Brahmamudi March 15th Episode: బ్రహ్మముడి.. ఊహించని ట్విస్ట్, రాజ్‌కు విడాకులు ఇచ్చేసిన కావ్య.. షాక్‌లో రాజ్, శ్వేత సలహా
03 April 2024, 12:07 IST
Brahmamudi Serial March 15th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 15వ తేది ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. రాజ్‌కు కావ్య విడాకులు ఇచ్చేసింది. ముందు తనలోని ప్రేమను చెప్పినట్లుగా ఊహించుకున్న కావ్య తర్వాత డివోర్స్ పేపర్స్‌పై సంతకం చేసి ఇచ్చేసింది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
బ్రహ్మముడి సీరియల్ మార్చి 15వ తేది ఎపిసోడ్
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మీరు ఎందుకు మా వాళ్లను నానా మాటలు అనేలా చేస్తున్నారు అని కల్యాణ్‌ను నిలదీస్తుంది కావ్య. నేను ఏం చేయలేదు వదినా. పాములకు కాటు వేయడం నేను నేర్పట్లేదు. అవి వాటి సహజ గుణం. నాకు అప్పు పెళ్లికి ముందు ఫ్రెండే ఇప్పుడు ఫ్రెండే అని కల్యాణ్ అంటాడు. కానీ దానివల్ల మా అప్పును నిందిస్తున్నారు. మేము కావాలనే మిమ్మల్ని ప్లాన్ చేసి మావైపు లాక్కుంటున్నామని అంటున్నారు అని కావ్య అంటుంది.
అప్పును కలుస్తాను
అది వాళ్ల అభిప్రాయం అని కల్యాణ్ అంటాడు. మీది తెల్లని కాగితం లాంటి మనసు అని నాకు తెలుసు. కానీ, దానిపై సిరా చుక్కలు పడితే మచ్చ పడినట్లే కదా కవిగారు. మీకు అన్ని తెలుసు కవిగారు కానీ, మీ భార్య మనసులో ఏముందో తెలుసుకోలేకపోతున్నారు. అర్థం చేసుకోవట్లేదు అని కావ్య అంటుంది. అర్థం చేసుకునేవాళ్ల గురించి ఆలోచించొచ్చు కానీ, అపార్థం చేసుకునేవాళ్ల గురించి నేను పట్టించుకోను. ఇప్పుడు అందరూ అంటున్నారని నేను అప్పను కలవకుండా ఉంటే నిజంగానే మా బంధం తప్పు అవుతుంది. మీరు ఏం చెప్పినా ఈ ఒక్క విషయంలో మాత్రం మీ మాట వినను. నేను అప్పును కలుస్తాను. మా ఫ్రెండ్షిప్‌ను మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు అని కల్యాణ్ చెప్పి వెళ్లిపోతాడు.
మరోవైపు రాజ్‌కు కాఫీ ఇస్తుంది కావ్య. దాని తర్వాత కొంత డబ్బు తీసి ఇస్తాడు రాజ్. కాఫీ ఇంత ధర కాదు. ఎందికిస్తున్నారు ఇంత డబ్బు అని కావ్య అడుగుతుంది. అది నీ డబ్బే. నువ్ వేసిన డిజైన్స్‌కు ఇవ్వాల్సిన డబ్బు అని రాజ్ అంటాడు. ఎలాగు నాకు జీతం ఇస్తారుగా అని కావ్య అంటుంది. కానీ, అప్పటివరకు నువ్ ఉండవుగా. నీకు పాస్ పోర్ట్ వచ్చింది కదా. ఇక వెళ్లిపోతావ్. అందుకే ఇప్పుడే ఇస్తున్నా. ఇంకా ఏమైనా డబ్బు కావాలంటే అడుగు ఇస్తాను అని చెప్పేసి వెళ్లిపోతాడు రాజ్. దాంతో షాక్ అవుతుంది కావ్య.
