Brahmamudi August 13th Episode:బ్రహ్మముడి - అప్పును ఇంట్లోకి రానివ్వనన్న ధాన్యలక్ష్మి - రాజ్‌కు ఎదురుతిరిగిన కావ్య
13 August 2024, 7:33 IST
Brahmamudi August 13th Episode: బ్రహ్మముడి ఆగస్ట్ 13 ఎపిసోడ్‌లో కళ్యాణ్, అప్పులను తిరిగి ఇంటికి తీసుకురమ్మని రాజ్‌ను బతిమిలాడుతాడు ప్రకాశం. కళ్యాణ్ ఒంటరిగానే తిరిగిరావాలని, అప్పును ఇంట్లో అడుగుపెట్టనిచ్చేది లేదని ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. అప్పును కోడలిగా ఒప్పుకోనని అంటుంది.
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 13 ఎపిసోడ్
Brahmamudi August 13th Episode: కళ్యాణ్‌తో పాటు అప్పు తమ స్నేహితుల రూమ్‌లో తలదాచుకుంటారు. తమ కోసం ఫ్రెండ్స్ ఇబ్బందులు పడటం చూసి అప్పు, కళ్యాణ్ చలించిపోతారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఫిక్సవుతారు. స్నేహితులు వారించడంతో తాము గెస్ట్‌హౌజ్‌కి షిఫ్ట్ కాబోతున్నట్లు అబద్దం ఆడుతారు. కళ్యాణ్ గొప్పింట్లో పెరిగిన బిడ్డ కావడంతో ఇక్కడ ఉండటానికి ఇబ్బంది పడుతున్నాడని తన ఫ్రెండ్స్‌తో అంటుంది అప్పు.
రుద్రాణి సెటైర్లు...
కాఫీ తాగడానికి అందరూ హాల్‌లోకి వస్తారు. కానీ ధాన్యలక్ష్మి కనిపించదు. అదే విషయం ఇందిరాదేవి అందరిని అడుగుతుంది. రాజ్, కావ్య తనను వెన్నుపోటు పొడిస్తే ఎలా వస్తుందని రుద్రాణి మళ్లీ గొడవలు పెట్టడానికి చూస్తుంది. తన చేతిలో కాఫీ వేడిగా ఉందని స్వప్న వార్నింగ్ ఇస్తుంది. కాఫీ మీద పోసిన పోస్తుందని రుద్రాణి సైలెంట్‌గా ఉండిపోతుంది.
మరచిపోయిన ప్రకాశం...
ధాన్యలక్ష్మి రూమ్‌లోకి వెళ్లి ఆమెకు కాఫీ ఇస్తుంది కావ్య. విషం ఇస్తున్నావా అంటూ ధాన్యలక్ష్మి కోపంగా కావ్యతో అంటుంది. కావ్య ఇచ్చిన కాఫీ తీసుకోవడానికి నిరాకరిస్తుంది ధాన్యలక్ష్మి. కానీ ప్రకాషం కాఫీ కప్ తీసుకొని హాల్‌లోకి వస్తాడు. కళ్యాణ్ ఇంట్లోనుంచి వెళ్లిపోయిన విషయం మర్చిపోయి కొడుకును పిలుస్తాడు.
కాఫీ తాగడానికి రమ్మని అంటాడు. ఉదయం నుంచి కళ్యాణ్ కనిపించడం లేదని, కొడుకును చూడాలని ఉందని చెబుతాడు. అతడి మాటలు విని అందరూ ఎమోషనల్ అవుతారు. కళ్యాణ్ లేడు...ఇంకా మనింటికి రాడు అని ధాన్యలక్ష్మి కన్నీళ్లతో భర్తకు సమాధానం చెబుతుంది. కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన గుర్తొచ్చి ప్రకాశం కూడా ఎమోషనల్ అవుతాడు. కాఫీ కూడా చేదుగా మారిపోయిందంటూ కప్ పక్కనపెట్టేస్తాడు.
నాకు నచ్చని అమ్మాయికి ఇచ్చి...
కళ్యాణ్ ఇంట్లో నుంచి కట్టుబట్టలతో వెళ్లిపోయాడని, వాడి గురించి ఇంట్లో ఎవరూ ఆలోచించడం లేదని కోపంగా అందరిపై నిందలు వేస్తుంది ధాన్యలక్ష్మి. కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయినందుకు మేమందరం బాధపడుతున్నామని ధాన్యలక్ష్మిమీద చేయి వేసి రాజ్ ఓదార్చబోతాడు.
