Brahmamudi August 5th Episode: అప్పును కిడ్నాప్ చేసిన అనామిక - కావ్యను రుద్రాణితో పోల్చిన రాజ్ -ధాన్యలక్ష్మి రచ్చ!
Brahmamudi August 5th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 5 నాటి ఎపిసోడ్‌లో అనామిక రీఎంట్రీ ఇస్తుంది. పెళ్లి మండపం నుంచి అప్పును కిడ్నాప్ చేస్తుంది. అప్పు, కళ్యాణ్ లేచిపోయారని అపోహపడిన ధాన్యలక్ష్మి రచ్చ చేస్తుంది.
Brahmamudi August 5th Episode: అప్పు, కళ్యాణ్‌లను ఒక్కటి చేసేందుకు రాజ్ కొత్త ప్లాన్ వేస్తాడు. అప్పును ఎవరు చూడకుండా కళ్యాణం మండపం నుంచి సీక్రెట్‌గా కారులో తీసుకెళ్లి కళ్యాణ్‌తో ఆమె పెళ్లి జరిపించాలని ప్లాన్ వేస్తాడు. భర్త ప్లాన్‌ను కావ్య తిప్పికొడుతుంది. అప్పులా గొంతు మార్చి మాట్లాడుతూ ముసుగు వేసుకొని రాజ్‌తో కలిసి కారు ఎక్కుతుంది. నీకు కళ్యాణ్‌కు గుడిలో పెళ్లి జరిపిస్తానని అప్పు అనుకొని కావ్యతో చెబుతాడు రాజ్.
మా ఫ్రెండ్స్ పెళ్లి ఏర్పాట్లు అన్ని చేశారని అంటాడు. పెళ్లైనా వాళ్లకు మళ్లీ ఏంటి అని రాజ్‌తో కామెడీ చేస్తుంది కావ్య. ఎవరికి పెళ్లైంది అంటూ రాజ్ కోపంగా అంటాడు. నీకు నాకు అని కావ్య సమాధానం చెబుతుంది. కోపంగా రాజ్ వెనక్కితిరిగిచూస్తాడు. అప్పు ప్లేస్‌లో కావ్య ఉండటం చూసి రాజ్ షాకవుతాడు.
అప్పు ఏదని అడుగుతాడు. పెళ్లి మంటపంలో ఉందని కావ్య బదులిస్తుంది. రాజ్‌ను ఎలా బోల్తాకొట్టించింది చెబుతుంది కావ్య. కష్టపడి వేసిన ప్లాన్‌ను లాస్ట్ మినిట్‌లో చెడగొట్టావని భార్యపై ఫైర్ అవుతాడు రాజ్.
ముసుగు వేసుకొని కొడతా...
మీ ఫ్యామిలీకి ఈ ముసుగు కాన్సెప్ట్ బాగా కలిసివచ్చినట్లుందని కావ్యపై సెటైర్లు వేస్తాడు రాజ్. ఏదో ఒకరోజు నీకు ముసుగు వేసి కర్ర తీసుకొని వీపు వాచిపోయేలా కొడతానని కావ్యకు స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. అప్పు, కళ్యాణ్‌లను ఒక్కటి చేసేందుకు ఏం చేయాలా అని రాజ్ ఆలోచిస్తుంటాడు. అక్షింతలు వేయడం తప్ప ఏం చేయలేరని సమాధానం చెప్పి రాజ్ చిరాకును మరింత పెంచుతుంది కావ్య. అప్పు పెళ్లిని కళ్లారా చూడాలి. కారును వెనక్కి తిప్పి కళ్యాణ మంటపానికి పోనివ్వమని రాజ్‌కు ఆర్డర్ వేస్తుంది కావ్య. చేసేదేం లేక కావ్య చెప్పినట్లే చేస్తాడు రాజ్.
రుద్రాణితో పోలిక...
కళ్యాణ మంటపం దగ్గర దిగగానే రెండు నిండు జీవితాల్ని చీకటి మయం చేశావు...నీకంటే రుద్రాణి అత్తే నయం అని కావ్యపై తనకున్న కోపాన్ని బయటపెడతాడు రాజ్. నన్ను ఎన్నైనా మాటలు అనండి..బండ బూతులు తిట్టిన పడతాను కానీ రుద్రాణితో పోలిస్తే సహించలేనని, ఆ మాట పడటం కన్నా ఎందులోనైనా దూకి చావడం ఉత్తమమని భర్తకు సమాధానమిస్తుంది కావ్య.
ధాన్యలక్ష్మి టెన్షన్...
పెళ్లి టైమ్‌లో రాజ్, కావ్య బయటకు వెళ్లడం చూసి ధాన్యలక్ష్మి, రుద్రాణి కంగారు పడతారు. రాజ్, కావ్య కలిసిపోయి అప్పు, కళ్యాణ్‌ల పెళ్లి ఎక్కడ జరిపిస్తారోనని టెన్షన్ పడిపోతుంటారు. ఇంతలోనే పెళ్లికొడుకు, పెళ్లికూతురిని తీసుకురమ్మని పంతులు చెబుతాడు. అప్పు ను పీఠలపై చూస్తే తప్ప తన గుండెమంట చల్లారదని ధాన్యలక్ష్మి అనుకుంటుంది. పెళ్లికొడుకు శ్రీరామ్ వచ్చి పీఠలపై కూర్చుకుంటాడు. అప్పును తీసుకురావడానికి పెళ్లి కూతురు రూమ్‌కు అప్పు వెళుతుంది స్వప్న. కానీ రూమ్‌లో అప్పు కనిపించకపోవడంతో స్వప్న కంగారుగా మంటపం దగ్గరకు వస్తుంది.
అప్పు మిస్సింగ్...
అప్పు రూమ్‌లో కనిపించడం లేదని కనకంతో అంటుంది స్వప్న. అప్పు మిస్సింగ్ వెనుక రాజ్ ఉన్నాడనుకొని కావ్య అనుమానపడుతుంది. డైరెక్ట్‌గా రాజ్ దగ్గరకు వచ్చి అప్పు ఎక్కడికి వెళ్లిందని భర్తను అడుగుతుంది. నేను నీతోనే ఉన్నాగా...నాకేం తెలుసు అని రాజ్ ఆన్సర్ ఇస్తాడు. అప్పు కనిపించడం లేదంటే నీ కోడలు అయినట్లే అని ధాన్యలక్ష్మిని మాటలతో భయపెడుతుంది రుద్రాణి. అక్కడ నీ కొడుకు కూడా జంప్ అని సెక్యూరిటీ చెప్పాడని అంటుంది.
ధాన్యలక్ష్మి అనుమానం...
అప్పును వెతకడానికి రాజ్, కావ్య కలిసి వెళ్లబోతుండగా వారిని ధాన్యలక్ష్మి ఆపుతుంది. పెళ్లి మండపం నుంచి అప్పును మీరే తీసుకెళ్లిపోయుంటారని కోపంగా ఇద్దరితో అంటుంది. అంత అర్జెంట్‌గా మండటం నుంచి మీరిద్దరు ఎందుకు బయటకు వెళ్లారని ప్రశ్నిస్తుంది.
తన కళ్ల ముందే రాజ్, కావ్య ఇద్దరు మాత్రమే బయటకు వెళ్లారని, ఇద్దరే వచ్చారని భర్త ప్రకాశం చెప్పిన ధాన్యలక్ష్మి మాత్రం వెనక్కి తగ్గదు. తప్పిపోయిన వాళ్లను వెతకొచ్చు...కానీ లేచిపోయిన వాళ్లను ఎలా వెతుకుతాం అని రుద్రాణి గొడవ పెద్దది చేస్తుంది. లేచిపోవడం మీ అక్కాచెల్లెళ్లకు కొత్త కాదని, మీ అక్క పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయిందని కావ్యతో అంటుంది రుద్రాణి.
కావ్యనే సూత్రధారి...
మనకు తెలియకుండా పెళ్లి మండపంలో ఏదో జరుగుతుందని, అన్నింటికి సూత్రాధారి కావ్యనేనని ధాన్యలక్ష్మి నిందలు వేస్తుంది. అప్పు పెళ్లి శ్రీరామ్‌తో జరగాలని కావ్య కోరుకుందని, అనవసరంగా నా భార్యను అనుమానించొద్దని రాజ్ అంటాడు. కావ్య మా ఇంటి పరువు పోయే పని ప్రాణం పోయిన చేయదని, తెలిసి తెలిసి చెల్లెలి జీవితం ఎలా నాశనం చేస్తుందని కనకం ఎమోషనల్ అవుతుంది.
