యత కంపెనీ ఛైర్మన్ అయినా స్వరాజ్‌దే కాబట్టి ఆయన్ను అరెస్ట్ చేస్తున్నాం అని ఎస్సై అంటాడు. దాంతో రుద్రాణి, రాహుల్ సంతోషిస్తారు. రాజ్ ఇప్పుడు కంపెనీ బాధ్యతలు చూసుకోవట్లేదని అపర్ణ అంటుంది.

బుకాయించిన రాహుల్

అదంతా కోర్టులో చెప్పుకోవాలి. ఇప్పుడు కంపెనీ ఎవరి పేరు మీద వాళ్లనే అరెస్ట్ చేయాల్సిందే. అదే మా రూల్ అని ఎస్సై అంటాడు. కొంతసేపు ఓపిక పట్టండి. అసలు నేరస్థుడు ఎవరో తెలుస్తుంది అని ఇందిరాదేవి అంటుంది. ఏరా రాహుల్ నువ్వేగా కంపెనీకి వెళ్తున్నావ్. ఏం చేస్తున్నావ్. ఏ ఫ్రాడ్ చేశావ్ అని సుభాష్ అంటాడు. కంపెనీలో ఇలా స్మగుల్డ్ గోల్డ్ కొంటామని నాకెల తెలుసు అని రాహుల్ అంటాడు. షటప్ నిజం ఒప్పుకో అని సుభాష్ అంటాడు.

మీకు విశ్వాసం లేదని ప్రకాశం అంటాడు. నీ కొడుకుని నిజం ఒప్పుకోమ్మని అపర్ణ అంటుంది. రాజ్‌ను అరెస్ట్ చేస్తారని తెలిసి.. దానికి బదులు నా కొడుకుని అరెస్ట్ చేయించి చేతులు దులిపేద్దామనుకుంటున్నారా. ఎంత తెలివి. వాడిని అడ్డమైన కేసులో ఇరికిద్దామనుకుంటున్నారా అని రుద్రాణి అంటుంది. నువ్వేమంటావ్ స్వప్న అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. రాజ్ ప్రాణం పోయినా ఇలాంటి తప్పు చేయడు. కానీ, రాహుల్ అవసరానికి ప్రాణం తీసైనా తప్పు చేస్తాడు. తన భార్యను అని బయట తెలిస్తే నా పరువు పోతుంది అని స్వప్న అంటుంది.

చూశావా.. కట్టుకున్న భార్య మాత్రం నమ్మడం లేదు. మర్యాదాగా చేసిన నేరం ఒప్పుకుంటే మంచిది రాహుల్ అని ఇందిరాదేవి అంటుంది. మీ వంశ ప్రతిష్ట కోసం నా కొడుకుని బలి చేయాలని అనుకుంటున్నారా అని రుద్రాణి అంటే.. నువ్ రాజ్ తప్పు చేశాడని నమ్ముతున్నావా అని ప్రకాశం అంటాడు. అదంతా నాకు తెలియదు. చేసే ఉంటాడేమో. పోలీసులు, కోర్టులే తేల్చుతాయి. ఈ నేరాన్ని బలవంతంగా నా కొడుకుపై మోపడానికి నేను ఒప్పుకోను అని రుద్రాణి అంటుంది.

కాపాడిన కావ్య

నేను రెండ్రోజుల నుంచి మాత్రమే కంపెనీని చూసుకుంటున్నాను. ఇంతలో నేను ఇలాంటి ఫ్రాడ్ ఎలా చేస్తాను అని రాహుల్ అంటాడు. కంగారుపడకు రాహుల్. ఇది కంపెనీ ప్రతిష్టకు సంబంధించిది. ఇందులో నేను ఎవరిని బ్లేమ్ చేయాలని అనుకోవట్లేదు. నేనే నైతిక బాధ్యత వహించి పోలీసులకు కోపరేట్ చేస్తాను అని రాజ్ అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో తాతయ్య ఆశయాలను తుంగలో తొక్కి ఇలాంటి ఫ్రాడ్ చేసి ఎలాగు ఆఫీస్‌కు రాహుల్ వెళ్తున్నాడు కాబట్టి దొరికినా వాడిమీద తోసేయాలని అనుకున్నావ్ కదా అని రుద్రాణి అంటుంది. పదండి అని రాజ్ అంటే.. పోలీసులు తీసుకుని వెళ్తుంటారు. ఇంతలో కావ్య హీరోలా ఎంట్రీ ఇచ్చి ఆగమని దొంగబంగారం అగ్రిమెంట్‌కు సైన్ చేసింది ఎవరో ఈ ఫైల్‌లో ఉందని, చూడమని పోలీసులకు ఫైల్ ఇస్తుంది కావ్య. అది చూసిన ఎస్సై ఇదంతా చేసింది రాహులే అని అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం