తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi Serial: కావ్య‌ను బ్లాక్‌మెయిల్ చేసిన రుద్రాణి - డ‌బ్బు కోసం ధాన్య‌ల‌క్ష్మి ర‌చ్చ - రాజ్‌పై అనామిక రివేంజ్‌

Brahmamudi Serial: కావ్య‌ను బ్లాక్‌మెయిల్ చేసిన రుద్రాణి - డ‌బ్బు కోసం ధాన్య‌ల‌క్ష్మి ర‌చ్చ - రాజ్‌పై అనామిక రివేంజ్‌

15 December 2024, 8:26 IST

google News
  • Brahmamudi Serial: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ లేటెస్ట్ ప్రోమోలో డ‌బ్బుల కోసం కావ్య‌ను రుద్రాణి, ధాన్య‌ల‌క్ష్మి బ్లాక్‌మెయిల్ చేస్తారు. ఎందుకోసం డ‌బ్బులు కావాల‌ని కావ్య అడిగినందుకు ఆమెను నానా మాట‌లు అంటారు. తాత‌య్య అధికారాన్ని ఇచ్చారు క‌దా అని మాపై డామినేష‌న్ చేస్తే ఊరుకునేది లేద‌ని వార్నింగ్ ఇస్తారు.

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్  ప్రోమో
బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ప్రోమో

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ప్రోమో

Brahmamudi Serial: సీతారామ‌య్య త‌న స్నేహితుడి చిట్ ఫండ్ కంపెనీ కోసం వంద కోట్ల‌కు ష్యూరిటీ సంత‌కం పెడ‌తాడు. ఆ చిట్ ఫండ్ కంపెనీ బోర్డ్ తిప్పేయ‌డంతో డ‌బ్బుల కోసం రాజ్‌ను వెతుక్కుంటూ అత‌డి ఆఫీస్‌కు బ్యాంకు వాళ్లు వ‌స్తారు. సీతారామ‌య్య హాస్పిట్‌లో ఉన్నాడు కాబ‌ట్టి... ఆయ‌న త‌ర‌ఫున వంద కోట్ల‌ను మీరే చెల్లించాల‌ని రాజ్‌తో అంటారు. వంద కోట్లు వెంట‌నే క‌ట్ట‌క‌పోతే ఆస్తిని జ‌ప్తు చేస్తామ‌ని వార్నింగ్ ఇస్తారు.

టైమ్ కావాలి....

డ‌బ్బులు చెల్లించ‌డానికి టైమ్ కావాల‌ని బ్యాంకు వాళ్ల‌ను రాజ్ బ‌తిమిలాడుతాడు. దాంతో ప‌ది రోజులు టైమ్ ఇస్తారు బ్యాంక్ ఆఫీస‌ర్స్‌... వంద కోట్లు తానే చెల్లిస్తాన‌ని బ్యాంకు వాళ్ల చెప్పిన పేప‌ర్స్‌పై రాజ్ సంత‌కం చేస్తాడు. తాత‌య్య ఇచ్చిన మాట పోకూడ‌ద‌ని, ఆయ‌న గురించి ఎవ‌రూ త‌ప్పుగా మాట్లాడ‌కూడ‌ద‌ని రాజ్ అనుకుంటాడు.

రుద్రాణి బ్లాక్‌మెయిల్‌....

కావ్య‌కు సీతారామ‌య్య ఇంటి పెత్త‌నం అప్ప‌గించ‌డం రుద్రాణి, ధాన్య‌ల‌క్ష్మి స‌హించ‌లేక‌పోతారు. ఆమెను డ‌బ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేయ‌డం మొద‌లుపెడ‌తారు. ల‌క్ష‌ల్లో డ‌బ్బు అడుగుతారు. డ‌బ్బులు ఎందుకు కావాలో చెప్ప‌మ‌ని కావ్య అడిగినందుకు ఆమెను నానా మాట‌లు అంటారు. డ‌బ్బులు ఎందుకు అని మ‌మ్మ‌ల్ని అడిగి అవ‌మానించావ‌ని కావ్య‌పై రివ‌ర్స్ ఎటాక్ చేస్తారు.

తాత‌య్య అధికారాన్ని ఇచ్చారు క‌దా అని సింహాస‌నం ఎక్కి కూర్చొని నేను చెప్పిందే శాస‌నం అని ఉంటే ఊరుకునేది లేద‌ని ర‌చ్చ చేస్తుంది ధాన్య‌ల‌క్ష్మి. వారి మాట‌ల్ని భ‌రించ‌లేక అడిగినంత మొత్తం తీసుకొచ్చి ఇస్తుంది కావ్య‌. ఇక నుంచి తాను ఎంత డ‌బ్బు అడిగితే అంత నోరు మూసుకొని ఇవ్వాల‌ని కావ్య‌కు వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి.

నంద‌గోపాల్ ఇంటికి...

ష్యూరిటీ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే చిట్ ఫండ్ ఓన‌ర్ నంద‌గోపాల్‌ను ప‌ట్టుకోవ‌డ‌మే ఏకైక మార్గ‌మ‌ని రాజ్ అనుకుంటాడు. మ‌రోవైపు పోలీసులు కూడా నంద గోపాల్ గురించి వెతుకుతుంటాడు. నంద‌గోపాల్ ఇంటికి వెళ‌తాడు. నంద‌గోపాల్ ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఇందాకే అత‌డు ఫారిన్ వెళ్లిపోయాడ‌ని వాచ్‌మెన్ చెప్ప‌గానే రాజ్ డిస‌పాయింట్ అవుతాడు.

అనామిక మాస్ట‌ర్ ప్లాన్‌...

నంద‌గోపాల్ ఫారిన్ వెళ్లాన‌ని అంద‌రిని న‌మ్మించి ఇంట్లోనే మందు తాగుతూ జ‌ల్సాలు చేస్తుంటాడు. అత‌డి వెనుక ఉండి అనామిక ఈ క‌థ‌ను న‌డిపిస్తుంది. నంద‌గోపాల్‌ను ప‌ట్టుకునే విష‌యంలో కావ్య స‌హాయం తీసుకోవాల‌ని రాజ్ అనుకుంటాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌న్న‌ది సోమ‌వారం నాటి బ్ర‌హ్మ‌ముడి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

తదుపరి వ్యాసం