విడాకులపై సంతకం పెట్టు
అప్పుడే కావ్య దగ్గరికి ఇందిరాదేవి, భాస్కర్ వస్తారు. చూశారా అమ్మమ్మ గారు. నన్ను పంపించడానికి ఆయన ఎంత ఆసక్తిగా ఉన్నారో. నేనే ఇన్నాళ్లు నా భార్త, నా కుటుంబం అని పట్టుకుని వేలాడాను. ఇప్పుడు కూడా ఆయన నాపై ప్రేమను బయటపెడతారని అనుకుంటున్నారా అని కావ్య అడుగుతుంది. నువ్ వెళ్లిపోతానని అనేసరికి వాడు తట్టుకోలేక ఇదంతా చేస్తున్నాడు. నువ్ నటించడానికి అహాన్ని అడ్డం పెట్టుకుంటే.. వాడు అహాన్ని చూపించాలని చూస్తున్నాడు. ఇద్దరు తెరపై ఉన్న ప్రేమను ఎవరు తీస్తారా అని చూస్తున్నారు. వాడే ఆ తెర తీయాలంటే ఆ విడాకులపై సంతకం పెట్టి వాడి మొహాన కొట్టు. అప్పుడు ఎలా దిగి రాడో నేను చూస్తాను అని ఇందిరాదేవి అంటుంది.
ఇంకా ఆయన మారతాడని అనుకుంటున్నారా అని కావ్య అంటుంది. నాకైతే ఇంకా నమ్మకం ఉంది కావ్య. మీ ఆయన వికృత చేష్టలు చూస్తేనే నాకే అర్థం అవుతుంది. నీకు ఎందుకు అర్థం కావట్లేదు. పైకి అలా అంటాడు. కానీ, నువ్ లేకుండా బతకలేడు అని భాస్కర్ అంటాడు. ఇంట్లో ఏం జరిగినా నిన్ను చాలా వెనుకేసుకొచ్చేవాడు. నీపై వాడికి ప్రేమ ఉంది. లేకుంటే ఎందుకు అలా చేస్తాడు. నువ్ ఉండవనే ఊహ వాడు భరించలేడు కావ్య. ఇదిగో కావ్య. నీ కాపురాన్ని కాపాడుకోడానికి నీ ముందున్న ఈ అవకాశం వాడుకో. తర్వాత నీ ఇష్టం అని విడాకుల పేపర్స్ ఇచ్చి వెళ్లిపోతుంది ఇందిరాదేవి.
కలవడానికి సంతకం
అనంతరం కృష్ణుని దగ్గరికి వెళ్లి మొర పెట్టుకుంటుంది కావ్య. నీకు దూపా దీప నైవేద్యాలతో పూజలు చేశారు. ఈ ఇంటికి వచ్చినప్పుడు నాకు గది లేకున్నా.. నీకు మాత్రం ఓ గది ఉండాలని ఇక్కడ నిన్ను ప్రతిష్టించాను. అలాగే మా ఆయన భర్తగా మనసులో ప్రతిష్టించుకున్నాను. కానీ, ఆయనకు నాపై ప్రేమ లేదట. నేను భార్యగా పనికిరానట. నువ్ 8 మంది భార్యలను ఎలా భరించావయ్యా. మా ఆయన ఒక్క భార్యనే వద్దంటున్నాడు. పాతాళలోకంలో నీళ్లు ఉండి ఏం లాభం. భూమిపై నీళ్లు ఉండాలి కానీ అని కావ్య అంటుంది.
ఆ నీళ్లు పైకి రావడానికి ఇది. ఇవి విడాకులు. మనుషులు విడిపోడానికి కారణం అయ్యే విడాకులు. కానీ, మేము ఇద్దరం కలవడానికి ఇప్పుడు ఇవే ఉపయోగపడతాయట. ఇది కత్తిమీద సాము అని నాకు తెలుసు. కొంచెం అటు ఇటు అయినా నీదే బాధ్యత సుమ. నాదేం లేదు. నీమీదే బారం వేస్తున్నాను. మాములుగా విడిపోడానికి సంతకం చేస్తారు. నేను కలవడానికి సంతకం చేస్తున్నాను అని విడాకుల పైపర్స్‌పై కావ్య సంతకం చేస్తుంది.
