Brahmamudi October 11th Episode: కనకం 25వ పెళ్లి రోజు- ఆఖరి కోరిక తీరుస్తానన్న అల్లుడు- మారిపోయిన రాజ్- కావ్యకు షాక్
11 October 2024, 8:00 IST
Brahmamudi Serial October 11th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 11వ తేది ఎపిసోడ్‌లో కనకంకు క్యాన్సర్ అని తెలిసి అత్తింటికి వెళ్తాడు రాజ్. అక్కడ రాజ్‌ను ఏమార్చుతుంది కనకం. దాంతో తన ఆఖరు కోరిక నెరవేరుస్తానని చెబుతాడు రాజ్. ఇలా బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్‌లో..
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 11వ తేది ఎపిసోడ్
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్‌లో రాజ్, ప్రకాశం, ఇందిరాదేవి, రాజ్, అపర్ణ అంతా భోజనం చేస్తుంటారు. అమ్మా నాతో కావట్లేదు. పాపం.. కావ్య అని మళ్లీ డ్రామా స్టార్ట్ చేస్తాడు ప్రకాశం. కావ్యకు అలా ఉంటే మనం తినడానికి కసాయి వాళ్లం కాదు కదా అపర్ణ అని లేచి వెళ్లిపోతారు ఇందిరాదేవి, అపర్ణ. ప్రకాశంను రాజ్ అడిగితే మళ్లీ మర్చిపోయాను అంటాడు.
ఏమైంది కళావతికి. ఇక లాభం లేదు. ఇగో పక్కన పెట్టి అడగాల్సిందే అని రాజ్ అనుకుంటాడు. బాగానే నటిస్తున్నారు అత్తయ్య అని ఇందిరాదేవితో అంటుంది అపర్ణ. కనకంతో సావాసం కదా అని ఇందిరాదేవి అంటుంది. వాళ్లిద్దరికి దగ్గరికి వచ్చి ఏమైందని రాజ్ అడుగుతాడు. కానీ, నీకెందుకు, ఎందుకు అడుగుతున్నావ్ అని చెప్పరు అపర్ణ, ఇందిరాదేవి. మళ్లీ రాజ్ అడిగితే.. అపర్ణ చెప్పబొతుంటే ఇందిరాదేవి ఆపుతుంది.
అప్పుకు తెలుస్తుంది
జరిగేది ఎలా జరగక మానదు. నువ్ తెలుసుకుని ఏం చేస్తావ్ అని ఇందిరాదేవి అంటుంది. ఇద్దరు వెళ్లిపోతుంటారు. సరే చెప్పకండి. చెప్పేందుకు కల్యాణ్ లేడా.. వాడిని అడుగుతాను అని రాజ్ అంటాడు. దాంతో ఇద్దరూ షాక్ అవుతారు. అలాంటిదేం లేదని కల్యాణ్ చెబితే మొత్తానికి మోసం జరుగుతుంది అని అనుకుంటారు. ఈ చేదు నిజాన్ని ఇంకెంతమందికి తెలిసేలా చేస్తాంరా. కల్యాణ్‌కు తెలిస్తే.. అప్పుకు తెలుస్తుంది అని అపర్ణ అంటుంది.
భారీ డైలాగ్స్ చెబుతూ మీ అత్తగారు కనకానికి క్యాన్సర్ అని అపర్ణ చెబుతుంది. ఒక నెల రోజుల కన్న ఎక్కువ బతకదు అని ఇందిరాదేవి అంటుంది. మొన్న వినాయక చవికి వచ్చినప్పుడు బాగానే ఉంది కదా అని రాజ్ అంటాడు. ఏం బాగుందిరా. ఓసారి గుర్తు తెచ్చుకో. ఆరోజు రుద్రాణి రెచ్చగొట్టిన, ధాన్యలక్ష్మీ మాటలకు ఎప్పుడు ఇచ్చినట్లు సమాధానం ఇవ్వకుండా నీరసంగా ఉంది అని అపర్ణ అంటే.. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ కదరా అని ఇందిరాదేవి అంటుంది.
