Brahmamudi July 23rd Episode: భార్య కాళ్లు పట్టుకున్న రాజ్ - భర్తను అడ్డంగా బుక్ చేసిన కావ్య - అపర్ణ పశ్చాత్తాపం
Brahmamudi July 23rd Episode: బ్రహ్మముడి జూలై 23 ఏపిసోడ్‌లో భూత్ బంగ్లాలో కావ్య, రాజ్ శోభనం జరుగుతుంది. శోభనం ఏర్పాట్లు కావ్యకు తెలియకుండా రాజ్ చేస్తాడు. రాజ్ నాటకం మొత్తం బయటపడటంతో అతడిపై కావ్య ఫైర్ అవుతుంది.
Brahmamudi July 23rd Episode: రాజ్, కావ్యల శోభనానికి అపర్ణ, ఇందిరాదేవి అన్ని ఏర్పాట్లు చేస్తారు. వారి బెడ్‌రూమ్‌ను పూలు, పళ్లతో అందంగా డెకరేట్‌చేస్తారు. రాజ్, కావ్యలను సర్‌ప్రైజ్‌చేయాలని అనుకుంటారు. డిన్నర్ కోసం హోటల్‌కు వెళ్లిన రాజ్, కావ్య కారు చెడిపోవడంతో ఓ పాత బిల్డింగ్‌తో తలదాచుకుంటారు. ఆ బిల్డింగ్ మొత్తం క్యాండిల్ లైట్‌లో కలర్ ఫుల్‌గా వెలిగిపోతూ ఉంటుంది. ఆ పాత బిల్డింగ్‌లోనే రాజ్, కావ్య శోభనం ముగిసిపోతుంది.
అత్తగారిననే అహంకారం...
ఇన్నాళ్లు కావ్యను తాను చాలా మోసం చేశానని అపర్ణ బాధపడుతుంది. అత్తగారిలా అహంకారం చూపించి తన మనసు గాయపరిచానని ఇందిరాదేవికి చెబుతుంది. నేను ఎంత బాధపెట్టిన కావ్య మాత్రం నాపై ఎప్పుడూ ప్రేమను చూపిస్తూవచ్చిందని అంటుంది. కావ్యది ఇన్నాళ్లు నటన అని పొరపడి అపార్థం చేసుకున్నానని పశ్చాత్తపడుతుంది.
ఇక నుంచి నా కోడలి సంతోషమే నా సంతోషంమని ఇందిరాదేవితో చెబుతుంది అపర్ణ. కావ్యకు ఏ కష్టం రాకుండాచూసుకుంటానని చెబుతుంది. అలాగైనా కావ్య పట్ల నేను చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం తనకు దొరుకుతుందని అపర్ణ నిర్ణయానికి వస్తుంది.
రాజ్ ప్లాన్...
కావ్యకు మెళకువ వస్తుంది.పక్కన రాజ్ కనిపించడు. ఇలాంటి భూత్ బంగ్లాలోకి బెడ్, బెడ్‌షీట్స్ ఎలా వచ్చాయి, ఈ బిల్డింగ్‌ను అందంగా ఎవరూ డెకరేట్ చేసి ఉంటారా అని కావ్య ఆలోచిస్తుంటుంది.
కావ్యతో తన ఫస్ట్ నైట్ జరగడానికి రాజ్ ఈ ప్లాన్ చేస్తాడు. వర్షం ఎఫెక్ట్‌తో పాటు దయ్యాల మాదిరిగా కావ్యను భయపెట్టి ఆమెకు దగ్గరవుతాడు. ఆ అరెంజ్‌మెంట్స్ చేసిన వ్యక్తికి డబ్బులు ఇస్తూకావ్యకు దొరికిపోతాడు. భూత్ బంగ్లాకు కావాలనే రాజ్ తనను తీసుకొచ్చాడని , ఇదంతా అతడు చేసిన ప్లాన్ అని కావ్యకు తెలిసిపోతుంది.
ప్రేమతో కాకుండా...
నన్ను ప్రేమతో గెలవలకుండా సర్‌ప్రైజ్ పార్టీలు ఏర్పాటుచేసి..భూత్ బంగ్లాలో మాయ చేసి నా అంతట నేనే మీకు లొంగిపోయేటట్లు ఆర్టిఫీషియల్ అరెంజ్‌మెంట్స్ చేస్తారా అంటూ రాజ్‌పై పంచ్‌లు వేస్తుంది కావ్య. మీ పెళ్లంతో కాపురం వెలగబెట్టడానికి ఇంతకంటే సుందరమైన ప్లేస్ మీకు దొరకలేదా అంటూ క్లాస్ పీకుతుంది. మీ శోభనం ఎక్కడ జరిగిందని ఎవరైనా అడిగితే దయ్యాలు తిరిగే చోట జరిగిందని ఎలా చెప్పను అని తిట్ల దండకం మొదలుపెడుతుంది.
కావ్య బ్లాక్‌మెయిల్...
ఇప్పుడే ఈ విషయాన్ని అమ్మమ్మకు, అత్తయ్యకు చెబుతానని కావ్య అంటుంది. శోభనం స్వీట్ మెమోరీస్‌ను నెమరువేసుకునే అవకాశం కూడా నాకు లేకుండా చేశారని రాజ్‌పై ఫైర్ అయినట్లుగా డ్రామా ఆడుతుంది. శోభనం గురించి మాత్రం ఎవరికి చెప్పొద్దని, దండ పెడతానని, కాళ్లుపట్టుకుంటానని కావ్యను రాజ్ బతిమిలాడుతాడు.
అయితే కాళ్లు పట్టుకోమని, అప్పుడే ఎవరికి నిజం చెప్పనని భర్తతో అంటుంది కావ్య. దుగ్గిరాల వారసుడిని, స్వరాజ్ గ్రూప్ ఎండీని నేను కాళ్లు పట్టుకోవడం ఏంటి అని రాజ్ బెట్టుచేస్తాడు ఈగో తగ్గించుకోకపోతే మీ ప్లాన్‌ను మొత్తం బయటపెట్టేస్తానని కావ్య బెదిరిస్తుంది. దాంతో రాజ్ కాళ్లు పట్టుకోవడానికి సిద్ధమవుతాడు. కావ్య వద్దని వారిస్తుంది.
అపర్ణ కంగారు...
రాజ్, కావ్య రాత్రి మొత్తం ఇంటికి రాకపోవడంతో అపర్ణ, ఇందిరాదేవి కంగారుపడతారు. ఫోన్ స్విఛాఫ్ వస్తుండటంతో పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని ఇందిరాదేవితో అంటుంది అపర్ణ. అప్పుడే రాజ్, కావ్య ఎంట్రీ ఇస్తారు. ఎక్కడికి వెళ్లారు? రాత్రంతా ఇంటికి రాకుండా ఏం చేశారు అంటూ ఇద్దరిపై ఇందిరాదేవి, అపర్ణ ప్రశ్నల వర్షం కురిపిస్తారు.
మీ శోభనం కోసం చేసిన ఏర్పాట్లు వృథా అయిపోయాయని అంటారు. వ్రతం చెడిన ఫలితం మాత్రం దక్కిందని కావ్య అంటుంది.రాజ్ డిన్నర్ అని చెప్పి తనతో అడ్వెంచర్స్ చేయించాడని అతడి ప్లాన్ మొత్తం చెప్పడానికి సిద్ధమవుతుంది కావ్య. రాజ్ అడ్డుకోబోతాడు.
కారు ఆగిపోవడంతో ఇంటికి రాలేదని బుకాయించబోతాడు. అది అబద్ధమని మోసం చేసి తనను రాజ్ పాడుబడ్డ బంగళాకు తీసుకెళ్లాడని కావ్య అంటుంది. రాజ్ మధ్యలో మాట్లాడబోతే ఇందిరాదేవి అడ్డుకుంటుంది.
పాడుబడ్డ బంగళాలో శోభనం...
మీరు ఇక్కడ ఏర్పాటుచేసిన కార్యాన్ని రాజ్ ఊరిబయట ఉన్న పాడుబడ్డ బంగళాలో పూర్తిచేశాడని కావ్య సిగ్గుపడుతూ చెబుతుంది. ఆమె చెప్పిన మాట విని ఇద్దరు షాకవుతారు. ఈ కార్యం కోసం మీ మనవడు వేసిన ప్లాన్స్ వింటే మీ మైండ్‌బ్లాక్ అవుతుందని కావ్య అంటుంది. శోభనం కోసం రాజ్ ఏం చేశాడో అవన్నీ పూసగుచ్చినట్లు ఇందిరాదేవి, అపర్ణలకు వివరిస్తుంది కావ్య.
నమ్మి రాజ్ వెంట వెళ్లినందుకు మీ మనవడు ఇలా చేయడం న్యాయమేనా అంటూ ఇందిరాదేవితో తన బాధను చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నట్లు నటిస్తుంది కావ్య. రాజ్‌ను నిలదీసేవాళ్లు ఎవరు? నాకు అండగా నిలబడేవాళ్లు ఎవరూ అంటూ ఏడుస్తూ ఇంటిలోపలికి వెళుతుంది. కావ్య వైపు కోపంగా చూస్తాడు రాజ్. కావ్య మాత్రం కన్ను కొడుతుంది.
మనవడిని దులిపేసిన ఇందిరాదేవి...
కావ్య లోపలికి వెళ్లగానే అపర్ణ, ఇందిరాదేవి ఇద్దరు కలిసి రాజ్ దులిపేస్తారు. అభంశుభం తెలియని కావ్యను ఇలా మోసం చేస్తావని అనుకోలేదని ఇందిరాదేవి క్లాస్ ఇస్తుంది.కావ్య మనసు అర్థం చేసుకోకుండా ఆమెను బాధపెట్టావని అపర్ణ కూడా రాజ్‌ను ఛీ కొడుతుంది.
రాజ్ కోపం...
నిజాలు చెప్పనని తన చేత కాళ్లు పట్టించుకొని ఇప్పుడు మాట తప్పి తనను అందరి ముందు ఇరికించడంతో కావ్యపై రాజ్ కోపంతో రగిలిపోతాడు. రాజ్ చేసిన పనులను మనసులో పెట్టుకొని అతడిపై కోపాన్ని చూపించొద్దని కావ్యతో అంటుంది ఇందిరాదేవి. రాజ్‌కు నీ పట్ల మనసులో అంతులేని ప్రేమ దాగి ఉందని అంటుంది. రాజ్ ప్రేమను తప్పుగా అర్థం చేసుకోవద్దని అంటుంది.
మా పెళ్లి రోజు రాజ్ ఇంటికి బిడ్డను తీసుకొస్తే ఆయన్ని తలో ఓ మాట అన్నారు. కానీ భర్తపై నమ్మకంతో ఆయన్ని తాను ఒక్క మాట కూడా అనలేదని కావ్య అంటుంది. నాపై కోపం ఉన్నా మా పుట్టింటికి ఆపద రాగానే సాయం చేశాడు. ప్రేమ పేరుతో మోసం చేసిన మా అక్కను క్షమించాడు. రాజ్ మంచివాడు, గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడంటూ భర్తపై ప్రశంసలు కురిపిస్తుంది కావ్య.
నా జీవితంలో మధుర జ్ఞాపకం...
రాజ్ తనను సర్‌ప్రైజ్ చేయడానికి చేసిన పనులన్నీ నాకు తెలుసునని కావ్య అంటుంది. ఆ ప్లాన్స్‌ను అమలు చేయడానికి రాజ్ పడిన కష్టాన్ని చూసి నేను నవ్వుకున్నాను. నిన్న రాత్రి నా జీవితంలో మధుర జ్ఞాపకంగా మిగిలిపోయే రోజు అని ఇందిరాదేవితో చెబుతుంది కావ్య.
కావ్య యాక్టింగ్...
తమ ముందు రాజ్‌ను ఇరికించడానికి కావ్య ఆడిన నాటకం చూసి ఇందిరాదేవి ఇంప్రెస్ అవుతుంది. నీ యాక్టింగ్‌ను నేను గుర్తుపట్టలేకపోయానని అంటుంది. మొండివాడైన రాజ్‌ను లొంగదీసుకోవాలంటే ఈ మాత్రమైనా లౌక్యం ఉండాల్సిందేనని కావ్య అంటుంది. ఇన్నాళ్లకు నీ కాపురం సరైన దారిలో పడటం ఆనందంగా ఉందని ఇందిరాదేవి చెబుతుంది.