తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi March 1st Episode: బ్రహ్మముడి.. అమ్మమ్మ స్మార్ట్ ప్లాన్.. కావ్య పుట్టింటికి బావ, రాజ్.. కల్యాణ్‌కు అప్పు సలహా

Brahmamudi March 1st Episode: బ్రహ్మముడి.. అమ్మమ్మ స్మార్ట్ ప్లాన్.. కావ్య పుట్టింటికి బావ, రాజ్.. కల్యాణ్‌కు అప్పు సలహా

Sanjiv Kumar HT Telugu

01 March 2024, 7:18 IST

google News
  • Brahmamudi Serial March 1st Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 1వ తేది ఎపిసోడ్‌లో అనామిక అన్న మాటలు బాధపడిన కల్యాణ్ తానేంటో నిరూపించుకోవాలని తన కవితలను పబ్లిష్ చేయాలని అనుకుంటాడు. మరోవైపు రాజ్ కోసం ఇందిరాదేవి స్మార్ట్ ప్లాన్ వేస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ మార్చి 1వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మార్చి 1వ తేది ఎపిసోడ్‌

బ్రహ్మముడి సీరియల్ మార్చి 1వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కల్యాణ్‌కు ఖైరతాబాద్ బ్రాంచ్ పేపర్స్ ఇస్తూ ఆ బ్రాంచ్ చూసుకోమ్మని చెబుతాడు రాజ్. మనకు కావాల్సిన వారి కోసం కొన్ని చేయక తప్పదు అని రాజ్ అంటాడు. నువ్వేనా మాట్లాడుతున్నావ్ అన్నయ్య అని కల్యాణ్ అంటే.. నీ మంచి కోసం ఇలా చేయమని మీ అన్నయ్య చెబుతున్నారు అని కావ్య అంటుంది. మనసుకు నచ్చిన పని చేయమని మీరే కదా అన్నారు అని కల్యాణ్ అంటాడు.

బాధపెట్టాలని చూస్తున్నారా

అది చేస్తూనే ఇది కూడా చేయండి అని కావ్య అంటుంది. నా వల్ల కాదు వదినా. నా మనసుకు నచ్చని పని చేయలేను. ఇన్ని రోజులు ఆఫీస్‌కు వెళ్లి నటించింది చాలు. అలసిపోయాను. నాకు నచ్చిందే చేస్తాను అని కల్యాణ్ అంటాడు. అంటే ఏం చేయబోతున్నారు అని అనామిక అడుగుతుంది. నీకు అర్థం కానీ, అర్థం చేసుకోలేనిది అని కల్యాణ్ అంటాడు. అంటే, మళ్లీ నన్ను బాధపెట్టాలని అనుకుంటున్నారా అని అనామిక అంటుంది.

నేను నిన్ను బాధ మాత్రమే పెడుతున్నాను. కానీ, నువ్ మాత్రం నా మనసు ముక్కలు చేశావ్ అని కల్యాణ్ అంటాడు. నీ భార్య నీ మంచి కోసమే కదరా చెబుతోంది అని ధాన్యలక్ష్మీ అంటే.. పాతికేళ్ల వచ్చినవాడికి ఏది మంచి ఏది చెడు అని చెబితే జెనరేషన్ తాలుకూ అర్థమేముంది అని కల్యాణ్ అంటాడు. శభాష్ రా కల్యాణ్. నేను నిన్ను సపోర్ట్ చేస్తాను అని తండ్రి ప్రకాశం అంటాడు. బాబాయ్ మీరు కూడా ఏంటిది అని రాజ్ అంటాడు.

నేనేంటో నిరూపించాలి

నువ్ అందరూ అంటున్నారని, నీ పిన్ని బాధపడుతుందని నీ తమ్ముడిని దారిలో పెట్టాలనుకుంటున్నావ్. నువ్ కల్యాణ్‌కు ఎంత అండగా నిలుచున్నావో ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదు అని ప్రకాశం అంటాడు. మరి ఇప్పుడు ఎక్కడికీ వెళ్తున్నావురా అని సుభాష్ అడుగుతాడు. నాకు ఏది చేతకాదు అని కొందరు ఇక్కడ అనుకుంటున్నారు. నేనేంటో నిరూపించాలని వెళ్తున్నాను. నా కవితలను ఎవరైనా పబ్లిష్ చేస్తారో వెళ్లి ట్రై చేస్తాను అని కల్యాణ్ అంటాడు.

