Brahmamudi July 29th Episode: ధాన్య‌ల‌క్ష్మి ర‌చ్చ - కావ్య మాయ‌లో రాజ్ ప‌డ్డ‌డంటూ నింద‌లు - అప్పు కోసం కళ్యాణ్ త్యాగం-brahmamudi july 29th episode raj and kavya argues about kalyan marriage brahmamudi serial today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi July 29th Episode: ధాన్య‌ల‌క్ష్మి ర‌చ్చ - కావ్య మాయ‌లో రాజ్ ప‌డ్డ‌డంటూ నింద‌లు - అప్పు కోసం కళ్యాణ్ త్యాగం

Brahmamudi July 29th Episode: ధాన్య‌ల‌క్ష్మి ర‌చ్చ - కావ్య మాయ‌లో రాజ్ ప‌డ్డ‌డంటూ నింద‌లు - అప్పు కోసం కళ్యాణ్ త్యాగం

Nelki Naresh Kumar HT Telugu
Jul 29, 2024 07:50 AM IST

Brahmamudi July 29th Episode: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌జూలై 29 ఎపిసోడ్‌లో కావ్య మాయ మాట‌ల‌తోనే క‌ళ్యాణ్, అప్పుల పెళ్లిని రాజ్ జ‌రిపించాల‌ని అనుకుంటున్నాడ‌ని ధాన్య‌ల‌క్ష్మి భ్ర‌మ‌ప‌డుతుంది. కావ్య‌ను నానా మాట‌లు అంటుంది. కావ్య‌కు అప‌ర్ణ స‌పోర్ట్‌గా నిలుస్తుంది.

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌జూలై 29 ఎపిసోడ్‌
బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌జూలై 29 ఎపిసోడ్‌

Brahmamudi July 29th Episode: క‌ళ్యాణ్‌ను క‌లుస్తుంది కావ్య‌. అప్పు ప‌ట్ల అత‌డి మ‌న‌సులో ఏముందో తెలుసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. అప్పును ప్రేమిస్తున్నావా? నా చెల్లిలిని పెళ్లిచేసుకోవాల‌ని అనుకుంటున్నావా అని క‌ళ్యాణ్‌ను అడుగుతుంది కావ్య‌. ఇదే విష‌యం మీ అన్న‌య్య‌తో చెప్పావా? లేదంటే ఆయ‌నే మీ మ‌ధ్య బంధం గురించి భ్ర‌మ‌ప‌డుతున్నారా అని క‌ళ్యాణ్ నిల‌దీస్తుంది కావ్య‌.

అప్పు త‌న‌ను ప్రేమించ‌డం లేద‌ని క‌ళ్యాణ్ అపోహ‌లో ఉండిపోతాడు. అప్పుకు ఏది ఇష్ట‌మో అదే చేయండి అని కావ్య‌కు బ‌దులిస్తాడు. పెళ్లిచూపుల్లో అప్పు ఇష్ట‌ప‌డ్డ అబ్బాయితోనే ఆమె పెళ్లి జ‌రిపించ‌మ‌ని కావ్య‌తో అంటాడు క‌ళ్యాణ్‌. అత‌డి మాట‌ల‌తో కావ్య ఆనంద‌ప‌డుతుంది.

క‌ళ్యాణ్ ఎమోష‌న‌ల్‌...

ఆ త‌ర్వాత మీరు నాకు ఓ మాట ఇవ్వాల‌ని క‌ళ్యాణ్‌ను అడుగుతుంది కావ్య‌. అప్పు పెళ్లికి నేను రాకూడ‌దు అంతేగా అని క‌ళ్యాణ్ స‌మాధాన‌మిస్తాడు. అది కాద‌ని...క‌విగారు మీరు మీ అమ్మ‌గారు చూసిన సంబంధం ఒప్పుకొని పెళ్లిచేసుకోవాలి. మీ పెళ్లి జ‌రిగితేనే అప్పు విష‌యంలో మీ అమ్మ‌కు ఎలాంటి అనుమానాలు ఉండ‌వు. మీ జీవితం స్థిర‌ప‌డుతుంద‌ని క‌ళ్యాణ్‌తో అంటుంది కావ్య‌.