నేను భరించలేను
వాటిని రాజ్‌కు ఇవ్వాలని వెళ్తుంది కావ్య. రాజ్ రెడీ అవుతుంటాడు. డోర్ దగ్గర ఉండి రాజ్‌ను చూసిన కావ్య చాలా ఎమోషనల్ అవుతుంది. విడాకులు పక్కన పెట్టి వెళ్లి రాజ్‌ను వెనుక నుంచి గట్టిగా హగ్ చేసుకుంటుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు. మీరు నాకు కావాలి. నేను ఎప్పటికీ మీ భార్యగానే ఉండాలి. నన్ను దూరం చేసుకోవద్దు. నేను భరించలేను. మీకు దూరమై నేను తట్టుకోలేను. ప్రశాంతంగా బతకలేను. మీరు నాకు కావాలి అని మరింత గట్టిగా హత్తుకుంటుంది కావ్య.
కానీ, అదంతా కావ్య ఊహించుకుంటుంది. గది బయటే ఉండిపోతుంది. ఇంతలో వెనక్కి చూసిన రాజ్.. పిలిచావా. గది బయటే ఉండిపోయావేంటి అని అంటాడు. ఈ కాగితాలు చూడండి. నాకు విడాకులు కావాలని కావ్య అడుగుతుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు. ఏంటీ అని అంటాడు. అవును, విడాకుల పత్రంపైన నేను సంతకం చేశాను. మీరు సంతకం చేయడమే మిగిలి ఉంది. మీరు కోరుకున్నదే కదా. నేనేం వెళ్లిపోతానని అనలేదు. నాకు విడాకులు ఇచ్చి శ్వేతను పెళ్లి చేసుకుంటానని మీరే చెప్పారు. ఆ నిజాన్ని మీరు చెప్పాక నేను ఇంకా మీతో కలిసి ఉండటంలో అర్థమే లేదు. మీకు నేనంటే ఇష్టమే లేనప్పుడు. భార్యగా అక్కర్లేనప్పుడు. ఎంతకాలమని కలిసి ఉండగలను. నా వంతు ప్రయత్నాలు చాలా చేశాను. మీరు మారతారన్న నమ్మకంతో బతికాను. కానీ, ఆ నమ్మకం పోయింది అని కావ్య అంటుంది.
షాక్‌లో రాజ్
ఇంకా మీ ఎదురుగా ఉండి.. మీరు కోరుకున్నది జరగకుండా చేయలేను. మీ జీవితం మీ ఇష్టం. అభిప్రాయ బేధాలు ఉండొచ్చు. భార్యంటే ఒక అభిప్రాయమే లేకుండా ఉండకూడదు. నేను మీకు అక్కర్లేదు. అది నాకు ఆలస్యంగా అర్థమైంది. అందుకే విడాకుల పత్రాలపైన సంతకం చేసి తెచ్చాను. మీరు కూడా సంతకం చేసి కోర్టుకు వెళ్తే.. సులువుగా మనకి విడాకులు మంజూరు అవుతాయి. కాకపోతే మీ ఇంట్లోవాళ్లకు మీరు చెబుతారా. నన్ను చెప్పమంటారా. ఇక్కడిదాకా వచ్చాకా దాచిపెట్టి లాభం లేదు అని కావ్య అంటుంది. అదంతా మౌనంగా వింటూ ఉండిపోతాడు రాజ్.
బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో కావ్య నీ జీవితంలోనుంచి వెళ్తుందన్న ఊహ తట్టుకోలేక నీ మెదడు స్తబ్దంగా మారింది. నీ మనసు మౌనంగా ఉండిపోయింది. తను వెళ్లిపోతే నువ్ బతకలేవు రాజ్. ఈ శూన్యం తట్టుకోలేవ్. పిచ్చోడివి అయిపోతావ్. ఏ తప్పు చేయని భార్య నీపై ప్రేమను చంపుకుని వదిలి వెళ్లిపోతే నువ్ తట్టుకోలేవ్. వెళ్లు.. వెళ్లి నీ మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టు. కావ్య అడుగు బయట పెట్టకుండా నీ ప్రేమను అడ్డుపెట్టు అని రాజ్‌తో శ్వేత చెబుతుంది. మరోవైపు కావ్య ఏడుస్తూ ఉంటుంది.
టాపిక్