అతడి చేతిని నెట్టివేస్తుంది ధాన్యలక్ష్మి. నిజంగా నీకు బాధ ఉంటే కళ్యాణ్ చేతికి తాళిబొట్టు ఇచ్చి కట్టమని చెప్పేవాడివి కాదు...నాకు నచ్చని అమ్మాయిని వాడికి ఇచ్చి పెళ్లి చేసేదానివి కాదని రాజ్‌పై ఫైర్ అవుతుంది. ఈ కథ మొత్తం వెనకుండి నడిపించిన కావ్యను వదిలేశావేంటి ధాన్యలక్ష్మి అని గొడవను మరింత పెంచుతుంది రుద్రాణి.
రుద్రాణిని దులిపేసిన స్వప్న...
నీకు ఎన్నిసార్లు గడ్డి పెట్టిన బుద్ధిరాదా అని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. పశువుల జాతికి చెందినది కదా...మనిషిలా ఎందుకు మాట్లాడుతుంది అని అత్తయ్యపై స్వప్న సెటైర్ వేస్తుంది.
ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్లు నిందలు వేస్తారనే అప్పు, కళ్యాణ్ పెళ్లి జరగకుండా తాను అడ్డుకున్నానని కావ్య అంటుంది. పెళ్లి చేసింది మీరు...మాటలు పడేది నేనా.. వాళ్లకు మీరు సమాధానం చెబుతారా...నన్ను సమాధానం చెప్పమంటారా...ఇక నుంచి ఊరికే మాటలు అంటే ఊరుకునేది లేదని కావ్య ఫైర్ అవుతుంది. ఇందులో కావ్య తప్పేం లేదని, ఏదైనా ఉంటే నన్ను అడగండి అని రాజ్ అంటాడు.
డబ్బు కోసమే...
ఈ ఆడవాళ్ల గొడవను పక్కనపెట్టి కళ్యాణ్‌ను ఇంటికి తీసుకురమ్మని కన్నీళ్లతో రాజ్‌ను ప్రాధేయపడతాడు ప్రకాశం. నేను వాళ్లిద్దరిని ఇంటికి తీసుకొస్తానని ధాన్యలక్ష్మికి మాటిస్తాడు రాజ్. ఇంటికి రావాల్సింది నా కొడుకు ఒక్కడే...మిగిలిన వాళ్లతో నాకు సంబంధం లేదని ధాన్యలక్ష్మి అంటుంది. కళ్యాణ్‌కు పెళ్లయిందని, భార్యభర్తలను విడదీయడం పాపమని అపర్ణ, ఇందిరాదేవి సర్ధిచెప్పిన ధాన్యలక్ష్మి వినదు.
డబ్బు కోసమే కళ్యాణ్‌ను అప్పు పెళ్లిచేసుకుందని, నా కొడుకును వదిలిపెట్టడానికి అప్పుకు ఎంతో కొంత డబ్బుఇద్దామని అవమానిస్తుంది.
అప్పు స్నేహం వల్లే...
నేను నిన్ను వదిలేయాలని అనుకుంటున్నానని, భరణం కింద నీకు ఎంత కావాలి అని భార్యను అడుగుతాడు ప్రకాశం. ఏం మాట్లాడుతున్నారు మీరు అని భర్తకు బదులిస్తుంది ధాన్యలక్ష్మి. మరి నువ్వేం మాట్లాడుతున్నావు...అప్పు కోసమే ఇళ్లు వదిలిపెట్టిన కళ్యాణ్...ఆమె లేకుండా ఇంటికి ఎలా తిరిగివస్తాడని భార్యకు క్లాస్ ఇస్తాడు. కళ్యాణ్ ఇళ్లు వదిలిపెట్టడానికి కారణం నువ్వు, రుద్రాణి అని కొప్పడతాడు.
అప్పు స్నేహం వల్లే కళ్యాణ్ కాపురం కూలిపోయిందని, అనామిక జైలు పాలవ్వడమే కాకుండా మన కుటుంబం పరువు పోవడానికి అప్పు కారణమని, ఆ నష్టజాతకురాలిని ఇంట్లో అడుగుపెట్టనిచ్చేది లేదంటూ ధాన్యలక్ష్మి ఖరాఖండిగా చెప్పేస్తుంది.
అపర్ణ హితభోధ...
ఆస్తి కోసమే కళ్యాణ్‌ను పెళ్లి చేసుకుందని మాటిమాటికి అనకు అని ధాన్యలక్ష్మికి హితభోద చేస్తుంది అపర్ణ.నువ్వు రుద్రాణి వల్లే అప్పుకు మరో అబ్బాయితో జరగాల్సిన పెళ్లి చెడిపోయిందని, అంతే కాకుండా మన కుటుంబం నుంచి కనకం ఫ్యామిలీకి ఇప్పటివరకు చిల్లిగవ్వ కూడా వెళ్లలేదని ధాన్యలక్ష్మితో అంటుంది అపర్ణ. ఎవరు ఎంత చెప్పిన ధాన్యలక్ష్మి వినదు. నాకు నా కొడుకు మాత్రమే కావాలి...అప్పును నేను ఎప్పటికీ కోడలిగా ఒప్పుకోనని ధాన్యలక్ష్మి తన నిర్ణయం స్పష్టంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
రాజ్ అసహనం...
రాజ్ కోపంగా బెడ్‌రూమ్‌లో అటూ ఇటూ తిరుగుతుంటాడు. కావ్య అప్పుడే లోపలికి ఎంట్రీ ఇస్తుంది. వచ్చావా...నేను అనుకున్నది జరిగింది...ఇలా జరుగుతుంది అని నాకు ముందే తెలుసు...అంటూ రోజుకో రభస, నస క్రియేట్ చేస్తావుగా...ఈ రోజు కూడా మొదలుపెట్టు కావ్యపై ఫైర్ అవుతాడు రాజ్. నాకు అత్తయ్య, సవతి, తోడి కోడలి పోరు అన్ని నీ వల్లే అని భర్తపై కావ్యరివర్స్ అవుతుంది. సంబంధం లేకుండా మాట్లాడి రాజ్‌ను కన్ఫ్యూజ్ చేసి లాజిక్‌లతో దెబ్బకొడుతుంది. పాత గొడవలు మొత్తం ముందుకు తీసుకొచ్చికళ్యాణ్ తో గొడవపెట్టుకుంటుంది.
రోజుకో యుద్ధమే...
నేను ఒప్పిస్తే కళ్యాణ్, అప్పు ఇంట్లోకి వచ్చేవారు...కానీ నాలా కష్టాలు పెడితే అప్పు ఓర్చుకునే రకం కాదని, ఇంట్లో రోజు యుద్దమే జరుగుతుందని భర్తతో అంటుంది కావ్య. కళ్యాణ్‌ను, అప్పును తిరిగి ఇంటికి తీసుకురావాలనే ఆలోచన మానుకోమని భర్తకు సర్ధిచెబుతుంది. రుద్రాణి వాళ్లను విడదీసేవరకు ఊరుకోదని రాజ్‌తో అంటుంది కావ్య. కళ్యాణ్ నిన్ను కన్నతల్లిగా భావించాడని, కానీ నువ్వు మాత్రం వాడు ఇంటికి తిరిగిరావద్దని కోరుకుంటున్నావని కావ్యతో అంటాడు రాజ్. నేను ఎందుకు ఈ విషయంలో పట్టువిడవటం లేదో తెలిసిన రోజు నేనేంటో మీకు అర్థమవుతుందని భర్తను ఉద్దేశించి మనసులో అనుకుంటుంది కావ్య.
కావ్య షాక్
నా కొడుకుకు దూరంగా నేను ఉండలేనని, కళ్యాణ్, అప్పు కలిసి ఇంటికి రావడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ధాన్యలక్ష్మి అంటుంది. నేను పిలిస్తే రానని, అప్పు, కళ్యాణ్‌లను నువ్వే ఒప్పించి తీసుకురావాలని రాజ్‌ను రిక్వెస్ట్ చేస్తుంది ధాన్యలక్ష్మి. ఇద్దరం కలిసి అప్పు, కళ్యాణ్‌లను తీసుకొద్దామని కావ్యతో అంటాడు రాజ్. కానీ తాను రానని చెప్పి భర్తతో పాటు ఇంట్లో అందరికి కావ్య షాకిస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.