మరి ఈ విషయం కళావతికి తెలుసా అని రాజ్ అడుగుతాడు. అమ్మో.. ఇప్పటికే నీకు దూరమై పుట్టింట్లో జీవచ్ఛవంలా బతుకుతుంది. ఇప్పుడు తల్లి కూడా దూరం అవుతుందని తెలిస్తే కావ్య తట్టుకోలేదురా. భర్త లేని అత్తింట్లో.. తల్లి లేని పుట్టింట్లో అది ఎలా బతుకుతుందిరా అని అపర్ణ అంటుంది. చెప్పకండి. నిజంగానే కళావతి తట్టుకోలేదు అని రాజ్ ఫీల్ అవుతాడు. ఆ విషయం కూడా చెబుదామా అని కనకం ఆఖరి కోరిక అంటుంది ఇందిరాదేవి.
తన తలరాత అలా ఉంది
ఏంటీ.. కొంపదీసి కళావతిని కాపురానికి తీసుకురావాలా. ఇదేనా ఆమె ఆఖరి కోరిక అని రాజ్ అంటే.. కాదు. నువ్ మనుషులను ఎప్పటికీ అర్థం చేసుకోలేవురా. ఇప్పటికిప్పుడే కనకాన్ని అపార్థం చేసుకున్నావ్. వదిలేయ్ నీవల్ల కాదు. మా వల్ల కాదు అని అపర్ణ అంటుంది. పాపం కనకం అలా ఆఖరి కోరిక తీరకుండానే చనిపోవాల్సిందేనా అని ఇందిరాదేవి అంటారు. పాపం తన తలరాత అలా ఉంది ఏం చేస్తాం అని అపర్ణ అంటుంది.
అలా అంటూ వెళ్లిపోతారు. మీరు చెప్పకుంటే ఏంటీ నేను మా అత్తగారినే అడిగి తెలుసుకుంటాను. పాపం మా అత్తగారు అని రాజ్ బయలుదేరుతాడు. అబ్బో అని అపర్ణ, ఇందిరాదేవి నవ్వుకుంటారు. కనకంకు కాల్ చేద్దామని వెళ్తారు ఇద్దరు. కట్ చేస్తే మరోవైపు ఆగదు.. ఆగదు.. అనే పాటకు శాలువ వేసుకుని క్యాన్సర్ పేషంట్‌లా జీవించేస్తుంటుంది కనకం. స్థంబం పట్టుకుని ఏడుస్తుంటుంది. అక్కడే లాయర్ ఉంటాడు. మీ అల్లుడు ఇంకా రాలేదండి. అప్పుడే స్టార్ట్ చేశారు అంటాడు.
ఇంతలో రాజ్ వస్తాడు. కర్చీఫ్‌పై రక్తంలా కనిపించేందుకు కలర్ వేస్తుంది. దగ్గినట్లు చేస్తుంది కనకం. అయ్యో రక్తమండి అని లాయర్ అంటాడు. ఇప్పుడే చనిపోను లేండి అని కనకం అంటుంది. నేను పోయేలోపు ఈ ఇంటిని మూడు ముక్కలు చేసి మా అల్లుల్లా పేరు మీద రాయండి అని కనకం అంటుంది. ఎవరైనా కూతుళ్ల పేరు మీద రాయమంటారు మీరేంటీ అల్లుళ్ల పేరు మీద రాయమంటున్నారు అని లాయర్ అంటాడు. కూతుళ్ల పేరు మీద ఉంటే అల్లుళ్లకు మర్యాద ఇవ్వరు అని కనకం దగ్గుతుంది.
రక్తం కనపడేలా
అయ్యో అత్తయ్య అంటూ వెళ్లిన రాజ్.. కనకంను కూర్చెబడతాడు. ఇల్లు రాస్తే మావయ్య ఎక్కడుంటాడు. ఇల్లు ముక్కలు చేయాల్సిన అవసరం లేదు అని రాజ్ అంటాడు. అల్లుడు గారికి ఏం తెలియదని కనకం లాయర్‌తో అంటుంది. నాకు తెలుసు అమ్మ వాళ్లు అంతా చెప్పారు అని జరిగింది చెబుతాడు రాజ్. లేదు బాబు లేదు.. వాళ్లేదే పొరపాటు పడ్డారు అని నాటకం ఆడుతూ.. కర్చీఫ్‌పై ఉన్న రక్తం కనపడేలా చేస్తుంది. మీరు అబద్ధం ఆడిన ఆ కర్చీఫ్ నిజం చెబుతుందని రాజ్ అంటాడు.
పదండి హాస్పిటల్‌కు వెళ్దామంటాడు. పెద్ద డాక్టర్‌కు చూపిస్తానంటాడు రాజ్. ఆ పెద్ద డాక్టర్‌కు చూపిస్తేనే ఆఖరు దశలో ఉందని చెప్పారు. అదేదే కీమా థెరపీ అన్నారు అని కనకం అంటుంది. అది కీమో థెరపీ అని రాజ్ అంటాడు. ప్రాణాలు పోయేదానికి ఏ పేరు అయితేంటీ బాబు అని కనకం అంటుంది. ఇలాగే భారీ భారీ డైలాగ్స్ కొడుతుంది కనకం. మొత్తానికి రాజ్‌ను ఏమారుస్తుంది. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో మనవళ్లు, మనవరాళ్లను చూడకుండానే పోతున్నాను అని కనకం అంటుంది.
అత్తయ్య ఏదో చివరి కోరిక ఉందటకదా. అదేంటో చెప్పండి. ఎంత కష్టమైనా సరే ఆ కోరిక నేను నెరవేరుస్తాను అని రాజ్ అంటాడు. బాబు అని ఎమోషనల్ అవుతూ దగ్గుతుంది. అత్తయ్య గారు ఆవేశపడకండి. ఆవేశపడితే దగ్గు వస్తుంది. దగ్గు వస్తే రక్తం వస్తుందని రాజ్ అంటాడు. దగ్గును ఆపలేం, రక్తాన్ని ఆపలేం. ఏది ఆపలేమని తెలిసినప్పుడు వచ్చే రక్తాన్ని రానివ్వడమే.. వచ్చే చావును చిరునవ్వుతో రమ్మనడమే అని కనకం అంటుంది.
మీ కొడుకు అనుకోండి
అత్తయ్య గారు.. అని సన్నని గొంతుతో ఎమోషనల్ అయిన రాజ్ ఇలాంటి బరువైన డైలాగ్స్ మాట్లాడకండి. క్యాన్సర్ పేషంట్లను సినిమాల్లో తప్పితే నిజంగా చూడలేదు. తట్టుకోలేకపోతున్నానండి. ఆఖరి కోరకి చెప్పండి అని రాజ్ అంటాడు. వద్దులేండి. కొడుకు ఉంటే అన్ని తీర్చి కన్నీటీ వీడ్కోలు చేసేవాడు. నా కొడుకు లేడు కదా. అందుకే నా కోరికను అట్టడుగునా దాచాను అని కనకం అంటుంది. నన్ను మీ కొడుకు అనుకోండి. మీ చివరి కోరిక తీర్చలేకపోతే నేను బతికే క్షణం క్షణం బాధపడాలి అని రాజ్ అంటాడు.
నువ్ కొడుకులా అడుగుతున్నావ్ కాబట్టి చెబుతున్నాను. రేపే మా 25వ సంవత్సరం పెళ్లిరోజు. కనీసం ఈ సందర్భంగా అయినా ముగ్గురు అల్లుళ్లు ముగ్గురు కూతుళ్లతో నా చివరాఖరి పెళ్లి రోజు జరుపుకోవాలని ఆశగా ఉంది బాబు అని కనకం అంటుంది. దాంతో రాజ్ షాక్ అయి సైలెంట్ అవుతాడు. చూశారా బాబు గారు. మీరు ఆలోచిస్తున్నారు. మీరు కావ్యతో కలిసి జరిపించలేరు. అందుకే నా ఆఖరి కోరిక తీరని కోరికగా మిగిలిపోతుంది అని భారీగా దగ్గుతుంది కనకం.
ఇక చేసేది లేక. మీ ఆఖరి కోరిక తీరుతుంది అత్తయ్య గారు. మీ ఆఖరి కోరిక తీరుస్తానంటున్నాను. మీరు తీరని కోరికతో తనువు చాలించాల్సిన అవసరం లేదు. తృప్తిగానే పోవచ్చు అని రాజ్ అంటాడు. నిజమా బాబు.. నిజంగానే నా కోరిక తీరుతుందా. మీరు లక్ష్మీ పార్వతుల్లా నడిచి వస్తారా అని కనకం అడుగుతుంది. మేం ముగ్గురమే కాదు మా ఇంటిల్లిపాది కదిలి వస్తాం అని రాజ్ అంటాడు. మీరు నా ఆయుష్షు పోసుకోని.. అయ్యో నాకు ఆయుష్షే ఉంటే నేనేందుకు పోతాను అని కనకం అంటుంది.
కావ్య తట్టుకోలేదు
నిండు నూరేళ్లు ఎలాంటి క్యాన్సర్ రాకుండా, జబ్బు రాకుండా ఉండాలని దీవిస్తుంది కనకం. మీ ఆఖరి కోరిక తీరుతుందంటే చాలా తృప్తిగా ఉందని రాజ్ అంటాడు. కానీ, ఈ నిర్బాగ్యురాలి పెళ్లి అంటే మీ ఇంట్లో అందరు వస్తారా అని అడుగుతుంది కనకం. వస్తారు అని రాజ్ వెళ్లిపోతుంటే.. కనకం ఆపుతుంది. నేను పోతున్నట్లు నా కూతుళ్లకు తెలియదు. స్వప్న, అప్పు పోయినా తట్టుకోగలరు గానీ కావ్య మాత్రం తట్టుకోలేదు. గుండెపగిలి ఏదైనా అయితే ఆ పాపం మనకే తగిలుతుంది బాబు అని కనకం అంటుంది.
ఈ విషయం కళావతికి తెలియదు. ఇది మన నలుగురి మధ్యలోనే ఉంటుంది అని రాజ్ అంటాడు. చాలా సంతోషం బాబు అని కనకం చేతులెత్తి మొక్కుతుంది. రాజ్ వెళ్లిపోతాడు. గేట్ దగ్గరికి వెళ్లిన రాజ్ తిరిగి వెనక్కి చూస్తాడు. అప్పుడు మరింత దగ్గినట్లు చేస్తుంది కనకం. రాజ్ కారులో ఎక్కి వెళ్లిపోతాడు. అది కావ్య చూస్తుంది. కనకం తెగ సంబరపడిపోతుంటుంది. ఇంతలో కావ్య రావడం చూసి శాలువ తీసి పక్కన పెట్టి టీపాయ్ క్లీన్ చేస్తుంది కనకం.
అమ్మా.. ఆయనెందుకు వచ్చారు. నాకోసమే వచ్చారా. ఇంకా తిట్టడానికి మిగిలిపోయాయేమో అని కావ్య అంటుంది. నిన్ను తిట్టేది నన్నెందుకు తిడతాడు. భార్య పుట్టింట్లో ఏ భర్తకైనా బాధగానే ఉంటుంది. ఆ బాధ భరించలేక కోపాన్ని పక్కకు పెట్టి వచ్చి ఉంటాడు అని కనకం చెబితే.. కావ్య నమ్మదు. లేదే అల్లుడు గారు నిజంగానే మారిపోయారు. రేపు నీతో కలిసి మా పెళ్లిరోజు జరిపిస్తారేమో అని కనకం అంటుంది. అలాగే నమ్ము.. వచ్చే పెళ్లిరోజు కూడా రారు అని కావ్య అంటుంది.
మారిపోయిన రాజ్
అప్పటివరకు నేను బతికి ఉండను కదా అని కనకం నోరు జారుతుంది. ఏంటీ అని కావ్య అంటే.. ఆ గ్యారెంటీ లేదు కదా అని కనకం అంటుంది. ఏంటో అని వెళ్లిపోతుంది కావ్య. అపర్ణ, ఇందిరాదేవికి కాల్ చేస్తుంది కనకం. వాళ్లు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతారు. రాజ్ ఒప్పుకుంది చెబుతుంది. అబ్బా శుభవార్త చెప్పావ్. ఎంతైనా అబద్ధాన్ని నిజమని నమ్మించడంలో నిన్ను మించరు కనకం అని ఇందిరాదేవి అంటుంది. తిట్టారా పొగిడారా అని కనకం అంటుంది.
నువ్ ఏదైనా సాధించగలవు అని అంటున్నాను అని ఇందిరాదేవి అని కాల్ కట్ చేస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో కనకం ఇంటికి దుగ్గిరాల కుటుంబం మొత్తం వస్తుంది. అత్తయ్యగారు మీరు బయటకెందుకు వచ్చారు అని హడావిడి చేస్తాడు రాజ్. కట్ చేస్తే అందరికందరు మారిపోయి పండంటి సంసారం ఉమ్మడి కుటుంబం సినిమా చూస్తున్నారేంటీ అని కావ్య అడుగుతుంది. ఇంకా ముందుంది అసలు పండుగ అని రాజ్ అంటాడు.
టాపిక్