Brahmamudi December 18th Episode: బ్యాంక్ వాళ్ల గొడవ- ముసలోడు నిలువెల్లా ముంచాడన్న రుద్రాణి- నడిరోడ్డు మీదకు కుటుంబం!
18 December 2024, 7:30 IST
- Brahmamudi Serial December 18th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 18 ఎపిసోడ్‌లో రాహుల్ వేసిన చెత్త ప్లాన్‌ను రుద్రాణికి చెప్పి తిట్టేలా చేస్తుంది స్వప్న. తర్వాత దుగ్గిరాల ఇంట్లోకి బ్యాంక్ వాళ్లు వచ్చి ఆస్తి మొత్తం జప్తు చేస్తామని గొడవ చేస్తారు. దాంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీ సీతారామయ్యను అవమానిస్తారు.
బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 18వ తేది ఎపిసోడ్
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అపర్ణకు ఇంటి బాధ్యతల గురించి, ఇనుపపెట్టే ఖాళీ అవుతుందని తన బాధ చెప్పుకుంటుంది కావ్య. ఆ తాళాలు, ఆ బాధ్యత తనకు వద్దొని కావ్య చెబుతుంది. దాంతో అపర్ణ నవ్వుతుంది. ఈ మాత్రం దానికే బెదరిపోతే ఎలా. నేను అలసిపోయి నీకు ఇవ్వలేదు. నీకు అలవాటు అవుతుందని ఇచ్చాను అని అపర్ణ అంటుంది.
నాకే అవమానం
వాళ్లు అడిగింది అవసరమో, కాదో తెలుసుకుని, అడిగినంత కాకుండా తగ్గించి ఇవ్వాలి అని చెబుతుంది అపర్ణ. మిమ్మల్ని అడిగినట్లు నన్ను అడగట్లేదు. పైనుంచి దబాయిస్తున్నారు. నా వల్ల ఇంట్లో గొడవలు రావడం ఇష్టం లేక ఊరుకుంటున్నాను అని కావ్య అంటుంది. నువ్ ఎప్పుడైతో కచ్చితంగా చెబుతావో అప్పుడే వాళ్ల ఖర్చులు రాను రాను తగ్గుతాయి. నువ్ ఓడిపోయి వెనుకంజ వేస్తే నాకే అవమానం. ధైర్యంగా నిలబడు అని తాళాలు ఇచ్చిన అపర్ణ నీ వెనుక నేనున్నాను. వెళ్లు అని ధైర్యం చెబుతుంది.
ఎక్కడికీ మళ్లీ ఆ పద్మవ్యూహంలోకా అని కావ్య భయంగా అంటుంది. వెళ్లు అని దబాయిస్తుంది అపర్ణ. మరోవైపు ఈ ఇంట్లో డబ్బులు సంపాదించడం ఇంత ఈజీ అని నాకు తెలియదు. తాతయ్య పేరు చెబితే ఎవరికైనా డబ్బు ఇస్తారన్నమాట. ఇంకా లేట్ ఎందుకు నా ఫ్రెండ్స్‌ను ఒక్కొక్కరిని రంగంలోకి దించుతాను. కోట్ల కోట్లకు కొల్లగొడతాను అని రాహుల్ అనుకుంటాడు. తన ఫ్రెండ్‌కు కాల్ చేసి మా ఇంటికి వచ్చి నీ ఫారెన్ చదువుకు మా తాతయ్య 50 లక్షలు ఇస్తాడని చెప్పు. వాళ్లు ఇస్తారు. నీ దగ్గర నేను తర్వాత తీసుకుంటాను అని రాహుల్ అంటాడు.
