తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi August 14th Episode: బ్ర‌హ్మ‌ముడి - కావ్య‌ను విల‌న్‌ను చేసిన రుద్రాణి - అన్న‌య్య మాట కాద‌న్న క‌ళ్యాణ్

Brahmamudi August 14th Episode: బ్ర‌హ్మ‌ముడి - కావ్య‌ను విల‌న్‌ను చేసిన రుద్రాణి - అన్న‌య్య మాట కాద‌న్న క‌ళ్యాణ్

14 August 2024, 10:51 IST

google News
  • Brahmamudi August 14th Episode: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌ ఆగ‌స్ట్ 14 ఎపిసోడ్‌లో గుడిలో త‌ల దాచుకున్న క‌ళ్యాణ్, అప్పుల‌కు బంటి ద్వారా షెల్ట‌ర్ ఇప్పిస్తుంది కావ్య‌. తానే ఈ ప‌ని చేసిన‌ట్లుగా వారికి తెలియ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతుంది.

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌ ఆగ‌స్ట్ 14 ఎపిసోడ్‌
బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌ ఆగ‌స్ట్ 14 ఎపిసోడ్‌

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌ ఆగ‌స్ట్ 14 ఎపిసోడ్‌

Brahmamudi August 14th Episode:ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన క‌ళ్యాణ్, అప్పు గుడిలో ప్ర‌సాదం తింటూ క‌డుపునింపుకుంటారు. న‌న్ను న‌మ్మి వ‌స్తే నిన్ను గుడి మెట్ల‌పై కూర్చోబెట్టాను...నీకు నాపై కోపంగా లేదా అని అప్పును అడుగుతాడు క‌ళ్యాణ్. కోట్ల ఆస్తి నా కోసం వ‌దులుకొని వ‌చ్చావు మ‌రి నేనేం అనుకోవాలి అని అప్పు స‌మాధాన‌మిస్తుంది. న‌న్ను ప్రేమించినందుకు నీ బ‌తుకు ఇలా అయ్యింద‌ని నేను బాధ‌ప‌డాలి క‌దా అని క‌ళ్యాణ్‌తో అంటుంది అప్పు.

నిన్ను వ‌దులుకోవ‌డం క‌న్న నాకు ఆస్తిని వ‌దులుకోవ‌డం క‌ష్టం కాద‌ని క‌ళ్యాణ్ చెబుతాడు. నీకు క‌ష్టం రాకుండా చూసుకోవ‌డానికి నేనే ఏదో ఒక‌టి చేయాల‌ని అప్పు అంటుంది. నేను నీ భ‌ర్త‌ను ఆ మాట చెప్పాల్సింది నేను అని క‌ళ్యాణ్ అంటాడు. భ‌ర్త అనే మాట విన‌గానే ఆనంద‌ప‌డుతుంది అప్పు. నువ్వు నా భ‌ర్త‌...నేను నీ భార్య ఈ పిలుపు కొత్త‌గా ఉంద‌ని చెబుతుంది.

కావ్య ప్లాన్‌...

బంటితో క‌లిసి అప్పు, క‌ళ్యాణ్‌ల‌ను వెతుక్కుంటూ గుడికి కావ్య వ‌స్తుంది. షెల్ట‌ర్ లేక ఇబ్బంది ప‌డుతోన్న వారిని బంటి రూమ్‌లో ఉండేలా తెలివిగా ప్లాన్ వేసి ఒప్పిస్తుంది. అప్పు, క‌ళ్యాణ్‌ల‌కు క‌నిపించ‌కుండా చాటుగా దాక్కొని బంటి ద్వారా ప్లాన్‌ను అమ‌లు చేస్తుంది. త‌న రూమ్‌లో ఒక్క‌డినే ఉంటాన‌ని, మీ ప్రైవ‌సీకి ఇబ్బంది క‌ల‌గ‌ద‌ని బంటి చెప్పిన మాట‌లు న‌మ్మి అత‌డి రూమ్‌కు వెళ‌తారు అప్పు, క‌ళ్యాణ్.

దేవుడిని వేడుకున్న కావ్య‌...

త‌న చెల్లెలిని పెళ్లి చేసుకొని క‌ళ్యాణ్ క‌ష్టాలు ప‌డ‌టం చూసి కావ్య చ‌లించిపోతుంది. క‌ళ్యాణ్‌ను తిరిగి ఇంటికి పిలుద్దామ‌ని రాజ్ చెబుతున్నా... తాను ఎందుకు మౌనంగా ఉండాల్సివ‌చ్చిందో...త‌న మ‌న‌సులోని ఆవేద‌న ఏమిటో దేవుడి ముందు బ‌య‌ట‌పెడుతుంది కావ్య‌. ఏ ప‌ని చేయ‌డానికి క‌ళ్యాణ్ ప‌నికిరాడ‌ని అనామిక నిందించింది. అవ‌మానించింది...