అంటే ఈ కవితలను తీసుకుని గొప్ప కవి అవ్వాలనుకుంటున్నావా అని అనామిక అంటుంది. నాపై నీకు ఎలాగు నమ్మకం లేదు. కనీసం నాకైనా ఉండాలిగా అని కల్యాణ్ అంటాడు. దానికి ఇంకొకరి దగ్గరికి వెళ్లడం ఎందుకురా. ఎంత అవుతుందో చెప్పు. మనమే పబ్లిష్ చేద్దాం అని రాజ్ అంటాడు. డబ్బు ఉంది కదా అని కవిని కాలేను అన్నయ్య. ఇది నా అస్థిత్వం కోసం చేస్తున్నా పోరాటం అని కల్యాణ్ అంటాడు. కల్యాణ్ నువ్ వెళ్లురా.. ఆల్ ది బెస్ట్ అని ప్రకాశం అంటాడు. తర్వాత సుభాష్, అపర్ణ కూడా చెబుతారు.

మంచి ఫీల్‌తో రాశారు

రాజ్ ఆలోచిస్తుంటే.. నీకు కూడా నమ్మకం లేదా అన్నయ్య అని కల్యాణ్ అంటాడు. నా తమ్ముడు సాధించలేనిది ఇంకెవరు సాధించలేరురా. ఆల్ ది బెస్ట్ అని రాజ్ అంటాడు. దాంతో కల్యాణ్ వెళ్లిపోతాడు. అనామిక మాత్రం కోపంగా ఉంటుంది. అది రాజ్ చూస్తాడు. కట్ చేస్తే ఓ ఆఫీస్‌లో కల్యాణ్ కవితలను చదివిన పబ్లిషర్ చాలా బాగున్నాయని, మంచి ఫీల్‌తో రాశాని పొగుడుతాడు. కానీ, పబ్లిష్ చేయనని అంటాడు. ఈ కాలంలో కవితలు ఎవరు చదవట్లేదు. మీ రైటింగ్ స్టైల్ బాగుంది. మంచి లవ్ స్టోరీ రాయండి. తప్పకుండా పబ్లిష్ చేస్తాను అని అతను చెబుతాడు.

అందులో నిజం ఉండదండి. అంతా వాడుకుంటున్నట్లుగా ఉంటుంది అని కల్యాణ్ అంటే.. మీరు మాత్రం నిజంలో బతకండి. మీ కవితలను పబ్లిష్ చేసే వారు ఎవరు ఉండరు. దొరకరు అని అతను అంటాడు. నేను ఇంట్లో వాళ్లతో గొడవపడి మరి వచ్చానండి. మీరు చెబితే నాకు నచ్చని పని చేయను. నేను ఇప్పుడే కదా ప్రయాణం మొదలుపెట్టాను. అప్పుడే అయిపోయింది అంటున్నారు అని కల్యాణ్ వెళ్లిపోతాడు. మరోవైపు అనామిక, ధాన్యలక్ష్మీ అన్న మాటలను తలుచుకుంటాడు రాజ్.

బావను అప్లై చేయమను

రాజ్‌ను చూసిన కావ్య, బావ తమ గురించే ఆలోచిస్తున్నట్లు ఉన్నాడు అని అనుకుంటారు. నువ్ ఇప్పుడు వెళ్లి పాస్ పోర్ట్‌కి అప్లై చేస్తాను అంటే అదిరిపడతాడు. తర్వాత వీసా, అమెరికా గుర్తుకు వచ్చి కంగు తింటాడు అని బావ అంటాడు. దాంతో వెళ్లి పాస్ పోర్ట్ ఫామ్ అప్లై చేయమని రాజ్‌ను కావ్య అడుగుతుంది. సరే అప్లై చేసుకో. మీ బావను అప్లై చేయమని అని కావ్యకు షాక్ ఇస్తాడు రాజ్. నేను ఇదివరకు ఇలాంటివి అప్లై చేయలేదు అని కావ్య అంటే.. సరే ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు గుర్తు చేయి చేస్తాను అని రాజ్ అంటాడు.

ఇది ఎందుకోసం చేస్తున్నానో తెలుసుకోవాలని లేదా అని కావ్య అంటుంది. లేదు అని రాజ్ అంటే కావ్య షాక్ అవుతుంది. ఇంట్లో అందరీ స్వతంత్రంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి నీ స్వతంత్రను నేను ఎందుకు కాదనలి అని వెళ్లిపోతాడు రాజ్. దాంతో ఏమైంది ఈయనకు అని కావ్య అనుకుంటుంది. మరోవైపు కల్యాణ్‌కు కవితలు బాగున్నాయి. స్టోరీ డెవలప్ చేసేందుకు వస్తారా అని కాల్ వస్తుంది. నేను కవితలు, పాటలు తప్పా స్టోరీస్ రాయలేనని అంటాడు కల్యాణ్.