వ‌దిన చెప్పిన మాట‌లు విని క‌ళ్యాణ్ షాక‌వుతాడు.నేను ఏ ప‌రిస్థితుల్లో ఉన్నాను. మీరు ఏం అడుగుతారు అని క‌ళ్యాణ్ ఎమోష‌న‌ల్‌ అవుతాడు. నా మ‌న‌సుకు అయినా గాయం మ‌ర్చిపోయి మ‌ళ్లీ పెళ్లిచేసుకోవ‌డం సులువు కాద‌ని చెబుతాడు. ఇది ఎవ‌రో బ‌య‌టివాళ్లు అడిగితే అదే వేరు...అన్ని తెలిసిన మీరు ఇలా ఎలా అడ‌గ‌గ‌లుగుతున్నార‌ని కావ్య‌తో అంటాడు క‌ళ్యాణ్‌.

పెళ్లి బాధ్య‌త నాదే...

మీ పెళ్లి బాధ్య‌త నేనే తీసుకున్నాన‌ని క‌ళ్యాణ్‌కు చెబుతుంది కావ్య‌. పెళ్లి అనే నిప్పుల గుండంలోకి మ‌ళ్లీ న‌న్ను తోసేయాల‌ని చూస్తున్నారా..నా వ‌ల్ల కాద‌ని క‌ళ్యాణ్ బ‌దులిస్తాడు. నా మాట‌కు మీరు ఏ మాత్రం విలువ ఇచ్చిన మీరు ఈ పెళ్లి ఒప్పుకోవాల్సిందేన‌ని క‌ళ్యాణ్‌ను కావ్య ఎమోష‌న‌ల్ బ్లాక్‌మెయిల్ చేస్తుంది.

మ‌రోవైపు ధాన్య‌ల‌క్ష్మి త‌న రూమ్‌లో ఉండ‌గా ఆమెను రెచ్చ‌గొడుతుంది రుద్రాణి. క‌ళ్యాణ్‌ను పెళ్లికి ఒప్పిస్తాన‌ని కావ్య మాటిచ్చి 24 గంట‌లు గ‌డిచిపోయిన ఇంకా ఏం స‌మాధానం చెప్ప‌లేద‌ని, ఇప్పుడే వెళ్లి కావ్య‌ను దులిపేయ‌మ‌ని చాడీలు చెబుతుంది. ఈ సారి వెన‌క‌డుగు వేస్తే అప్పు ఇంటి కోడ‌లై కూర్చుకుంటుంద‌ని ధాన్య‌ల‌క్ష్మి మ‌న‌సులో అనుమానాలు మ‌రింత పెంచుతుంది.

ధాన్య‌ల‌క్ష్మి ఆవేశం...

రుద్రాణి మాట‌ల‌తో ఆవేశంగా కావ్య ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది ధాన్య‌ల‌క్ష్మి. కావ్య అని గ‌ట్టిగా అరుస్తుంది. ధాన్య‌ల‌క్ష్మి మాట‌లు ప‌ట్టించుకోకుండా కావ్య కిచెన్‌లోకి వెళ్ల‌బోతుంది. నేను పిలిచినా వినిపించ‌డం లేదా ఇక్క‌డే ఉండి ప‌ల‌క‌వేంటి అని ధాన్య‌ల‌క్ష్మి ఫైర్ అవుతుంది. నేను ఇక్క‌డే ఉన్న‌ప్పుడు అర‌వ‌డం ఎందుకు అని కావ్య కూడా ఆమెకు ధీటుగానే రిప్లై ఇస్తుంది.

నాకు ఇచ్చిన మాట ఏం చేశావు...క‌ళ్యాణ్‌ను పెళ్లికి ఒప్పించావా లేదా అని కావ్య‌ను అడుగుతుంది ధాన్య‌ల‌క్ష్మి. మీ మాట‌ల‌కు ప్ర‌కాశం మావ‌య్య‌తో పాటు క‌న్న కొడుకు కూడా విలువ ఇవ్వ‌డం లేద‌న్న మాట‌.. క‌ళ్యాణ్‌ను పెళ్లికి కావ్య నే ఒప్పించాల్సివ‌చ్చింద‌ని స్వ‌ప్న సెటైర్లు వేస్తుంది.

మీ చెల్లి అప్పు వ‌ల్ల మా కుటుంబానికి ప్ర‌మాదం రాకూడ‌ద‌ని కావ్య‌ను అడుగుతున్నాన‌ని స్వ‌ప్న‌తో అంటుంది ధాన్య‌ల‌క్ష్మి. అయితే రిక్వెస్ట్ చేయాలి గానీ ద‌బాయిస్తున్నారేంటి అని స్వ‌ప్న అంటుంది. మాటిచ్చిన నువ్వు ఎందుకు సెలైంట్‌గా ఉంటున్నావు, క‌ళ్యాణ్‌ను పెళ్లికి ఒప్పించావా లేదా అని కావ్య‌ను నిల‌దీస్తుంది ధాన్య‌ల‌క్ష్మి.

రాజ్ ఛాలెంజ్‌...

ఎవ‌రు ఎవ‌రిని ఒప్పించాల్సిన ప‌ని లేద‌ని, క‌ళ్యాణ్ మ‌న‌సులో అప్పు ఉంద‌ని అప్పుడే అక్క‌డికి ఎంట్రీ ఇచ్చిన రాజ్ చెబుతాడు. క‌ళ్యాణ్‌కు అప్పును ఇచ్చి పెళ్లి చేయ‌బోతున్న‌ట్లు అంద‌రి ముందు ప్ర‌క‌టిస్తాడు. క‌ళ్యాణ్ మ‌న‌సులో దూరి తెలుసుకున్నారా...మీకు ఒక్క‌సారి చెబితే అర్థం కాదా అని రాజ్‌పై కావ్య ఫైర్ అవుతుంది.

అప్పును తాను ఇష్టం ప‌డ‌టం లేద‌ని క‌ళ్యాణ్ నాతో స్వ‌యంగా చెప్పాడ‌ని భ‌ర్త‌తో అంటుంది కావ్య‌. అప్పు లైఫ్ బాగుండాల‌ని క‌ల్యాణ్ కోరుకుంటున్నాడ‌ని కావ్య చెబుతుంది.. క‌ళ్యాణ్ లైఫ్ బాగుండాల‌ని నేను కోరుకుంటున్నాను కాబ‌ట్టే అప్పును వాడికి ఇచ్చి పెళ్లి చేయాల‌నుకుంటున్న‌ట్లు రాజ్ కావ్య‌కు స‌మాధాన‌మిస్తాడు.

కావ్య‌పై ధాన్య‌ల‌క్ష్మి ఫైర్‌...

నా కొడుకుకు వేరే అమ్మాయితోనే పెళ్లి జ‌రిపిస్తాన‌ని రాజ్‌, కావ్య‌ల‌తో ధాన్య‌ల‌క్ష్మి ఛాలెంజ్ చేస్తుంది. క‌ళ్యాణ్, అప్పు విష‌యంలో మ‌రోసారి కావ్య‌నే ధాన్య‌ల‌క్ష్మి త‌ప్పుప‌డుతుంది.

వెన‌కాల ఉండి నువ్వే ఇదంతా న‌డిపిస్తూ ఏం ఎర‌గ‌ని దానిలా నాట‌కాలు ఆడుతున్నావ‌ని కావ్య‌పై ధాన్య‌ల‌క్ష్మి ఫైర్ అవుతుంది. కావ్య‌కు అప‌ర్ణ స‌పోర్ట్‌గా నిలుస్తుంది. ఎవ‌రి గురించి ఏం మాట్లాడుతున్నావ‌ని కోప్ప‌డుతుంది.

క‌ళ్యాణ్‌, అప్పుల పెళ్లి జ‌రిపిస్తాన‌ని రాజ్ అంటున్నాడు. నా కోడ‌లు ...అస‌లు క‌ళ్యాణ్ మ‌న‌సులో అప్పు లేద‌ని చెబుతోంది...ఈ విష‌యం నీకు అర్థం కావ‌డం లేదా ధాన్య‌ల‌క్ష్మికి అప‌ర్ణ క్లాస్ ఇస్తుంది.

కావ్య త‌ప్పులేదు...

క‌ళ్యాణ్ పెళ్లి విష‌యంలో తానే నిర్ణ‌యం తీసుకున్నాన‌ని, ఇందులో కావ్య త‌ప్పు లేద‌ని రాజ్ స‌మ‌ర్థించ‌బోతాడు. అయినా ధాన్య‌ల‌క్ష్మి వెన‌క్కి త‌గ్గ‌దు. కావ్య‌దే త‌ప్పు అని వాదిస్తుంది. పెళ్ల‌యి ఇంట్లో అడుగుపెట్ట‌గానే ఇంటి పెద్ద‌లు ఎవ‌రో క‌నిపెట్టి తాత‌య్య‌, నాన‌మ్మ‌ల‌ను మంచి చేసుకుంది. ఎవ‌రి మాయ మాట‌ల‌కు లొంగ‌ని మీ అమ్మ ఈ మ‌హాత‌ల్లి బుట్ట‌లో ప‌డిపోయింద‌ని రాజ్‌తో అంటుంది ధాన్య‌ల‌క్ష్మి.

నిన్ను కావ్య కొంగున క‌ట్టేసుకుంది. భార్య మాయ‌లో ప‌డి నువ్వేం చేస్తున్నావో నీకు తెలియ‌డం లేద‌ని ధాన్య‌ల‌క్ష్మి నానా ర‌చ్చ చేస్తుంది. కావ్య మాట‌ల‌తోనే అప్పును క‌ళ్యాణ్‌కు రాజ్‌ పెళ్లి చేయాల‌నుకుంటున్నాడ‌ని ధాన్య‌ల‌క్ష్మి గొడ‌వ చేస్తుంది. మీ కుటుంబం అంతా ఇంతే అని కావ్య ఫ్యామిలీని అవ‌మానిస్తుంది.

క‌ళ్యాణ్ మ‌న‌సు తెలియ‌క‌...

మా కుటుంబం జోలికి వ‌స్తే మ‌ర్యాద‌గా ఉండ‌ద‌ని ధాన్య‌ల‌క్ష్మికి కావ్య వార్నింగ్ ఇస్తుంది. మీరు, మీ కోడ‌లు క‌లిసి మా చెల్లెలిని వీధిలోకి లాగింది చాలు. మా ఆయ‌న‌.. క‌ళ్యాణ్ మ‌న‌సు తెలియ‌క అలా మాట్లాడుతున్నాడ‌ని, ఏం తెలియ‌కుండా మాట్లాడితే బాగుండ‌ద‌ని చెబుతుంది. ధాన్య‌ల‌క్ష్మికి అప‌ర్ణ‌, ఇందిరాదేవి కూడా క్లాస్ ఇస్తారు.

ళ్యాణ్‌కు పిలిచి అడిగితే క్లారిటీ వ‌స్తుంది క‌దా అని స్వ‌ప్న చెబుతుంది. ఒక‌వేళ నువ్వు చెప్పింది నిజ‌మైతే నా స‌పోర్ట్ నీకే అని చెబుతుంది. ఒక‌వేళ క‌ళ్యాణ్ మ‌న‌సులో అప్పు ఉంద‌ని తెలిస్తే ఎవ‌రూ ఆప‌ని నేను ఆగ‌న‌ని రాజ్ అంటాడు.

రాజ్, కావ్య ప్ర‌శ్న‌లు...

క‌ళ్యాణ్ రాగానే నువ్వు అప్పును ప్రేమించ‌డం లేదా...ఆమెను పెళ్లిచేసుకోవాల‌ని అనుకోవ‌డం లేదా అని రాజ్ గ‌ట్టిగా అడుగుతాడు. నీ మ‌న‌సులో ఏముందో ధైర్యంగా బ‌య‌ట‌పెట్ట‌మ‌ని చెబుతాడు. మీరు ఇప్ప‌టికీ అప్పును ఫ్రెండ్‌గానే చూస్తున్న‌ట్లు ఇందాకా నాకు చెప్పిందే అంద‌రికి చెప్ప‌మ‌ని కావ్య అంటుంది.

ఇన్నాళ్లు స్నేహం అనే బంధాన్ని అడ్డుపెట్టుకొని నాతో పాటు అనామిక నోరు మూయిస్తూవ‌చ్చావు...ఇప్పుడు నీ మ‌న‌సులో అప్పు ఉండ‌టం ఏంటి? దాన్ని నువ్వు పెళ్లిచేసుకోవ‌డం ఏంటి అని కొడుకుపై ధాన్య‌ల‌క్ష్మి కొప్ప‌డుతుంది.

ప్ర‌కాశం స‌ల‌హా...

