Vennela Kishore OMG Movie: అక్షయ్ కుమార్ టైటిల్‌తో వెన్నెల‌కిషోర్ హార‌ర్ మూవీ - ఓ మంచి ద‌య్యం భ‌య‌పెడుతోంద‌ట‌!-tollywood news vennela kishore nandita swetha omg movie concept poster and glimpse released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vennela Kishore Omg Movie: అక్షయ్ కుమార్ టైటిల్‌తో వెన్నెల‌కిషోర్ హార‌ర్ మూవీ - ఓ మంచి ద‌య్యం భ‌య‌పెడుతోంద‌ట‌!

Vennela Kishore OMG Movie: అక్షయ్ కుమార్ టైటిల్‌తో వెన్నెల‌కిషోర్ హార‌ర్ మూవీ - ఓ మంచి ద‌య్యం భ‌య‌పెడుతోంద‌ట‌!

Nelki Naresh Kumar HT Telugu
May 02, 2024 08:15 AM IST

Vennela Kishore OMG Movie: చారి 111 త‌ర్వాత వెన్నెల‌కిషోర్ ఓ హార‌ర్ మూవీలో హీరోగా న‌టిస్తోన్నాడు. ఓఎమ్‌జీ ( ఓ మంచి ఘోస్ట్‌) టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి శంక‌ర్ మార్తాండ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.

వెన్నెల‌కిషోర్ ఓఎమ్‌జీ
వెన్నెల‌కిషోర్ ఓఎమ్‌జీ

Vennela Kishore OMG Movie:చారి 111 మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్ క‌మెడియ‌న్ వెన్నెల కిషోర్‌. థియేట‌ర్ల‌లో మోస్తారు ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్న ఈ మూవీ ఓటీటీలో మాత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. రికార్డ్ వ్యూస్‌ను సొంతం చేసుకున్న‌ది. చారి 11 త‌ర్వాత ఈ సారి ఓ హార‌ర్ మూవీతో హీరోగా త్వ‌ర‌లో తెలుగు ఆడియెన్స్ ముందుకు వ‌చ్చేందుకు వెన్నెల కిషోర్ రెడీ అవుతోన్నాడు. ఓఎమ్‌జీ ( ఓ మంచి ఘోస్ట్‌) పేరుతో ఓ హార‌ర్ కామెడీ మూవీ చేస్తోన్నాడు.

నందితా శ్వేత హీరోయిన్‌...

ఈ సినిమాలో వెన్నెల‌కిషోర్‌తో పాటు నందితా శ్వేత‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, న‌వ‌మి గాయ‌క్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఓఎమ్‌జీ మూవీకి శంక‌ర్ మార్తాండ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఓఎమ్‌జీ మూవీ గ్లింప్స్‌తో పాటు కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వెన్నెల కిషోర్‌తో పాటు మిగిలిన ప్ర‌ధాన పాత్ర‌ధారులు దెయ్యాన్ని చూసి భ‌య‌ప‌డుతున్న‌ట్లుగా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను డిజైన్ చేశారు.

డిఫ‌రెంట్ గెట‌ప్‌ల‌లో...

ఓ పాత కాలం నాటి భ‌వ‌నంలోకి అడుగుపెట్టిన కొంద‌రు ద‌య్యం కార‌ణంగా ఎలాంటి ఇబ్బంద‌లు ప‌డ్డార‌నే పాయింట్ చుట్టూ ఓ మంచి ఘోస్ట్ మూవీసాగ‌నున్న‌ట్లు గ్లింప్స్ చూస్తుంటే క‌నిపిస్తోంది. ఇందులో నందితా శ్వేత ద‌య్యం క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

పెళ్లి కొడుకుగా, ఫైట‌ర్‌గా డిఫ‌రెంట్ గెట‌ప్‌ల‌లో వెన్నెల కిషోర్ ఈ గ్లింప్స్‌లో క‌నిపిస్తున్నాడు. న‌వ్విస్తూనే ఓ మంచి ఘోస్ట్ భ‌య‌పెడుతోంద‌ని గ్లింప్స్ చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. ఓఎమ్‌జీ టైటిల్ బాలీవుడ్‌లో అక్ష‌య్‌కుమార్‌కు బాగా క‌లిసివ‌చ్చింది. ఈ టైటిల్‌తో అక్ష‌య్ చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షాన్ని కురిపించాయి. అక్ష‌య్ కుమార్‌కు క‌లిసివ‌చ్చిన టైటిల్‌తో తెలుగులో వెన్నెల కిషోర్ మూవీ చేస్తోన్నాడు.

ఎక్కువ‌గా హార‌ర్ మూవీస్‌...

ఓ మంచి ఘోస్ట్ మూవీలో నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు, నాగినీడు, బాహుబలి ప్రభాకర్, షేకింగ్ శేషు ఇత‌ర కీలక పాత్రలు చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.నందితా శ్వేత ఇప్ప‌టివ‌ర‌కు తెలుగులో ఎక్కువ‌గా హార‌ర్ సినిమాలు చేసింది.

ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడాతో పాటు ప‌లు సినిమాల్లో ద‌య్యం పాత్ర‌ల్లో క‌నిపించింది. ఇప్ప‌టివ‌ర‌కు నందితా శ్వేత చేసిన హార‌ర్ మూవీస్‌కు భిన్నంగా ఓ మంచి ఘోస్ట్ ఉండ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ చెబుతోన్నారు. వెన్నెల‌కిషోర్, ష‌క‌ల‌క శంక‌ర్ కామెడీ ఈ మూవీకి ప్ల‌స్స‌వుతుంద‌ని అంటున్నారు. ఇటీవ‌లే ఈసినిమాలోని ఫ‌స్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. త్వ‌ర‌లోనే ఓ మై ఘోస్ట్ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేయ‌బోతున్నారు.

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌...

ఓ మంచి ఘోస్ట్‌తో పాటు శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ మూవీలో వెన్నెల‌కిషోర్ హీరోగా క‌నిపించ‌బోతున్నాడు. ఈ యాక్ష‌న్ కామెడీ మూవీలో వెన్నెల‌కిషోర్ డిటెక్టివ్‌గా క‌నిపించ‌బోతున్నాడు.

క‌మెడియ‌న్‌గా తెలుగులో ఫుల్ బిజీగా ఉన్నాడు వెన్నెల‌కిషోర్‌. గేమ్ ఛేంజ‌ర్‌, విశ్వంభ‌ర‌తో పాటు ప‌లు భారీ బ‌డ్జెట్ సినిమాల్లో క‌మెడియ‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఇండియ‌న్ 2 మూవీతో వెన్నెల కిషోర్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.

టాపిక్