Brahmamudi Promo: కావ్య పోస్ట్‌కు ఎసరు పెట్టిన అనామిక - ఆఫీస్‌లోకి రాజ్ రీఎంట్రీ - కోడలికి అపర్ణ సపోర్ట్
Brahmamudi Promo: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో రాజ్‌కు ఎలాగైనా ఆఫీస్‌కు వెళ్లేలా చేయాలని ఇందిరాదేవి, అపర్ణతో పాటు దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటారు. కావ్యకు భయపడే నువ్వు ఆఫీస్‌కు వెళ్లడం లేదుకదా అని రాజ్‌ను రెచ్చగొడతారు. రాహుల్‌తో అతడిని పోల్చుతారు.
Brahmamudi Promo: కావ్య సీఈవో కావడం రాజ్ జీర్ణించుకోలేకపోతాడు. కావ్య ఆఫీస్‌లో ఉన్నంత కాలం ఆఫీస్‌లో అడుగుపెట్టనని తీర్మాణించుకుంటాడు. ఇంట్లోవాళ్లే తనను ఆఫీస్‌కు వెళ్లమని బతిమిలాడుతారని రాజ్ అనుకుంటాడు. కానీ సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. తండ్రి సుభాష్, బాబాయ్ ప్రకాశంతో పాటు మిగిలిన వాళ్లూ ఎవరూ ఆఫీస్ మాటే ఎత్తరు. ఆఫీస్‌కు వెళ్లమని రాజ్‌ను ఒక్క మాట కూడా అడగరు.
రాజ్‌కు ఆర్డర్...
ఎలాగూ ఖాళీగా ఉన్నావు కదా...కూరగాయలు తీసుకురమ్మని రాజ్‌కు ఆర్డర్ వేస్తుంది అపర్ణ. ఇంటి పనులు చెబితే భయపడి తాను ఆఫీస్‌కు వెళతానని తల్లి ప్లాన్ వేసిందని రాజ్ అనుకుంటాడు. కూరగాయలు తెస్తానని ఆవేశంగా బయలుదేరుతాడు. కారు కూడా లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్తాడు.
రాజ్ కూరగాయల బేరం...
కూరగాయలు బేరం ఆడటం రాజ్‌కు రాదు. మంచి బకరా దొరికాడని అతడిని మోసం చేయాలని కూరగాయలు అమ్మే అతడు అనుకుంటాడు. ఆరు వందల కూరగాయలకు ఆరువేల బిల్‌వేస్తాడు.
రాజ్ కూరగాయల బేరం ఆడటం చూసి కనకం షాకవుతుంది. రాజ్ డబ్బులు ఇవ్వబోతుండగా ఎంట్రీ ఇచ్చి మోసాన్ని బయటపెడుతుంది. కానీ కనకం మాటలు రాజ్ నమ్మడు. క్యాన్సర్ పేరుతో మీరు, మీ కూతురు కూడా తనకు చేసిన మోసం కంటే ఇదేం ఎక్కువ కాదని అంటాడు. పంతానికి పోయి కూరగాయలు అతడికి ఆరువేలు ఇస్తాడు.
అనామిక ప్లాన్...
కావ్యను ఓడించిచడానికి స్వరాజ్ గ్రూప్‌కు చెందిన పాత క్లయింట్స్ అందరిని తనవైపుకు తిప్పుకుంటుంది అనామిక. కావ్యకు ఫోన్ చేసి నిన్ను ఓడించడమే నా పని అంటూ బిల్డప్‌లు ఇస్తుంది. ఇకపై నువ్వు ఎప్పటికీ గెలవలేవని కావ్యతో అనామిక అంటుంది.
కావ్యను చూసి భయపడ్డ రాజ్...
కావ్యను చూసి నువ్వు భయపడుతున్నావు కదా అంటూ అపర్ణ, ఇందిరాదేవి రాజ్‌ను ఆటపట్టిస్తారు. భార్యకు భయపడే ఆఫీస్‌కు వెళ్లకుండా ఇంట్లో ఉంటున్నావు కదా అని అడుగుతారు. పెళ్లానికి భయపడ్డ దుగ్గిరాల వారసుడు అంటూ లోకం కోడై కూస్తుందని, అది నీకే అవమానం అని రాజ్‌తో ఇందిరాదేవి అంటుంది.
రాహుల్‌తో పోలిక...
నువ్వంటే ఏంటో నిరూపించుకోవడం చేతకాదా...రాహుల్‌లా ఎప్పటికీ ఇంట్లోనే ఉంటావా అని ప్రశ్నల వర్షం కురిపిస్తారు. వారి మాటలను రాజ్ భరించలేకపోతాడు. ఆఫీస్‌కు వెళతానని అందరితో చెబుతాడు.
ఆ కళావతి కంటే తాను ఎందులో తక్కువ కాదని, ఎక్కువేనని అందరికి రుజువుచేస్తానని ఛాలెంజ్ చేస్తాడు. రాజ్ ఆఫీస్‌కు వెళతాడా? అనామిక ప్లాన్‌ను రాజ్, కావ్య కలిసి ఎలా తిప్పికొడతారన్నది సోమవారం నాటి బ్రహ్మముడి సీరియల్‌లో చూడాల్సిందే.