ఒక‌సారి అనామిక‌ను పెళ్లిచేసుకొని ఆ న‌ర‌కం నుంచి త‌ప్పించుకున్నావు. ఇప్పుడు నీ మ‌న‌సు ఏం కోరుకుంటుందో. ఏం చేస్తే నీ జీవితం బాగుంటుందో బాగా ఆలోచించి చెప్ప‌మ‌ని కొడుకుకు స‌ల‌హా ఇస్తాడు ప్ర‌కాశం. అప్పును తాను ప్రేమించ‌డం లేద‌ని క‌ళ్యాణ్ అంటాడు. ఒక ఫ్రెండ్‌గానే చూస్తున్న‌ట్లు అంద‌రికి చెబుతాడు. మా మ‌ధ్య కేవ‌లం స్నేహం మాత్రమే ఉంద‌ని అంటాడు. ఇక ఈ విష‌యాన్ని వ‌దిలిపెట్టి నా గురించి గొడ‌వ‌లు ప‌డ‌టం ఆపేయ‌మ‌ని క‌ళ్యాణ్ అంటాడు.

నీ మ‌న‌సును మోసం చేసుకోవ‌ద్దు...

నువ్వు న‌న్ను మోసం చేసిన ప‌ర‌వాలేదు కానీ నీ మ‌న‌సును నువ్వే మోసం చేసుకోవ‌ద్ద‌ని క‌ళ్యాణ్‌తో అంటాడు రాజ్‌. ఒక‌సారి పెళ్లిచేసుకొని త‌ప్పు చేశావు. ఇప్పుడు నీకు న‌చ్చిన అమ్మాయిని కాద‌ని ఆ బాధ‌ను జీవితాంతం అనుభ‌వించ‌వ‌ద్ద‌ని త‌మ్ముడి క‌ళ్యాణ్ స‌ల‌హా ఇస్తాడు.

ఎందుకోసం నీ ఇష్టాన్ని చంపుకుంటున్నావు. ఎవ‌రికోసం నీ నిర్ణ‌యాన్ని మార్చుకుంటున్నావ‌ని క‌ళ్యాణ్‌ను నిల‌దీస్తాడు రాజ్‌. బ‌ల‌వంతంగా నా కొడుకును పెళ్లికి ఒప్పిస్తున్నావా రాజ్‌పై ధాన్య‌ల‌క్ష్మి కోప్ప‌డుతుంది. రాజ్ ఆమెను ఆపుతాడు. గొడ‌వ‌ల‌కు భ‌య‌ప‌డ‌కుండా నీ మ‌న‌సులో ఏముందో చెప్ప‌మ‌ని క‌ళ్యాణ్‌ను కోరుతాడు రాజ్‌.

అప్పు ప్ర‌శాంతంగా బ‌త‌క‌డం త‌ప్ప తానేది ఆలోచించ‌డం లేద‌ని క‌ళ్యాణ్ అంటాడు. గొడ‌వ‌లు మ‌ర్చిపోయి ఆమె లైఫ్ బాగుండ‌ట‌మే నాకు ముఖ్య‌మ‌ని క‌ళ్యాణ్ అంటాడు.

రుద్రాణికి స్వ‌ప్న వార్నింగ్‌...

ఇప్పుడేమంటారు అని ధాన్య‌ల‌క్ష్మిని అడుగుతుంది కావ్య‌. నోరు ఉంది క‌దా అని నింద‌లు వేయ‌డ‌మే అని అప‌ర్ణ అంటుంది. మ‌రి నాకు ఇచ్చిన మాట సంగ‌తేం చేశావ‌ని కావ్య‌ను అడుగుతుంది ధాన్య‌ల‌క్ష్మి. నా చెల్లిలికి ఏం అవస‌రం అని ధాన్య‌ల‌క్ష్మికి స్వ‌ప్న బ‌దులిస్తుంది.

ఏమో మీరు ఇద్ద‌రు ఈ ఇంటి కోడ‌ల్లు ఎలా అయ్యారు...ఇంట్లో వాళ్ల ఇష్ట ప్ర‌కారం అయ్యారా అని రుద్రాణి మ‌ధ్య‌లో జోక్యం చేసుకుంటుంది. నోరు ఎత్తితే నా అత్తవి అని కూడా చూడ‌ను అని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది. స్వ‌ప్న‌ను రాహుల్ బెదిరిస్తాడు.

అప్పు మ‌న‌సులో కూడా క‌ళ్యాణ్ ప‌ట్ల‌ ప్రేమ ఉంద‌ని కావ్య‌తో రాజ్ వాదిస్తాడు. ఆమె మ‌న‌సులో ఏముందో తాను తెలుసుకుంటాన‌ని క‌న‌కం ఇంటికి వెళ‌తాడు. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ముగిసింది.

Whats_app_banner