ఇలాగైనా బ‌య‌ట ఉండి... క‌ష్టం విలువ క‌ళ్యాణ్ గుర్తిస్తాడ‌ని కావ్య అంటుంది. భార్య‌ను పోషించ‌డానికైనా బ‌తుకుతెరువు చూసుకొని త‌న కాళ్ల మీద తాను నిల‌బ‌డ‌తాడ‌ని దేవుడి ముందు వేడుకుంటుంది కావ్య‌. ఏదో ఒక రోజు క‌ళ్యాణ్ ఉన్న‌త స్థాయికి చేరుకుంటాడు...ఆ రోజు రావాల‌నే నేను క‌ఠినంగా ప్ర‌వ‌ర్తించాల్సివ‌చ్చింద‌ని, నా భ‌ర్త దృష్టిలో త‌ప్పుగా అనిపించిన స‌రే క‌ళ్యాణ్ మాత్రంబాగుప‌డాల‌ని దేవుడిని వేడుకుంటుంది కావ్య‌.

ధాన్య‌ల‌క్ష్మి క‌న్నీళ్లు...

క‌ళ్యాణ్ ఇంటికి దూర‌మైన బాధ‌లో ధాన్య‌ల‌క్ష్మి క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెను ఓదార్చిన‌ట్లుగా న‌టిస్తూ గొడ‌వ‌ను మ‌రింత పెద్ద‌ది చేసేందుకు ప‌న్నాగాలు వేస్తుంది రుద్రాణి. అప్పును కోడ‌లిగా ఒప్పుకున్న‌ట్లుగా అంద‌రి ముందు న‌టిస్తేనే నీ కొడుకు తిరిగి ఇంటికొస్తాడ‌ని ధాన్య‌ల‌క్ష్మితో అంటుంది రుద్రాణి.

ఆ త‌ర్వాత అప్పును ఇంట్లో నుంచి ఇద్ద‌రం క‌లిసి పంపించేద్దామ‌ని చెబుతుంది. రుద్రాణి ఐడియా బాగుంద‌ని ధాన్య‌ల‌క్ష్మి అంటుంది. క‌ళ్యాణ్, అప్పు ఇంటికి రావ‌డం నాకు ఇష్ట‌మేన‌ని ఇప్పుడే అంద‌రికి చెబుతాన‌ని వెళుతుంది.

కావ్య విల‌న్‌...

క‌ళ్యాణ్‌ను ఇంటికి రాకుండా చేస్తాన‌ని చెప్పిన రుద్రాణి...ఇప్పుడు అత‌డు ఇంటికి తిరిగి రావ‌డానికి ధాన్య‌ల‌క్ష్మికి ఐడియా ఇవ్వ‌డం చూసి రాహుల్ షాక‌వుతాడు. త‌న అస‌లు ప్లాన్ కొడుకు ముందు బ‌య‌ట‌పెడుతుంది రుద్రాణి. క‌ల్యాణ్‌ను తిరిగి ఇంటికి తీసుకురావ‌డానికి కావ్య ఒప్పుకోదు. దాంతో అంద‌రిరు ఆమెను విల‌న్‌గా చూస్తారు. కావ్య‌ను ఇంటి నుంచి పంపించేందుకు మ‌న‌కు ఓ దారి దొరుకుతుంద‌ని కొడుకుతో అంటుంది రుద్రాణి.

బంటి రూమ్‌కు అప్పు, క‌ళ్యాణ్‌...

అప్పు, క‌ళ్యాణ్‌ల‌ను తీసుకొని త‌న రూమ్‌కు వ‌స్తాడు బంటి. వారు ఇంట్లో ఉండ‌టానికి ఓన‌ర్ ఒప్పుకోడు. ఓన‌ర్ త‌న భార్య‌కు భ‌య‌ప‌డ‌తాడ‌ని క‌నిపెట్టిన బంటి తెలివిగా ఆమె ద్వారా అప్పు, క‌ళ్యాణ్ త‌న రూమ్‌లో ఉండేందుకు ఒప్పిస్తాడు.

స్వ‌ప్న‌, కావ్య అనుమానాలు...