నన్ను లవ్ చేశావ్‌గా

కారు దిగి ఓ చోట కొబ్బరిబొండాం తాగుతాడు. కానీ, కల్యాణ్ దగ్గర డబ్బులు లేకపోవడంతో అప్పు వచ్చి ఇస్తుంది. తర్వాత అప్పుకు జరిగిందంతా చెబుతాడు కల్యాణ్. నువ్ అనుకున్నది సాధించాగకా వాళ్లే నిన్ను గొప్పగా ఫీల్ అవుతారు అని అప్పుఅంటుంది. అనామికను బాధ పెడుతున్నాను ఒకవైపు, నన్ను అర్థం చేసుకోలేదని మరోవైపు బాధగా ఉంది అని కల్యాణ్ అంటాడు. నువ్ కూడా నన్ను లవ్ చేశావ్ గా అలా ఎప్పుడు సాధించలేదు కదా అని కల్యాణ్ అంటాడు.

దానికి కొడుకుకు జాబ్ రాకుంటే తండ్రి అరుస్తాడు. నిలదీస్తాడు. అంతమాత్రానా ప్రేమ లేనట్లు కాదు. అవన్నీ పక్కన పెట్టి నీ పని మీద ఫోకస్ పెట్టు అని అప్పు అంటుంది. దాంతో అవును, అది కూడా నిజమే. థ్యాంక్స్ అప్పు. ఎప్పుడు నాలో ఆత్మవిశ్వాసం పెంచుతావ్ అని కల్యాణ్ అంటాడు. తర్వాత తాను పోలీస్ అవ్వాలని అనుకుంటున్నట్లు చెబుతుంది అప్పు. నువ్ కచ్చితంగా సాధిస్తావ్. ఆల్ ది బెస్ట్ అని చేయి ఇస్తాడు కల్యాణ్.

పుట్టింటికి వెళ్తున్నామని

మరోవైపు రాజ్ పట్టించుకోని విషయం ఇందిరాదేవికి చెబుతుంది కావ్య. తన తమ్ముడు బాధ పడుతున్నాడని ఫీల్ అవుతున్నాడని, అతని గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని పట్టించుకోడు అని ఇందిరాదేవి చెబుతుంది. దాంతో కావ్య, బావ ఇద్దరూ వాళ్ల పుట్టింటికి వెళ్తున్నట్లు, అక్కడికి రాజ్ వచ్చేలా చేయాలని ముగ్గురు ప్లాన్ చేస్తారు. అలాగే తాను పుట్టింటికి వెళ్తున్నాను అని రాజ్‌కు కావ్య చెబుతుంది. దాంతో సంతోషంగా వెళ్లిరా.. నేను చాలా ప్రశాంతంగా ఉంటాను అని రాజ్ అంటాడు.

దాంతో మీరు ఇలాగే అంటారని నేను ముందే చెప్పాను అన్నయ్యా అని కావ్య బావ అంటే.. నీ బొందరా అది అక్కడికి వెళ్తే మీ ఇద్దరిని దూరంగా ఉంచొచ్చు అని నా ప్లాన్ అని రాజ్ అనుకుంటాడు. సరే బుజ్జి నేను కూడా నా బట్టలు సర్దుకుంటాను అని బావ అంటాడు. దాంతో షాక్ అయిన రాజ్.. ఏంటీ నువ్ కూడా వెళ్తున్నావా అని రాజ్ అంటాడు. అవును, నేను ఒక్కదాన్నే ఎలా వెళ్తాను. మా బావతో కలిసి వెళ్తున్నాను అని కావ్య చెబుతుంది. దాంతో ఇలా బుక్ చేశావేంటే అని రాజ్ అనుకుంటాడు.

కావ్య, బావకు హారతి

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో కారులో నుంచి దిగిన బావకు పక్కనే ఉన్న కావ్యకు కనకం హారతి ఇయ్యబోతుంది. దాంతో హే ఆగమని మధ్యలో దూరుతాడు రాజ్. కళావతికి, బావకు ఎలా హారతి ఇస్తారు అని రాజ్ అంటే.. అంటే అల్లుడికి అని కనకం అంటే.. అల్లుడు కాదు మేనల్లుడు అని రాజ్ అంటాడు. వెళ్లి బావ బ్యాగ్స్ రాజ్ తీసుకొస్తే.. అదేంటి మేనల్లుడి బ్యాగ్స్ మీరెందుకు తెస్తున్నారు. మీరు కాఫీ తాగి వెళ్తారనుకున్నాను అని కనకం అంటుంది. అంటే నేను రానని వీళ్లు బాగా ఫిక్స్ అయినట్లు ఉన్నారు అని రాజ్ మనసులో అనుకుంటాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం