తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi December 21st Episode: తాతయ్య మాట నిలబెట్టిన కావ్య- స్వప్నదే ఇంటి పెత్తనం- కఠినంగా రూల్స్- కళావతి ఆర్డర్!

Brahmamudi December 21st Episode: తాతయ్య మాట నిలబెట్టిన కావ్య- స్వప్నదే ఇంటి పెత్తనం- కఠినంగా రూల్స్- కళావతి ఆర్డర్!

Sanjiv Kumar HT Telugu

21 December 2024, 10:43 IST

google News
    • Brahmamudi Serial December 21st Episode: బ్రహ్మముడి డిసెంబర్ 21 ఎపిసోడ్‌లో సీతారామయ్య వంద కోట్ల షూరిటీ గురించి కావ్యకు చెప్పు ఎమోషనల్ అవుతాడు. మరుసటి రోజు ఉదయం బ్యాంక్ వాళ్లతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తుంది కావ్య. రాజ్ కావ్య కలిసిపోయారని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అని కనకంకు చెబుతుంది అపర్ణ.
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 21వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 21వ తేది ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 21వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో నీకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాని రాజ్ అంటే ప్రపోజ్ చేస్తాడేమో అని కావ్య సిగ్గుపడిపోతుంది. దాంతో కావ్య చేతులు పట్టుకుని కళ్లలోకి దీనంగా చూస్తాడు రాజ్. కానీ, కావ్య మాత్రం సంతోషపడుతుంది.

ఇండస్ట్రీ మనుగడకు పెద్ద సమస్య

ఈ విషయం మనిద్దరి మధ్యలోనే ఉండాలి. ఎవరికి చెప్పకూడదు అని రాజ్ అంటే.. అలాగే అంటుంది కావ్య. నేను ఒక పెద్ద సమస్యలో ఉన్నాను. నువ్వే నాకు సహాయం చేయాలి అని రాజ్ అడిగేసరికి కావ్య షాక్ అయి ఏమైందని అడుగుతుంది. ఇప్పటివరకు జరగనిది, ఎవ్వరూ ఊహించనిది జరిగింది. అది దుగ్గిరాల వారి వంశ ప్రతిష్టకి, స్వరాజ్ గ్రూప్ ఇండస్ట్రీ మనుగడకు ఒక పెద్ద సమస్యగా మారబోతుంది అని సీతారామయ్య వంద కోట్ల షూరిటీ, ఆస్తి జప్తు గురించి రాజ్ చెబుతాడు.

దాంతో కావ్య షాక్ అవుతుంది. తాతయ్య మాట నిలబెట్టాలి. వంశ పరువు ప్రతిష్ట దృష్టిలో పెట్టుకోవాలి. ఆస్తులన్నీ అలాగే ఉండాలి. మన కుటుంబం రోడ్డుపైన పడకూడదు. జప్తు వరకు రాకూడదు. రేపు బ్యాంక్ వాళ్లు వస్తారు. వారి ఇచ్చిన గడువు పూర్తయిపోయింది అని రాజ్ అంటాడు. మీలో ఇంత సంఘర్షణ జరుగుతోందా. ఇన్ని సమస్యలను గుండెల్లో దాచుకుని ఎవరికి చెప్పుకుండా మీలో మీరే నలిగిపోతున్నారా. ఎలా భరించారండి ఇన్ని రోజులు. ముందే నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని కావ్య అంటుంది.

ఎవరికీ తెలియకూడదు అనుకున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీకు తోచిన సహాయం ఏదైనా చెప్పవా అని రాజ్ అంటే.. అంతా శూన్యంగా ఉంది. ఇప్పటికిప్పుడే వంద కోట్లు అంటే.. ఎక్కడి నుంచి అని కావ్య అంటుంది. తెలుసు, ధాన్యలక్ష్మీ, రుద్రాణి అత్త ఆస్తికోసం గొడవలు చేస్తున్నారు. ఈ విషయం తెలిస్తే మరింత గొడవ చేస్తారు అని రాజ్ అంటాడు. మీరేం కంగారుపడకండి. ఏమైన పర్లేదు. ఈ సమస్యను నాతో చెప్పి మీ గుండె బరువును కాస్తైన దింపుకున్నారుగా. రేపటి వరకు ఏదోటి ఆలోచిద్దాం. రేపు మీతో నేను కూడా ఆఫీస్‌కు వస్తాను అని కావ్య అంటుంది.

ఒక సొల్యూషన్ ఆలోచిద్దాం

ఇద్దరం కలిసి ఏదోటి చేద్దాం. మీరు అంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి అని కావ్య అంటుంది. దాంతో కావ్యను హగ్ చేసుకుని థ్యాంక్యూ కళావతి అని ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంటాడు రాజ్. మీకే థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పటికైనా చెప్పారు. ఏదొ ఒక సొల్యూషన్ ఆలోచిద్దాం అని కావ్య అంటుంది. ఇద్దరూ అలాగే ఉండిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఆఫీస్‌కు రెడీ అవుతారు ఇద్దరు. ఇంటి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకెళ్దాం అని కావ్య అంటుంది.

కొంపదీసి వాళ్లకు ఎదురుతిరిగి ఆస్తి అంతా నా పేరు మీద ఉంది. తాతయ్యకు ఏ సంబంధం లేదని అనవు కదా అని రాజ్ అంటాడు. ఛీ ఛీ ఇంతేనా అండి మీరు నన్ను అర్థం చేసుకుంది. ఆస్తి ముక్కలు కాకూడదని నా పేరుమీద పెట్టారు. అది మర్చిపోను. ఎన్ని సమస్యలు వచ్చిన ఈ ప్రాపర్టీని అమ్మేది లేదు. వీటితో మనకు పనుంది. అంతే కానీ తాతయ్య ఇచ్చిన మాట పోయేలా నేనేందుకు ఎదురుతిరుగుతాను అని కావ్య అంటుంది. ఇద్దరు ఆఫీస్‌కు కలిసి వెళ్తుంటే అపర్ణ, సుభాష్ చూసి సంతోషిస్తారు.

ఇది కల, నిజమా అని సుభాష్ అంటాడు. కన్న కలలు నిజమై కళ్లముందు కలిసి వస్తుందండి అని అపర్ణ అంటుంది. కలిసి వచ్చినంతమాత్రానా కలిసిపోయినట్లు కాదు కదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇద్దరం ఆఫీస్‌కు వెళ్తున్నాం అని రాజ్, కావ్య చెబుతారు. దాంతో ధాన్యలక్ష్మీ షాకింగ్‌గా అడుగుతుంది. కావ్యను కూడా తీసుకెళ్లంత పనేంటో అని ధాన్యలక్ష్మీ అంటే తను రాకపోతే ఎలా. తనేకదా అంతా చేసేది అని రాజ్ అంటాడు. అంతా షాక్ అయి ఏంటది అంటారు.

కనకంకు చెప్పాలి

డిజైన్స్ కోసం అని కావ్య కవర్ చేస్తుంది. కొన్ని రోజులు కావ్యను ఆఫీస్‌కు తీసుకెళ్తాను అని రాజ్ అంటే.. అదంతా మేము చూసుకుంటాం అని అపర్ణ అంటుంది. రాజ్‌లో చాలా మార్పు వచ్చిందని, ఇగో పక్కన పెట్టాడని, కావ్యను భార్యగా ఒప్పుకున్నాడని సుభాష్, అపర్ణ మాట్లాడుకుంటారు. వాళ్లిద్దరిని కలిపేందుకు నేను పడిన కష్టం ఫలించింది. వెంటనే ఈ విషయం కనకంకు చెప్పాలి అని అపర్ణ వెళ్లిపోతుంది. దారిలో ఎదురైన స్వప్నకు ఇంటి తాళాలు ఇచ్చి ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే ఇవ్వమని కావ్య చెబుతుంది.

నన్ను నమ్మి ఇంటి తాళాలు ఇచ్చినప్పుడు నీ పరువు కాపాడటం కూడా నా బాధ్యతే కదా అని స్వప్న అంటుంది. అవుట్ హౌజ్ రెన్నోవేషన్‌కు చెక్ ఇచ్చి ఇంకో చెక్ తీసుకో, అమ్మమ్మ తిన్నాక ట్యాబ్లెట్స్ ఇవ్వు అని అన్ని జాగ్రత్తలు కావ్య చెప్పడం రాజ్ చూస్తాడు. తర్వాత కావ్య, రాజ్ కారులో వెళ్లడం రుద్రాణి చూస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారని స్వప్నను అడిగితే.. ఆఫీస్‌కు అని చెబుతుంది. వాళ్లిద్దరం వెళ్లడం ఏంటీ. నేను ఒప్పుకోను. రాజ్‌ ఎలా ఒప్పుకున్నాడు అని రుద్రాణి అంటుంది.

అందరూ నీలా మొగుడుని వదిలేసి ఉండరు కదా అని స్వప్న అంటుంటే చేతిలో కీస్‌ చూస్తుంది రుద్రాణి. ఈరోజు నుంచి పెత్తనం అంతా నాదే. అంటే కావ్యే నాకు అప్పజెప్పింది అని స్వప్న చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు కనకంకు అపర్ణ ఫోన్ చేస్తుంది. కావ్య గురించి కనకం బాధపడుతుంది. వీటన్నింటిలో నీకో శుభవార్త చెప్పనా. నీ కూతురు నా కొడుకు కలిసిపోయారా అని అపర్ణ అంటే.. నాకు నమ్మకం లేదని కనకం అంటుంది.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా

లేకుంటే ఆఫీస్‌కు వెళ్లి చూడు. ఇద్దరు కలిసి ఆఫీస్‌కు వెళ్లారు. నా కొడుకు ఇష్టపూర్వకంగానే కావ్యను ఆఫీస్‌కు తీసుకెళ్లాడు. త్వరలో ఇద్దరు పూర్తిగా కలిసిపోతారు కూడా అని అపర్ణ చెబుతుంది. నా జీవితంలో ఇంత మంచి శుభవార్త ఎప్పుడు వినలేదు అని కనకం అంటే.. నేనే అక్కడ ఉండుంటే కత్తెరతోనో, కత్తితోనో పొడిచి చెప్పేదాన్ని. అప్పుడు బాగా నమ్మేదాన్ని. ఇప్పుడు నీ కూతురు సంతోషంగా ఉంది కదా. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అని అపర్ణ కాల్ కట్ చేస్తుంది.

కావ్యను అల్లుడు గారు భార్యగా ఒప్పుకున్నారట. ఆఫీస్‌కు తీసుకెళ్లారట అని కృష్ణమూర్తికి కనకం చెబుతుంది. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఒక్కటయ్యారా. లేదా అవసరం కోసం ఒక్కటయ్యారా అని డౌట్ పెడతాడు కృష్ణమూర్తి. మరోవైపు ఏ నిర్ణయం తీసుకున్నారు అని రాజ్‌ను బ్యాంక్ వాళ్లు అడుగుతారు. నేను మాట్లాడొచ్చా. నేను అని కావ్య చెప్పబోతుంటే.. తను నా భార్య అని రాజ్ చెబుతాడు. దాంతో కావ్య సంతోషిస్తుంది.

మేము డబ్బులు కట్టాలనే డిసైడ్ అయ్యాం అని కావ్య అంటే.. గ్రేట్. ఎప్పుడు క్లియర్ చేస్తారు అని వాళ్లు అడుగుతారు. మేము వంద కోట్లు ఒకేసారి కాదు. ఇన్‌స్టాల్‌మెంట్‌లో క్లియర్ చేస్తాం అని కావ్య అంటుంది. అది కుదరదు అని బ్యాంక్ వాళ్లు అంటారు. అంత డబ్బు మేము ఇప్పుడు కట్టాల్సి వస్తుందని ముందే రెడీగా పెట్టుకోం కదా. అందుకే ఇన్‌స్టాల్‌మెంట్‌లో క్లియర్ చేద్దామనుకుంటున్నాం. మీ దగ్గర లోన్ తీసుకున్న కస్టమర్లకు ఈజీ పద్ధతిలో చెల్లించడానికి ఇన్‌స్టాల్‌మెంట్స్ ఉంటాయి కదా. మేము కూడా అదే అడుగుతున్నాం. అలా అని మా పీకల మీద కూర్చోడానికి మేము ఆ డబ్బు తినలేదు అని కావ్య అంటుంది.

కావ్య స్ట్రిక్ట్ర్ రూల్స్

ఆ ఎన్‌డీ చిట్ ఫండ్ కంపెనీలాగా బోర్డ్ తిప్పేయలేదు. మీకు అర్థమవుతుంది కదా. బాధ్యత గల కస్టమర్స్‌లా ఆ డబ్బు చెల్లించడానికి ముందుకు వచ్చాం. మీకు డబ్బులు కావాలా. ఆస్తులు జప్తు కావాలా అని కావ్య అడుగుతుంది. ఏ బ్యాంక్‌కు అయినా డబ్బులు రికవరీ చేసుకోవడంలోనే రెప్యుటేషన్ ఉంటుంది. మీరు ఇన్‌స్టాల్‌మెంట్‌లోనే పే చేయండి అని బ్యాంక్ వాళ్లు చెబుతారు. దాంతో రాజ్, కావ్య సంతోషిస్తారు. వంద కోట్ల సమస్య తీరినట్లు అవుతుంది.

మరోవైపు ఇంట్లో రుద్రాణి, రాహుల్‌కి స్వప్న డబ్బు ఇస్తుంటే కావ్య అడ్డుకుంటుంది. ఎవరైనా డబ్బు అవసరమై తీసుకుంటే ప్రతి రూపాయికి లెక్క చూపించాల్సిందే. ఆఖరుకి కారులో పెట్రోల్ పోయించినా నాకు బిల్ తెచ్చివ్వాలి. ఈ రూల్స్‌ని స్ట్రిక్ట్‌గా పాటించాలి. ఇట్స్ మై ఆర్డర్ అని కావ్య చెబుతుంది. దాంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీ అవాక్కవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.

తదుపరి వ్యాసం