క‌ళ్యాణ్, అప్పు ల‌ను తిరిగి ఇంటికి తీసుకురావ‌డానికి ఒప్పుకుంటుంది ధాన్య‌ల‌క్ష్మి. రాత్రి లేని ఆలోచ‌న ఇప్పుడు స‌డెన్‌గా ఎలా వ‌చ్చింద‌ని ప్ర‌కాశం డౌట్ ప‌డ‌తాడు. ఈ దెయ్యం అని రుద్రాణిని చూపిస్తూ...ఏదైనా ద‌య్యం క‌నిపించింది స‌ల‌హా ఇచ్చిందా...మీ అంత‌ట మీరుగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా లేద‌నిపిస్తుంద‌ని స్వ‌ప్న డౌట్ ప‌డుతుంది.

ప్రాణం పోయిన అప్పు ఇంట్లో అడుగుపెట్ట‌డానికి ఒప్పుకోని మీరు స‌డెన్‌గా మాట ఎలా మార్చారు అంటూ కావ్య కూడా అనుమానంగా అడుగుతుంది. క‌ళ్యాణ్ తిరిగి రావ‌డం మీ అక్క చెల్లెళ్ల‌కు సంతోషంగా లేన‌ట్లుగా ఉంద‌ని, క‌ళ్యాణ్ ఆస్తిని మీరు అనుభ‌వించాల‌ని అనుకుంటున్నారా అంటూ రుద్రాణి, రాహుల్ సెటైర్లు వేస్తారు. వారిని మాట‌ల‌తో స్వ‌ప్న భ‌య‌పెడుతుంది...

రాజ్ షాక్‌...

క‌ళ్యాణ్‌ను తిరిగి ఇంటికి తీసుకురావ‌డానికి నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావా అని ఎదురుచూస్తున్నావ‌ని ధాన్య‌ల‌క్ష్మితో అంటాడు రాజ్‌. మా పిన్ని ఎప్ప‌టికీ ఒప్పుకోద‌ని అన్నావు..ఇప్పుడు ఏమంటావు అని కావ్య‌ను చూస్తూ ఎగ‌తాళిగా మాట్లాడుతాడు రాజ్‌.ఇప్పుడే వెళ్లి క‌ళ్యాణ్, అప్పుల‌ను తీసుకొద్దాం ప‌దా అని అంటాడు. కానీ కావ్య మాత్రం రాన‌ని చెబుతుంది. ఆమె మాట‌ల‌తో రాజ్‌తో పాటు ఇంట్లోవాళ్లంద‌రూ షాక‌వుతారు.

క‌ళ్యాణ్ సంతోషం కోసం...

క‌ళ్యాణ్ సంతోషం కోసం ఎన్నో చేసిన నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని కావ్య‌తో ఇందిరాదేవి అంటుంది. నువ్వు పిలిస్తేనే క‌ళ్యాణ్ ఇంటికి వ‌స్తాడ‌ని కావ్య‌ను రిక్వెస్ట్ చేస్తాడు ప్ర‌కాశం. నా మ‌న‌సు మొత్తం అల్ల‌క‌ల్లోలంగా ఉంద‌ని, ఈ ప‌రిస్థితుల్లో నేను ఏ నిర్ణ‌యం తీసుకోలేక‌పోతున్నాన‌ని కావ్య అంద‌రికి బ‌దులిస్తుంది. క‌ళ్యాణ్‌ను తిరిగి ఇంటికి తీసుకురావాల‌న్న‌ది ధాన్య‌ల‌క్ష్మి నిర్ణ‌య‌మ‌ని...అందులో తాను జోక్యం చేసుకోన‌ని కావ్య చెబుతుంది.

రాజ్ ఒంట‌రిగా...

కావ్య రాక‌పోవ‌డంతో రాజ్ ఒక్క‌డే అప్పు, క‌ళ్యాణ్ ల‌ను వెతుక్కుంటూ బంటి రూమ్‌కు వ‌స్తాడు. ఆ రూమ్‌లో అప్పు, క‌ళ్యాణ్‌లు ఉండ‌బోతున్నార‌ని తెలుసుకొని చ‌లించిపోతాడు. మీరిద్ద‌రు ఇంటికి రావ‌డానికి పిన్ని ఒప్పుకుంద‌ని, ఇప్పుడే వెళ‌దాం ప‌దా అని అంటారు. కానీ వారు అందుకు ఒప్పుకోరు. అప్పు, క‌ళ్యాణ్‌ల‌ను తీసుకొస్తాన‌ని వెళ్లిన రాజ్ ఒంట‌రిగా ఇంటికిరావ‌డం చూసి అంద‌రూ షాక‌వుతారు. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ముగిసింది.

తదుపరి వ్యాసం