నీకూతుళ్ల పెళ్లి చేయడానికి ఎన్ని మోసాలు చేశావో, ఎన్ని అబద్దాలు ఆడావో అందరికి తెలుసునని, మూడో కూతురిని మా ఇంటికి కోడలిగా పంపించడానికి ఈ నాటకం ఆడుతున్నావని కనకాన్ని అవమానిస్తుంది రుద్రాణి.
రుద్రాణికి కావ్య వార్నింగ్...
అతిథిని అవమానించకూడాదనే ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టే ఆగుతున్నానని, మా ఫ్యామిలీ గురించి ఇంకో మాట జారితే పళ్లు రాలగొడతానని రుద్రాణికి కావ్య వార్నింగ్ ఇస్తుంది. నాకు కావ్యకు ఉన్నంత ఓపిక కూడా లేదని, ఎక్కవగా మాట్లాడితే అత్తవని చూడకుండా దులిపేస్తానని రుద్రాణిని స్వప్న హెచ్చరిస్తుంది. . ధాన్యలక్ష్మి, రుద్రాణిలకు ఇందిరాదేవి క్లాస్ ఇస్తుంది.
కళ్యాణ్ కూడా జంప్...
అప్పు ఏమైందో ఎలా మాయమైందో మాకు ఏం అర్థం కావడం లేదని కృష్ణమూర్తి అంటాడు. కృష్ణమూర్తిని సుభాష్, ప్రకాశం ఓదార్చుతారు.ఇక్కడ అప్పు కనిపిండం లేదు...అక్కడ కళ్యాణ్ కనిపించడం లేదని ధాన్యలక్ష్మి అంటుంది. ఇద్దరు కలిసి వెళ్లిపోయి ఉంటారని పెళ్లికి వచ్చిన అతిథులు అందరి ముందు అంటుంది ధాన్యలక్ష్మి. ఆమె మాటలు విని అందరూ షాకవుతారు.
అనామిక రీఎంట్రీ...
గుడిలో అప్పు గురించి రాజ్, కావ్య మొత్తం వెతుకుతారు. కానీ అప్పు ఎక్కడ కనిపించదు.అప్పును రౌడీల సాయంతో అనామిక కిడ్నాప్ చేస్తుంది. అనామికను చూసి అప్పు షాకవుతుంది. నీకు జైలుకు వెళ్లిన బుద్దిరాలేదా అని అనామికతో అంటుంది అప్పు. నన్ను జైలుకు పంపించిన ఒక్కొక్కరిని ఒక్కో ఆట ఆడుకోవాలని తిరిగి వచ్చానని, నీతోనే ఈ ఆటను మొదలుపెట్టానని అప్పుతో అంటుంది అనామిక.
ఈ కిడ్నాప్ బయటపడితే నువ్వు మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని అప్పు చెబుతుంది. నా పగ చల్లారిన తర్వాత జీవితాంతం జైలులో కూర్చోవడానికి తాను రెడీ అని అప్పుకు సమాధానమిస్తుంది అనామిక.
ఎవరిని వదిలిపెట్టను...
నా లైఫ్ ఇలా కావడానికి కారణమైన ఎవరిని వదిలిపెట్టనని అప్పుకు అనామిక వార్నింగ్ ఇస్తుంది. నన్నుప్రపంచం దృష్టిలో దోషిగా నిలబెట్టడమే కాకుండా నాకు విడాకులు ఇప్పించడానికి కారణం నువ్వేనని, నన్ను జైలుకు పంపించిన నువ్వే నా మొదటి టార్గెట్ అని అప్పుతో అంటుంది అనామిక. నీ పెళ్లి ఆపించి కళ్యాణ్‌తో నువ్వు లేచిపోయావని అందరి నమ్మించడానికే కిడ్నాప్ చేశానని అనామిక చెబుతుంది.
నీ గురించి పెళ్లి మండపంలో అందరూ రకరకాలుగా అనుకుంటూ ఉంటారని సంబరపడుతుంది అనామిక. ఈ పాటికి అప్పు, కళ్యాణ్‌లా పెళ్లి జరిగిపోయి ఉంటుందని, మీది మాయదారి కుటుంబం, అప్పును మన ఇంటికి కోడలిగా పంపించడానికే ఈ ఎత్తు వేశారని కనకాన్ని అవమానిస్తుంది రుద్రాణి. అప్పుడే కళ్యాణ్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. అతడిని చూసి అందరూ షాకవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.