Brahmamudi September 7th Episode: పంతం వీడని ధాన్యలక్ష్మి -బర్త్‌డే రోజు కళ్యాణ్‌కు అవమానం-కష్టాల్లో కావ్య కాపురం
07 September 2024, 8:53 IST
Brahmamudi September 7th Episode: బ్రహ్మముడి సెప్టెంబర్ 7 ఎపిసోడ్‌లో కళ్యాణ్ పుట్టినరోజునాడు గుడిలో అన్నదానం చేస్తుంటారు దుగ్గిరాల ఫ్యామిలీ. ఈ అన్నదానానికి వచ్చిన కళ్యాణ్, అప్పులను ధాన్యలక్ష్మి అవమానిస్తుంది.
బ్రహ్మముడి సెప్టెంబర్ 7 ఎపిసోడ్
Brahmamudi September 7th Episode: కళ్యాణ్ పుట్టినరోజు నాడు దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం గుడికివస్తారు. అపర్ణకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమె గుడికి రాదు. అపర్ణకు తోడుగా కావ్య కూడా ఇంట్లోనే ఉండిపోతుంది. అపర్ణను చంపేసి ఆ నేరాన్ని కావ్య మీదకు నెట్టివేయాలని రాహుల్ ప్లాన్‌చేస్తాడు. కాసేపట్లో దుర్వార్త వింటావని తల్లి రుద్రాణితో చెబుతాడు రాహుల్.
గుడికి కళ్యాణ్...
పుట్టినరోజునాడు భార్య అప్పుతో కలిసి కళ్యాణ్ గుడికివస్తాడు. గుడిలో తన కుటుంబసభ్యులు కనిపించడంతో కళ్యాణ్ షాకవుతాడు. తన వాళ్లకు కనిపించకుండా వెళ్లిపోవాలని అనుకుంటాడు. కానీ కళ్యాణ్‌ను రాజ్ చూస్తాడు. తమ్ముడి దగ్గరకు వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతాడు. పరాయివాడిలా దూరం నుంచి ఎందుకు వెళ్లిపోతున్నావని తమ్ముడిని నిలదీస్తాడు రాజ్.
నా కోసం చేస్తోన్న ఈ కార్యక్రమాల్లో నేను ఉంటే ఎంత ప్రమాదమో నాకు తెలుసు అని రాజ్‌కు బదులిస్తాడు కళ్యాణ్. నేను రావడం వల్ల ఈ హ్యాపీ మూవ్‌మెంట్స్ అన్ని చెడిపోతాయని చెబుతాడు. ఈ ఏర్పాట్లు అన్ని మీ అమ్మ చేసిందని తమ్ముడికి సర్ధిచెప్పబోతాడు రాజ్. మా అమ్మకు నేను క్షేమంగా ఉండటమే కావాలి...కానీ నాకు ఏది ఇష్టమో ఆమెకు అవసరం లేదని రాజ్‌తో కళ్యాణ్ అంటాడు.
కళ్యాణ్‌ను ఎందుకు పిలవలేదు...
ఈ పూజలు, ఏర్పాట్లు కళ్యాణ్ కోసమే చేస్తే...అతడిని ఎందుకు పిలవలేదని రాజ్‌ను అడుగుతుంది అప్పు. కళ్యాణ్‌కు అందరూ శ్రేయోభిలాషులే ఉన్నారని, శత్రువులు ఎవరూ లేరని సర్ధిచెప్పి కళ్యాణ్, అప్పులను తన వాళ్ల దగ్గరకు బలవంతంగా తీసుకెళతాడు రాజ్.
కావ్య హడావిడి...
అపర్ణ వంట చేస్తుంటుంది. కూర ఘాటుకు అపర్ణ దగ్గడంతో కావ్య తెగ హడావిడి చేస్తుంది. మీరు వంట చేయాల్సిన అవసరం లేదంటూ అపర్ణ చేతిలో నుంచి బలవంతంగా గరిటే లాక్కుంటుంది. ఇంతలోనే తమ కంపెనీ నుంచి ఓ ఎంప్లాయ్ కావ్యకు ఫోన్ చేస్తాడు.
తనను ఉద్యోగం నుంచి తొలగించారనే కక్షతో రాహుల్ కంపెనీని సీజ్‌చేయించేందుకు ప్లాన్‌లు వేస్తున్నాడని ఆఫీస్ నుంచి ఎంప్లాయ్ ఫోన్ చేస్తాడు. రాహుల్‌ను ఆపకపోతే కంపెనీకి చాలా నష్టం జరుగుతుందని ఉద్యోగి అనడంతో కావ్య కంగారుగా ఈ విషయం అపర్ణకు చెబుతుంది. అపర్ణకు జాగ్రత్తలు చెప్పి ఆఫీస్‌కు బయలుదేరుతుంది.
ధాన్యలక్ష్మి కన్నీళ్లు...
అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. ధాన్యలక్ష్మి మాత్రం కళ్యాణ్‌ను గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పును వదిలేసి కళ్యాణ్ ఇంటికి వస్తే బాగుండునని అంటుంది. నువ్వు నన్ను వదిలేస్తే...అప్పును కళ్యాణ్ వదిలేస్తాడని భార్యకు క్లాస్ ఇస్తాడు ప్రకాశం. అప్పుడే అప్పు, కళ్యాణ్‌లను తీసుకొని రాజ్ అన్నదానం దగ్గరకు వస్తాడు. కళ్యాణ్‌కు అందరూ పోటీపడి బర్త్‌డే విషెస్ చెబుతారు. కానీ ధాన్యలక్ష్మి మాత్రం సెలైంట్‌గా ఉంటుంది.
అప్పుతో గొడవ...
వీళ్లను ఎవరూ పిలిచారు అంటూ అప్పును చూడటంతోనే గొడవ మొదలుపెడుతుంది ధాన్యలక్ష్మి. పిలవని పేరంటానికి ఎలా వస్తారు..అన్నదానం అనగానే ఫ్రీగా భోజనం దొరుకుతుందని వచ్చారా అంటూ అవమానిస్తుంది. ధాన్యలక్ష్మిపై అందరూ ఫైర్ అవుతారు. కళ్యాణ్ కూడా ఈ ఇంటి వారసుడేనని చెబుతారు. ఎంత చెప్పిన ధాన్యలక్ష్మి పట్టువీడదు.
పంతాలు, పట్టింపులు వీడి మనం అందరం కలిసిపోదామని ధాన్యలక్ష్మికి రాజ్ సర్ధిచెప్పాలని చూస్తాడు. ఈ పూట మీ వాళ్లందరితో ఉండి రమ్మని కళ్యాణ్‌తో అంటుంది అప్పు. ఒక్క పూట కోసం నా కొడుకును నువ్వు నాకు దానం చేస్తున్నావా అంటూ అప్పుతో మళ్లీ గొడవపడుతుంది ధాన్యలక్ష్మి.
ఈ గొడవల వల్ల నీ అహం చల్లరడం మినహా ఒరిగేది ఏం లేదని భార్యతో అంటాడు ప్రకాశం. ఈ విషయంలో నేను ఎవరి మాట వినేది లేదని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పును వదిలేసి వస్తే ఈ క్షణమే నేను కళ్యాణ్‌ను దగ్గరకు తీసుకుంటానని, ఇంట్లోకి ఆహ్వానిస్తానని ధాన్యలక్ష్మి చెబుతుంది.
జన్మంతా కొడుకు దూరమే...
కళ్యాణ్‌కు అప్పు దూరమవ్వడం ఈ జన్మలో జరగదని చెప్పి ధాన్యలక్ష్మికి షాకిస్తుంది స్వప్న. ఈ జన్మంతా కొడుకును దూరం చేసుకొని ఉండటం మినహా మీకు మరో దారి లేదని ధాన్యలక్ష్మితో స్వప్న అంటుంది. ఇది మా కుటుంబవిషయం, నీ జోక్యం అవసరం లేదని స్వప్నపై ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. ఇది నా చెల్లెలి కాపురానికి సంబంధించిన విషయం అని స్వప్న ధీటుగా బదులిస్తుంది.
ఈ గొడవను కళ్యాణ్ ఆపేస్తాడు. ఒక్క పూట భోజనానికి నా భార్యను అన్నదానానికి తీసుకొచ్చే పరిస్థితికి తాను ఇంకా దిగజారలేదని, నీ ఆస్తులు, ఐశ్వర్యాలు కూడా నాకు అక్కరలేదని ధాన్యలక్ష్మితో అంటాడు కళ్యాణ్. అప్పుకు మూడు పూటలు తిండిపెట్టగలనని చెబుతాడు. ఈ గొడవలు జరుగాతాయనే నేను రానని అన్నానని రాజ్‌తో అంటాడు కళ్యాణ్.
రాజ్ నిర్ణయం...
నా తమ్ముడి బర్త్‌డే సందర్భంగా జరుగుతున్న ఈ అన్నదానానికి నా భార్య చెల్లిలిని, ఆమె భర్తను నేనే ఆహ్వానించానని రాజ్ అందరి ముందు ప్రకటిస్తాడు. ధాన్యలక్ష్మి చేత కళ్యాణ్, అప్పులకు భోజనం వడ్డించేలా చేస్తాడు రాజ్. ఇష్టం లేకపోయినా భర్త మాట కాదనలేక కొడుకు, కోడలికి భోజనాలు వడ్డిస్తుంది ధాన్యలక్ష్మి.
అపర్ణకు ప్రాణాపాయం...
మరోవైపు ఆఫీస్‌కు వెళ్లి అన్ని ఫైల్స్ చెక్ చేస్తుంటుంది కావ్య. కోడలు ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకున్న అపర్ణ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. సాయం కోసం కావ్యకు ఫోన్ చేస్తుంది అపర్ణ. కానీ ఫోన్ దూరంగా ఉండటంతో కావ్య చూడలేకపోతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
టాపిక్