ఇంతలో స్వప్న వచ్చి చప్పట్లు కొడుతుంది. నీకు అస్సలు బుర్ర లేదని అర్థమైందని స్వప్న అంటుంది. నా ప్లాన్ నీకు అర్థం కాలేదని రాహుల్ అంటాడు. అదో ప్లాన్. నేను అర్థం చేసుకోవాల. ఇలా చీప్‌గా ఆలోచించడం నీకు సిగ్గుగా లేదా. అసలు ఇంజినీరింగ్ ఎలా చేశావ్. మీ అమ్మ డబ్బులిచ్చి తెచ్చిందా అని స్వప్న అంటుంటే.. రుద్రాణి వస్తుంది. వాడు ఇప్పుడు జీనియస్. అప్డేట్ వెర్షన్ అని రుద్రాణి అంటుంది.
బుర్రలేనిది నీకు
దాంతో రాహుల్ ప్లాన్ చేసింది చెబుతాడు. అలా అయితే ప్రతిసారి ఖర్చులకు వీళ్లను అడగాల్సిన అవసరం లేదు కదా అని నవ్వుతూ చెబుతాడు రాహుల్. దాంతో రుద్రాణి కోప్పడుతుంది. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు తిట్టుకుంటారో ఏం చేసుకుంటారో అని వెళ్లిపోతుంది స్వప్న. నా ప్లాన్ ఆ బుర్రతక్కువదానికి అర్థం కాలేనట్టుంది అని రాహుల్ అంటే.. బుర్రలేనిది దానికి కాదురా.. నీకు. అలా ఇంట్లోకి వస్తే ఎక్కడి నుంచి వచ్చారో, నిజంగా తాతయ్య మాట ఇచ్చారో ఎంక్వైరీ చేయకుండానే ఇస్తారా అని రుద్రాణి తిడుతుంది.
ఉదయమే కదరా మంచి ఐడియా ఇచ్చావని మెచ్చుకున్నాను. ఇంతలోనే బ్రెయిన్ తీసుకెళ్లి బురదలో పెట్టావా. నువ్ ఇలా చేసుంటే రేపు ఇంట్లో మనం ముద్దాయిల్లా నిల్చునేవాళ్లం. నీకు ఏదైనా ఐడియా వస్తే ముందు నాకు చెప్పు అని రుద్రాణి అంటుంది. మరుసటి రోజు కావ్యను పిలిచి నాకు కాఫీ ఇద్దామని లేదా అని రాజ్ అరిస్తే రాత్రి ఇస్తే అరిచారు కదా అని కావ్య అంటుంది. దాంతో నేను ప్రతిదానికి అరిచేవాడిలా కనిపిస్తున్నానా అని రాజ్ మళ్లీ అరుస్తాడు.
దాంతో మీరు ఏం చేసిన ఏం అనలేదు అని జరిగినవన్నీ చెబుతుంది. కాఫీ తీసుకురమ్మని కావ్యను పంపిస్తాడు రాజ్. ఇంతలో రాజ్‌కు ఎస్సై కాల్ చేసి ఇంటి బయట ఉన్నాను. లోపలికి రానా అని అడుగుతాడు. వద్దు, ఇంట్లో తెలిస్తే కంగారుపడుతారు. నేను వస్తున్నా బయటకు వెళ్తాడు రాజ్. వాడు పకడ్బందీగా ప్లాన్ చేసుకుని వెళ్లాడు. బ్యాంకాక్ వెళ్లాడు. వాడు ఫేక్ అడ్రస్ ఇచ్చాడు. అక్కడి నుంచి వేరే కంట్రీ వెళ్లి ఉండొచ్చు అని ఎస్సై అంటాడు.
అంత సీక్రెట్‌గా ఏంటీ
అలా అనకురా. వాన్ని ఎలాగైనా పట్టుకోవాలని రాజ్ చెబుతుంటే ఇంతలో కావ్య వచ్చి కాఫీ అంటుంది. దాంతో నీకు అసలు బుద్ధి ఉందా. ఇద్దరు మాట్లాడుతుంటే ప్రైవసీ ఉండక్కర్లేదా అని తిడతాడు రాజ్. సారీ అని చెప్పి కావ్య వెళ్లబోతుంటే అపర్ణ చూసి రాజ్ అని కోపంగా అరుస్తుంది. దాంతో నేను ఆఫీస్‌కు వచ్చి కలుస్తాను అని ఎస్సై వెళ్లిపోతాడు. ఇద్దరు మాట్లాడుకుంటే కాఫీ ఇవ్వడం తప్పా. ఏంటీ అంత సీక్రెట్‌గా మాట్లాడుకునేది. పరాయి వాడి ముందు నీ భార్యను అవమానిస్తావా. అరుస్తావా అని అపర్ణ కోప్పడుతుంది.
ఎక్కడి నుంచి నేర్చుకున్నావురా ఈ కుసంస్కారం. అంటుందల్లా పడుతుందని అంటావా. మీకు ఎన్ని గొడవలు ఉన్న బయటవాళ్ల ముందు నీ భార్యను అంటావా. అయినా నీకు కావ్య సారీ చెప్పింది. తన వ్యక్తిత్వం ఎక్కడ నీ వ్యక్తిత్వం ఎక్కడ అని అపర్ణ అరుస్తుంది. దాంతో సారీ అమ్మ అని రాజ్ అంటే కావ్యకు చెప్పు అని అపర్ణ అంటుంది. సారీ కళావతి. మామ్ చెబితేగానీ నేను చేసింది నాకు అర్థం కావట్లేదు అని రాజ్ వెళ్లిపోతాడు.
ఏంటీ వీడు. ఇలా ప్రవర్తిస్తున్నాడు. అప్పుడే బాగుంటాడు. అప్పుడే అరుస్తున్నాడు అని అపర్ణకు అనుమానం వస్తుంది. తర్వాత కావ్య ఇంట్లో ఏదో జరుగుతుంది. ఆయన ఎందుకో కంగారుపడుతున్నారు. ఈ కాఫీ కలిసిరావట్లేదు. ఇది లేకుండా అడుగుదామని కావ్య రాజ్ దగ్గరికి వెళ్తుంది. మీరెందుకు కంగారుపడుతున్నారు. మీరు ఏదో దాస్తున్నారు. ఏంటది. అసలు మీ సమస్య ఏంటండి అని కావ్య అంటుంది. తెలిస్తే ఏం చేస్తావ్. ఆరుస్తావా తీరుస్తావా అని రాజ్ అంటాడు.
పదిమంది సైనికులు కూడా లేరు
నాకు చెబితే ఏదైనా పరిష్కారం చెబుతాను కదా అని కావ్య అంటుంది. అవునా, అంత ఈజీగా పరిష్కారం చెబుతావా. ఒక శత్రుసైనం మన రాజ్యం మీద దండెత్తపోతుంది. వాళ్ల దగ్గర వంద మంది సైనికులు ఉంటే మన దగ్గర లేరు. నీ దగ్గర వంద మంది సైనికులు ఉంటే అప్పు ఇస్తావా అని రాజ్ అంటాడు. మీ వెటకారం అర్థమైంది. మీ సీక్రెట్‌లు మాకెందుకు చెబుతారు. నాకు పదిమంది సైనికులు కూడా లేరు. నేను ఒంటరిగానే పోరాడుతాను. వన్ వుమెన్ ఆర్మీ. నేను వంట చేసుకోవాలని వెళ్లిపోతుంది కావ్య.
తర్వాత బ్యాంక్ వాళ్లు ఇంటికి వస్తారు. దుగ్గిరాల సీతారామయ్య గారు వంద కోట్లకు షూరిటీ పెట్టారు అని బ్యాంక్ వాళ్లు చెబుతుంటే రాజ్ అడ్డుకుంటాడు. బ్యాంక్‌కు వస్తాను అంటాడు. ఏంటీ వచ్చేది. వంద కోట్లు కట్టమంటే ఇప్పటివరకు రెస్పాన్స్ కాలేదు. ఇప్పుడు మీ ఆస్తిమొత్తం జప్తు చేస్తాము అని బ్యాంక్ వాళ్లు అంటే ఇంట్లోవాళ్లు షాక్ అవుతారు. ఏంటీ ఆస్తులన్నీ జప్తు చేస్తారా అని ఇందిరాదేవి అడుగుతుంది. దాంతో జరిగింది చెబుతారు బ్యాంక్ వాళ్లు.
కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా జప్తు చేస్తామంటే ఎలా అని సుభాష్ అంటాడు. ఎందుకివ్వలేదు సార్. మీ ఆఫీస్ ఎంట్రన్స్‌లో ఇచ్చాం. మీ రాజ్‌గారికి చెబితే టైమ్ అడిగారు. ఆ టైమ్ కూడా అయిపోయింది. ఇక మీరు చేసేది ఏం లేదు. రూల్స్ ప్రకారం ఆస్తులను జప్తు చేయాల్సిందే. ఇమిడియట్‌గా ఇల్లు ఖాళీ చేయండి అని బ్యాంక్ వాళ్లు అంటారు. అమ్మో అమ్మో అంతా అయిపోయింది. ముసలోడు నిలువునా ముంచేశాడు. నడిరోడ్డుమీద నిలబెట్టేశాడు అని రుద్రాణి అంటుంది.
నడిరోడ్డుమీద నిలబడతాం
దాంతో ఇందిరాదేవి నోరు జారకు. మీ నాన్న గారికి గౌరవం ఇవ్వకుండా అనకు అని అరుస్తుంది. ఇంకా ముసలోడికి గౌరవం ఇచ్చేదేంటీ తల్లి. చూశావా ధాన్యలక్ష్మీ. నేను ముందు నుంచే చెబుతున్నాను. ఆస్తులు రాయించుకో అని. ఎవరు వినలేదు అని రుద్రాణి అంటుంది. వీళ్లు నా మాట విన్నారా. ఆస్తులు ఎవరికి దక్కకుండా చేశారు. ఇప్పుడు అంతా కలిసి నడిరోడ్డుమీద నిలబడతాం. మీకు ఏదైనా చాతనవుతుందా. నీ కొడుకు జీవితాంతం ఆటో నడుపుకోవాలి. మీరు నేను వాడిమీదే పడి తినాలి అని ధాన్యలక్ష్మీ అంటుంది.
ఇన్నాళ్లు కోడలిని రానివ్వలేదు. ఇప్పుడు అది రానిస్తుందా. మనిద్దరం కలిసి గంగలో దూకాలి అని ధాన్యలక్ష్మీ అంటుంది. కుటుంబం అంటే మీరిద్దరేనా. అందరం కదా. అందరం కలిసి పంచుకుందాం అని అపర్ణ అంటుంది. ఇక్కడ ఏం మిగిలింది. బొచ్చు కూడా మిగల్లేదు. పెద్దాయన దాన కర్ణుడు కదా. మనందరి నోట్లో మట్టి కొట్టాడు అని ధాన్యలక్ష్మీ అంటుంది. కట్ చేస్తే కావ్య బూజు దులుపుతుంటే రాజ్ వచ్చి సడెన్‌గా అరిస్తాడు. దాంతో కావ్య వెనక్కి పడుతుంటే రాజ్ పట్టుకుంటాడు.
కావ్య, రాజ్ రొమాన్స్
నీకు ఏ విధం సహాయపడగలను అని రాజ్ అంటే.. సీలింగ్ మొత్తం క్లీన్ చేయాలను అనుకుంటున్నాను. మీరు చేసి పెడతారా అని కావ్య అంటే.. రాజ్ అలాగే క్లీన్ చేస్తాడు. బెడ్ ఎక్కి క్లీన్ చేస్తుండగా ఒకటి చెప్పాలని అనబోయి రాజ్ కావ్యపైడ పడిపోతాడు. ఇద్దరు రొమాంటిక్‌గా చూసుకుంటుంటే.. వాళ్లను ధాన్యలక్ష్మీ, రుద్రాణి చూస్తారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.
టాపిక్