Brahmamudi March 22nd Episode: బ్రహ్మముడి సీరియల్.. పుట్టింటికి కావ్య! అపర్ణకు కనకం వార్నింగ్.. రాజ్ బిడ్డకు తల్లి ఎవరు?
22 March 2024, 8:22 IST
Brahmamudi Serial March 22nd Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 22వ తేది ఎపిసోడ్‌లో ఆ బిడ్డ తల్లి గురించి ఎవరు మాట్లాడట్లేదని, ఆమె ఎవరని రాజ్‌ను కావ్య నిలదీస్తుంది. మరోవైపు కనకం, అపర్ణ గొడవపడుతుంటారు. అపర్ణకు కనకం వార్నింగ్ ఇస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
బ్రహ్మముడి సీరియల్ మార్చి 22వ తేది ఎపిసోడ్
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అసలు అందరం కేవలం ఈ బిడ్డ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఈ బిడ్డను కన్న తల్లి గురించి అడగడమే మర్చిపోయాం. చెప్పండి.. మిమ్మల్నే అడిగేది.. ఈ బిడ్డకు తల్లి ఎవరు అని రాజ్‌ను కావ్య అడుగుతుంది. దాంతో రాజ్ మౌనంగా ఉంటాడు. అది చూసి విసిగిపోయిన కావ్య తట్టి మరి చెప్పండి ఈ బిడ్డకు తల్లి ఎవరు అని నిలదీస్తుంది. రాజ్ అలా మౌనంగా ఉండి కావ్యను చూస్తూ ఉంటాడు.
అంత కష్టంగా తీసుకెళ్లండి
మరోవైపు అపర్ణ, కనకం ఇద్దరూ గొడవ పడుతుంటారు. అసలు నీ కూతురు జేష్ట్య దేవిలాగా మా గడపలో కాలు మోపిన నాటి నుంచే మా ఇంటికి అరిష్టం చుట్టుకుంది అని అపర్ణ కోపంతో అంటుంది. నా కూతురికి ఇంత అన్యాయం చేసి పై నుంచి దాందే తప్పంటే మాత్రం మీకు మర్యాదగా ఉండదు అని కనకం వార్నింగ్ ఇస్తుంది. నీ కూతురికి ఇంత కష్టంగా ఉంటే.. ఆ కష్టాన్ని చూసి మీ కన్నపేగు మెలితిరిగిపోతుంటే.. ఇంకా ఇక్కడే ఎందుకు ఉంటారు. తీసుకోని పోండి అని అపర్ణ అంటుంది.
పుట్టింటికి కావ్య
దాంతో పంపించండి.. ఇప్పుడే పంపించండి అని కనకం కూడా అనేస్తుంది. ఇంతలో కావ్య ఎంట్రీ ఇస్తుంది. అమ్మా అని గట్టిగా అంటుంది. చూస్తుంటే కనకంనే కావ్య మందలించేలా ఉందని తెలుస్తోంది. లేదా మరి కావ్య పుట్టింటికి వెళ్తుందా అనేది చూడాలి. మరోవైపు రాజ్ తీసుకొచ్చిన బిడ్డ ఎవరో, బాబు కన్నతల్లి ఎవరో రాజ్ చెబుతాడా అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
సైలెంట్‌గా రాజ్
బ్రహ్మముడి సీరియల్ నిన్నటి ఎపిసోడ్‌లో తనలోని ప్రేని రాజ్ బయటపెడతాడా అని ఎదురుచూస్తున్న కావ్యకు పెద్ద షాక్ తగులుతుంది. ఓ బాబును తీసుకొచ్చిన రాజ్ ఆ బిడ్డ తనే బిడ్డ అని చెబుతాడు. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది. అది నిజం కాదు, అసలు నిజం చెప్పమని, ఎందుకు ఇలా చేశావని అంతా అడుగుతారు. కానీ రాజ్ మాత్రం ఏం చెప్పకుండా సైలెంట్‌గా ఉండిపోతాడు.
ఇంతకన్నా నీతిమంతుడు
అనంతరం తన గదిలో ఉన్న రాజ్ దగ్గరికి వెళ్తుంది కావ్య. అక్కడ రాజ్‌ను నిలదీస్తుంది కావ్య. కళ్లముందు ఆ బాబు సాక్ష్యంగా కనిపిస్తుంటే మీకంటే ధైర్యవంతుడు లేడు అనుకోవాలా. మీరు నిజాన్ని దాచిపెట్టి మీరు ఎక్కడో కాపురాన్ని వెలగబెట్టకుండా బిడ్డతో ఇంటికి వచ్చినందుకు మీ నిజాయితీ చూసి ఇంతకన్నా నీతిమంతుడు ఇంకెక్కడ దొరకడు అనుకోవాల అని కావ్య అడుగుతుంది. ఎన్ని ప్రశ్నించిన రాజ్ మాత్రం మౌనంగా ఉండిపోతాడు.
నిజ స్వరూపం తెలిసి
దాంతో విసిగిపోయిన కావ్య.. ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నా.. నా ముందు ప్రశ్నార్థకంగా నిలబడితే నాకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది. నేను కట్టుకున్న గూడు కూలిపోయింది. ఆ శిథిలాల్లో సమాధానం వెతుక్కోవాలా. నా కళ్ల ముందు భవిష్యత్తు చీకటిగా మారిపోయింది. ఆ శూన్యంలో జవాబు కోసం వెతుక్కోవాలా. నేను మీ మీద పెంచుకున్న నమ్మకం అద్దంలా ముక్కలైపోయింది. ఆ ముక్కల్లో కనిపించే ప్రతిబింబాల్లో మీ అసలు స్వరూపం వెతుక్కోవాలా. ఇదేంటీ అని లోకాన్ని అడగాలా నాకు తగిలిన శాపాన్ని అడగాలా.. ఎవరినీ అడగాలి, ఏమని అడగాలి చెప్పండి అని రాజ్‌ను కావ్య బాధతో నిలదీస్తుంది.
ఇదేనా ముఖ్యమైన నిర్ణయం
ఏం చెప్పాలి. అడిగే స్థానంలో నువ్వు ఉన్నావ్. చెప్పలేని దూరంలో నేను ఉన్నాను అని రాజ్ అంటాడు. ఈ మాటలు చెప్పి తప్పించుకోవాలని చూడకండి. ఒక్కమాట అడుగుతాను. నిజం చెప్పండి. మీరు మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయం చెబుతాను అన్నారు. ఇదేనా. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటానని అన్నారు. అది ఈ బాబును ఇంటికి తీసుకురావడమేనా అని కావ్య అడుగుతుంది. అయినా రాజ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు.
టాపిక్