Brahmamudi May 23rd Episode: బ్రహ్మముడి- కావ్యకు మొదలైన సవతి పోరు- బెడ్‌పై రాజ్ మాయ- రుద్రాణికి బ్రేక్ అంటూ ఛాలెంజ్
23 May 2024, 8:48 IST
Brahmamudi Serial May 23rd Episode: బ్రహ్మముడి సీరియల్ మే 23వ తేది ఎపిసోడ్‌లో మాయ అసలు పేరు చిత్ర అని తెలుస్తుంది. చిత్రను మాయగా రుద్రాణి తీసుకొచ్చినట్లు జరిగినదంతా కావ్యకు చెబుతుంది. దాంతో కావ్య అదే రేంజ్‌లో ఛాలెంజ్ చేసి చిన్న బ్రేక్ తీసుకోమంటుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
బ్రహ్మముడి సీరియల్ మే 23వ తేది ఎపిసోడ్
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో మాయ నిజ స్వరూపం బయటపెట్టి ఇంట్లోంచి గెంటేస్తా అని కావ్య అంటుంది. దాంతో దండం పెట్టి అమ్మా తల్లి ఇప్పటిదాకా చేసింది చాలు. ఇంకా కొడైకెనాల్‌లో పడేయకు అని రాజ్ అంటాడు. ప్రపంచంలో ఏ బిత్తిరిది అయినా సవతిని తెచ్చుకుంటుందా. అప్పుడే మా అత్త, హక్కులు, అధికారాలు, కోడలి స్థానం గురించి గెలకడం మొదలుపెట్టింది. దాన్ని ఎలా తట్టుకుంటావో ఎలా వదిలించుకుంటావో నీ కర్మ అని రాజ్ వెళ్లిపోతాడు.
మాయగానే జీవించాలి
నువ్ మంచి కోసం చేశావమ్మా. కానీ, ప్రపంచంలో నీ అంత స్వచ్ఛంగా ఉండరమ్మా. చూద్దాం ఏం జరుగుతుందో అని సుభాష్ వెళ్లిపోతాడు. మరోవైపు ఇంటి బయట రుద్రాణి ఆలోచిస్తుంటే మాయ వస్తుంది. బాగా నటించానా అని మాయ అడిగితే బాగా జీవించావ్ అని రుద్రాణి అంటుంది. ఇద్దరూ సంతోషంతో హై ఫై ఇచ్చుకుంటారు. జీవితాంతం సుఖంగా జీవించాలంటే మాయగానే జీవించాలి. బాగా నమ్మించాను కదా. నమ్మనివాళ్లు నిజం బయటపెట్టలేరు కదా అని మాయ అంటుంది.
రాజ్ గానీ, కావ్య గానీ నిన్ను బెదిరించో నిజం బయటపెట్టించే అవకాశం ఉంది. అన్నిటికి సిద్ధంగా ఉండు అని రుద్రాణి అంటుంది. ఇంట్లోకి అడుగుపెట్టానంటే అన్నింటికి సిద్ధపడే వచ్చానని అర్థం అని మాయ అంటుంది. నీ ధైర్యం గురించి నాకు తెలియదా చిత్ర అని రుద్రాణి అంటుంది. చిత్ర ఎవరు. నా పేరు మాయ. ఇక నేను మాయ అని చిత్ర అంటుంది. ఈ మాయ లేడిని రెడీ చేసి పంపించిందే నేను కదా. ఎలా మర్చిపోతాను అని రుద్రాణి అంటుంది.
ఎలాంటివాళ్లో తెలుసు
ఆ మాటలు విన్న రాహుల్ హో మై గాడ్. ఇదంతా నీ ప్లానా మమ్మీ అని రాహుల్ అంటాడు. రుద్రాణి గారి ప్లాన్ లేకుండా నాలాంటి మాములు అమ్మాయి ఇంతపెద్ద ఇంట్లోకి ఎలా అడుగుపెడుతుంది అనుకున్నావ్ రాహుల్ అని చిత్ర అంటుంది. నా పేరు కూడా తెలుసా అని రాహుల్ ఆశ్చర్యపోతే.. నాకు అందరి పేర్లు తెలుసు. ఎవరు ఎలాంటివాళ్లో కూడా తెలుసు అని చిత్ర అంటుంది. ఒక ఆయుధాన్ని తయారు చేసేటప్పుడు సానా బట్టాలి కదా అని రుద్రాణి అంటుంది.
నాకూడా తెలియకుండా ఇంతా చేశవా అని రాహుల్ అంటే.. కుటుంబం ముక్కలు కావాలంటే విభజించి పాలించాలి కదా. ఈ మమ్మీ తక్కువ అంచనా వేయకూడదని చెప్పాను కదా అని రుద్రాణి అంటుంది. అవును, చాలా తక్కువ అంచనా వేశాను అని కావ్య ఎంట్రీ ఇస్తుంది. దాంతో అంతా షాక్ అవుతారు. నేను నీ దగ్గర మోసపోయాను. నువ్ అక్కడ అలా మాట్లాడి ఇక్కడ ఇలా ఎలా మాట్లాడవ్ అనుకున్నాను. దీని వెనుక నీ హస్తం ఉంటుందని ఊహించలేకపోయాను అని కావ్య అంటుంది.
కావ్యకు మతిపోయింది
మేము ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నాం అని చిత్ర అంటే.. ఏయ్ కత్తి ఆపు. నేను మొత్తం వినేశాను అని కావ్య అంటుంది. ఇప్పుడు నీకు అంతా తెలిసింది అయితే ఏంటీ. వెళ్లి అందరికీ నిజం చెబుతావా. వెళ్లి చెప్పు అని రుద్రాణి అంటుంది. మామ్ నువ్వేంటి కావ్యను నిజం చెప్పమని ట్రైనింగ్ ఇస్తున్నావ్ మతి పోయిందా అని రాహుల్ కంగారుపడతాడు. మతిపోయింది నాకు కాదు పుత్ర కావ్యకు. చూడు బిత్తరపోయి ఎలా నిల్చుందో చూడు అని రుద్రాణి అంటుంది.
వెళ్లు నిజం చెప్పు. ఈ చిత్రను నేనే తీసుకొచ్చాను అని చెప్పు. ఇది చెబితే నిజం చెప్పే దమ్ము నీకుందా. నిజం చెప్పి మీ అత్త అపర్ణ ముందు నిలబడగలవా. నువ్ చెప్పకుండా అసలు నిజం నేను చెబుతాను. అసలు నిజం బయటపెట్టడానికి ఈ నాటకం ఆడానని తప్పుకుంటాను. నువ్ మాయ కోసం వెళ్లలేదు. నువ్ వెళ్లే దారిని నేను సెట్ చేశాను. బాబు అన్నయ్య కొడుకు అని నాకు తెలుసు. మీరు మాట్లాడుకుందంతా నేను విన్నాను అని జరిగింది అంతా చెబుతుంది రుద్రాణి.
చిన్న విరామం తీసుకోండి
దాంతో కావ్య షాక్ అవుతుంది. నువ్ ఎలా ఆలోచిస్తావో ఆలోచించాను. దానికంటే ఒక అడుగు ముందు వేశాను. నువ్ అడ్రస్ తెలుసుకునేలోపే నేను ఒక్కడ ఒక ముసాలావిడను పెట్టి నీకు చిత్ర అడ్రస్ ఇప్పించాను. అప్పుడు చిత్రం చిత్రంగా మాట మార్చేసరికి బిత్తరపోయావ్. ఇప్పుడెళ్లి నిజం చెబుతావా అని రుద్రాణి అంటుంది. చెప్పను.. ఇప్పుడు చెప్పను. చెప్పాల్సిన టైమ్‌కు చెబుతాను. నేను చెప్పేది మీకు తెలియకుండా చేస్తాను అని కావ్య అంటుంది.
ఇప్పటివరకు నాకంటే ఒక అడుగు ముందు మీరున్నారు. ఇక నేను ఉంటాను. ఆరంభం మీరు చేశారు. ముగింపు నేను ఇస్తాను. ఈ మాయను ఛేదిస్తాను. అప్పటివరకు చిన్న విరామం తీసుకోండి అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది కావ్య. అదేంటీ మామ్ కావ్యను రెచ్చగొడితే ఏమవుతుందో తెలియదా అని రాహుల్ అంటాడు. కావ్య ఒక సెంటిమెంటల్ ఫూల్. ఇంటికి నష్టమంటే ఏం చేయదు. ఆ బలహీనతే నాకు అస్త్రం. ఈ మాయను ఉపయోగించి భయంకరమైన ఉత్పాతం సృష్టిస్తాను. అందరిని నా గుప్పిట్లోకి తెచ్చుకుంటాను అని రుద్రాణి అంటుంది.
నెరజానవు అని తెలుసు
మరోవైపు రాజ్ ఆలోచిస్తుంటుంది. ఒక అమ్మాయి దుగ్గిరాల ఇంట్లోకి కోడలిగా వస్తే ఒక్క మాట కూడా మాట్లాడని పరిస్థితి. ఈ మోసాన్ని ఎలా భయటపెట్టాలి అని రాజ్ ఆలోచిస్తుంటే చిత్ర వస్తుంది. రాజ్‌ను చూసి వయ్యారంగా నిల్చుంటుంది. అది చూసి నువ్ ఒక నెరజానవు అని నాకు తెలుసు. అది మొహంలో ప్రదర్శించాల్సిన అవసరం లేదు. నీకు ఏం కావాలి అని రాజ్ అడిగితే.. నువ్వే కావాలి అని చిత్ర అంటుంది. ఎలా కావాలి భర్తగానే ఇంకేమేనా అని రాజ్ అంటాడు.
అన్ని రకాలుగా కావాలి. ఇప్పుుడు నిజం చెప్పలేవు. నా నిజం నేను చెబితే ఎలా ఉంటుంది అని చిత్ర బెదిరిస్తుంది. దాంతో కోపంతో ఫ్లవర్ వాజ్‌తో చిత్రను కొట్టేందుకు ఎత్తుతాడు రాజ్. కానీ, ఆగిపోతాడు. ఆగిపోయావే అని చిత్ర అడిగితే.. ఈ ఇంటి సంస్కారం అడ్డొచ్చింది అని రాజ్ అంటాడు. అదే సంస్కారంతో సంసారం సాగిద్దామని చిత్ర అంటుంది. దాన్ని సంసారం అనరు. దానికి వేరే పేరు ఉంది అని రాజ్ అంటే.. చిత్ర నవ్వుతుంది. నేను అన్నమాటకు ఇంకో ఆడది అయితే గుండెపగిలి చచ్చేది. దీంతోనే తెలుస్తోంది నీ క్యారెక్టర్ ఏంటో అని రాజ్ అంటాడు.
ఏమైనా చేయగలిగావా
అసలు నీకు ఏం కావాలి అని రాజ్ అడిగితే.. నేను ఏదో టెంపరరీగా వచ్చి పెళ్లి కాలేదని రిటర్న్ గిఫ్ట్ తీసుకుని వెళ్లిపోయే రకం కాదు. మీ దగ్గర ఆస్తి ఉంది. నా దగ్గర ఆశ ఉంది. నిన్ను పెళ్లి చేసుకుని ఇంటి మహారాణిలా ఉండాలనుకుంటున్నాను అని చిత్ర అంటుంది. నువ్ అనుకుంది ఏది జరగదు అని రాజ్ అంటే.. నువ్ అనుకుంది కూడా ఏం చేయలేవు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చా. ఏమైనా చేయగలిగావా అని చిత్ర అంటుంది.
అన్నింటికి సిద్ధపడే వచ్చావన్నమాట అని రాజ్ అంటే.. అది ఇప్పుడు అర్థమైందా అని చిత్ర అంటుంది. దాంతో పటు కాపురం చేద్దాం అని బెడ్‌పై చిత్రను పడేస్తాడు. ఏంటిది అని చిత్ర కంగారుగా అడిగితే.. బిడ్డకు జన్మనిచ్చావ్ కదా. ఏంటో తెలియదా. ఇది మనకు ఫస్ట్ నైట్ కాదు. ఫస్ట్ పగలు. భర్త కావాలి. కాపురం చేయొద్దా అని రాజ్ అంటాడు. అప్పటిదాకా భయపడినట్లు చేసిన చిత్ర రాజ్ చేయి పట్టుకుని నాకు కావాల్సింది ఇదే అంటుంది.
సిగ్గుతో రాజ్
రాజ్ షాక్ అవుతాడు. రాజ్ చేయి పట్టుకుని బెడ్ పై పడేస్తుంది చిత్ర. రాజ్ పైకి ఎక్కి కాపురం చేద్దామన్నావ్. ఎందుకింత బిత్తరపోతున్నావ్ అని పెద్ద ఝలక్ ఇస్తుంది చిత్ర. దాంతో బలవంతంగా పైనుంచి లేచి నువ్ అసలు ఆడదానివేనా అని రాజ్ అంటాడు. అందుకేగా బెడ్ పై పడేసావ్. వస్తా మళ్లీ మళ్లీ వస్తా అని వెళ్లిపోతుంది చిత్ర. ఛా అని కోపంగా అనుకుంటాడు రాజ్. ఇంతలో కావ్య వస్తుంది. రాజ్ సిగ్గుతో తలదించుకుంటాడు.
బెడ్ నలిగి ఉండటం చూస్తుంది కావ్య. ఏంటిది అన్నట్లుగా అది చూపిస్తూ సైగ చేస్తుంది. ఏం లేదు అని రాజ్ అంటాడు. అబద్ధం ఆడకండి. నన్ను కలుగజేసుకోవద్దు అని చెప్పి మీరే రంగంలోకి దిగారా అని కావ్య అంటుంది. లేదు. నేను దానికి వార్నింగ్ ఇచ్చి పంపించాను అని రాజ్ అంటాడు. బెడ్‌పై పక్క పక్కనే ఉండి వార్నింగ్ ఇచ్చారా అని చూసింది చెబుతుంది కావ్య. దాంతో సెట్ అయిపోదామనుకున్నారా. చేయి పట్టి మరి లాగారు అని కావ్య కావాలనే అంటుంది.
నాకే చెమటలు పట్టించింది
అది కూడా చూశావా. అసలు ఆడదే కాదు. బెదిరిస్తే బెదురుతుంది అనుకున్నా. కానీ, నాకే చెమటలు పట్టించింది. నాకు క్యారెక్టర్ ఉంది రాజ్ అంటాడు. ఆ క్యారెక్టరే ఏం చేయలేకపోయింది అని కావ్య అంటుంది. అసలు ఇదంతా నీవల్లే జరిగింది. అది ఇంట్లో ఉంటే ఇల్లుకే కాదు. నా శీలానికి కూడా ప్రమాదం జరిగేలా ఉంది. వెంటనే అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పంపించేయ్ అని రాజ్ వెళ్లిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో అమ్మమ్మ గారు కాఫీ. నేను బాగా కలుపుతానంటూ అందరికీ కాఫీ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది చిత్ర. తెలుస్తోంది. వరుసలు బాగా కలుపుతావని ఇందిరాదేవి కౌంటర్ ఇస్తే.. అన్ని కలుపుకుని కాక్ టేల్ కాఫీ నువ్వే తాగు అని పంచ్ ఇస్తుంది స్వప్న. అపర్ణకు చిత్ర కాఫీ ఇస్తే.. వెంటనే కావ్య కూడా ఇస్తుంది. దాంతో అపర్ణ షాక్ అవుతుంది. దాంతో కావ్యకు సవతి పోరు అప్పుడే మొదలైనట్లు తెలుస్తోంది.
టాపిక్