తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Biggest Flop Movie Ott: రూ. 300 కోట్ల బడ్జెట్‌.. ఘోరమైన డిజాస్టర్.. దెబ్బకు ఏడ్చేసిన సూపర్ స్టార్.. ఏ ఓటీటీలో ఉందంటే?

Biggest Flop Movie OTT: రూ. 300 కోట్ల బడ్జెట్‌.. ఘోరమైన డిజాస్టర్.. దెబ్బకు ఏడ్చేసిన సూపర్ స్టార్.. ఏ ఓటీటీలో ఉందంటే?

Sanjiv Kumar HT Telugu

30 August 2024, 14:46 IST

google News
  • Biggest Flop Movie In India: అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిస్తే వచ్చే నష్టం, బాధ కానీ మాములుగా ఉండదు. అందుకు ఉదాహరణే 300 కోట్ల బడ్జెట్ మూవీ. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద వచ్చిన కలెక్షన్స్, టాక్ చూసి సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అగ్ర హీరో కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు.

రూ. 300 కోట్ల బడ్జెట్‌.. ఘోరమైన డిజాస్టర్.. దెబ్బకు ఏడ్చేసిన సూపర్ స్టార్.. ఏ ఓటీటీలో ఉందంటే?
రూ. 300 కోట్ల బడ్జెట్‌.. ఘోరమైన డిజాస్టర్.. దెబ్బకు ఏడ్చేసిన సూపర్ స్టార్.. ఏ ఓటీటీలో ఉందంటే?

రూ. 300 కోట్ల బడ్జెట్‌.. ఘోరమైన డిజాస్టర్.. దెబ్బకు ఏడ్చేసిన సూపర్ స్టార్.. ఏ ఓటీటీలో ఉందంటే?

India's Biggest Flop Movie: అక్షయ్ కుమార్ తన కెరీర్ ప్రారంభం నుంచి అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇచ్చి బాలీవుడ్ సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. అయితే గత కొన్నాళ్లుగా అక్షయ్ కుమార్ సినిమాలు ఇంతకుముందులా ఆడటంలేదు. వరసు ఫెయిల్యూర్స్ చవిచూస్తున్నాడు.

గుండెలవిసేలా ఏడ్చినట్లు

అలా 2022లో అక్షయ్ కుమార్ హీరోగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో అక్షయ్‌ కుమార్‌ గుండెలవిసేలా ఏడ్చినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. 2022లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్‌గా నిలిచిన ఆ సినిమా ఇంకేదో కాదు 'సామ్రాట్ పృథ్వీరాజ్'. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ టైటిల్ రోల్ పోషించారు.

భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం విడుదలైన తర్వాత 'సామ్రాట్ పృథ్వీరాజ్' బాక్సాఫీస్ వద్ద పెట్టిన ఖర్చును రికవర్ చేయలేకపోయింది. 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమాపై దర్శకనిర్మాతలే కాదు, అక్షయ్ కుమార్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, ఆ సినిమా అంచనాలను, అదృష్టాన్ని తారుమారు చేసింది. బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా అందరి అంచనాలను 'సామ్రాట్ పృథ్వీరాజ్' చెల్లాచెదురుచేసింది.

81 కోట్లు మాత్రమే

బాక్స్ ఆఫీస్ ఇండియాలో ఒక నివేదిక ప్రకారం, అక్షయ్ కుమార్ 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమా రూ. 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందించినట్లు తెలిపింది. అయితే, విడుదలైన తర్వాత ఈ సినిమా ఇండియాలో కేవలం రూ. 81 కోట్లు (ఇండియా గ్రాస్) మాత్రమే రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం వసూళ్లు రూ. 90 కోట్లు (వరల్డ్ వైడ్ గ్రాస్) మాత్రమే.

‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమాకు చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాప్ తర్వాత, ముఖేష్ ఖన్నా యూట్యూబ్ ఛానెల్‌కు డైరెక్టర్ ద్వివేది ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ ఎదుర్కున్న తీవ్ర విమర్శలపై మాట్లాడారు. సినిమా లుక్ విడుదలైన తర్వాత అక్షయ్ కుమార్ తీవ్ర విమర్శలు ఎదుర్కున్న విషయం తెలిసిందే.

హీరోయిన్‌గా 2017 మిస్ వరల్డ్

అందుకు కారణం ఈ సినిమాలో అక్షయ్ కంటే వయసులో చాలా చిన్నది (30 ఏళ్లు చిన్నది) అయిన 2017 మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించడమే. మానుషి చిల్లర్‌కి అక్షయ్‌కు మధ్య వయస్సు తేడా గురించి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

'సామ్రాట్ పృథ్వీరాజ్' లుక్‌పై వచ్చిన భారీ విమర్శలతోనే కాకుండా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పరాజయం పాలైనందుకు అక్షయ్ కుమార్ కన్నీల్లు పెట్టుకున్నట్లు డైరెక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. దాంతో 2022 అక్షయ్ కుమార్‌కు చాలా కష్టమైన సంవత్సరంగా నిలిచింది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

'సామ్రాట్ పృథ్వీరాజ్' మాత్రమే కాకుండా 'బచ్చన్ పాండే', 'రామ్ సేతు', 'రక్షాబంధన్' వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. కాగా ప్రస్తుతం 'సామ్రాట్ పృథ్వీరాజ్' మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం