తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nikhil: య‌ష్మితో ల‌వ్ స్టోరీ -ఎవ‌రికి స‌మాధానంచెప్పాల్సిన ప‌నిలేదంటూ బిగ్‌బాస్ విన్న‌ర్ నిఖిల్‌ కామెంట్స్‌

Nikhil: య‌ష్మితో ల‌వ్ స్టోరీ -ఎవ‌రికి స‌మాధానంచెప్పాల్సిన ప‌నిలేదంటూ బిగ్‌బాస్ విన్న‌ర్ నిఖిల్‌ కామెంట్స్‌

19 December 2024, 12:46 IST

google News
  • Nikhil: య‌ష్మితో ల‌వ్‌స్టోరీపై బిగ్‌బాస్ విన్న‌ర్ నిఖిల్ మ‌రోసారి రియాక్ట్ అయ్యాడు. త‌మ మ‌ధ్య ఉన్న రిలేష‌న్ గురించి ఎవ‌రికి స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేదంటూ కామెంట్స్ చేశాడు. బిగ్‌బాస్ విన్న‌ర్‌గా నిలిచిన త‌ర్వాత కొన్ని సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని అన్నాడు.

బిగ్‌బాస్ విన్న‌ర్ నిఖిల్
బిగ్‌బాస్ విన్న‌ర్ నిఖిల్

బిగ్‌బాస్ విన్న‌ర్ నిఖిల్

Nikhil: బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 విన్న‌ర్‌గా నిఖిల్ మ‌లియాక్క‌ల్ నిలిచాడు. నిఖిల్‌కు ఫైన‌ల్ వ‌ర‌కు గౌత‌మ్ కృష్ణ గ‌ట్టిపోటీ ఇచ్చాడుటాస్కుల్లోనే కాకుండా త‌న వ్య‌క్తిత్వంతో అభిమానుల మ‌న‌సులు గెలుచుకున్న నిఖిల్ విన్న‌ర్‌గా నిలిచాడు. గౌత‌మ్ కృష్ణ ర‌న్న‌ర‌ప్‌గా స‌రిపెట్టుకున్నాడు.

బిగ్‌బాస్ విన్న‌ర్‌...

బిగ్‌బాస్ విన్న‌ర్‌గా క‌న్న‌డ న‌టుడు నిఖిల్ నిల‌వ‌డంపై కొంద‌రు ట్రోల్స్ చేస్తోన్నారు. క‌న్న‌డ యాక్ట‌ర్స్ నిఖిల్‌, ప్రేర‌ణ‌, య‌ష్మి, పృథ్వీ గ్రూప్ గేమ్ ఆడుతూ తెలుగు వాళ్ల‌ను తొక్కేశార‌ని, బిగ్‌బాస్ కూడా ప‌క్ష‌పాత ధోర‌ణి చూపిస్తూ ఓటింగ్‌లో ముందున్న గౌత‌మ్‌ను కాద‌ని నిఖిల్‌ను విన్న‌ర్ చేసిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతోన్నారు.

ఈ కామెంట్స్‌పై నిఖిల్‌తో పాటు గౌత‌మ్ భిన్నంగా రియాక్ట్ అయ్యారు. బిగ్‌బాస్ ఫైన‌ల్ రోజు బ్యాక్ ఎండ్‌లో ఏం జ‌రిగిందో త‌న‌కు తెలియ‌ద‌ని గౌత‌మ్ అన్నాడు. తాను జెన్యూన్ ప‌ర్స‌న్‌ను కాబ‌ట్టే ఆడియెన్స్ త‌న‌ను గెలిపించార‌ని నిఖిల్ అన్నారు.

నిఖిల్‌తో య‌ష్మి ల‌వ్ ట్రాక్‌...

బిగ్‌బాస్ హౌజ్‌లో య‌ష్మితో నిఖిల్ కెమిస్ట్రీ ఓ హాట్‌టాపిక్‌గా నిలిచింది. హౌజ్‌లో అడుగుపెట్టిన ఫ‌స్ట్ డే నుంచి ఇద్ద‌రు క్లోజ్‌గా మూవ్ అవుతూ వ‌చ్చారు. య‌ష్మి కోస‌మే గౌత‌మ్‌తో నిఖిల్ గొడ‌వ‌లు ప‌డ్డాడు. య‌ష్మిని వాడుకున్నావంటూ నిఖిల్‌పై గౌత‌మ్ కామెంట్స్ చేయ‌డం దుమారాన్నే రేపింది.

స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్‌...

నిఖిల్‌, య‌ష్మి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ పుకార్ల‌పై విన్న‌ర్ అయిన త‌ర్వాత మ‌రోసారి క్లారిటీ ఇచ్చాడు. త‌మ మ‌ధ్య ఎఫైర్‌, ల‌వ్‌స్టోరీ ఏం లేవ‌ని నిఖిల్ అన్నారు. తామిద్ద‌రం మంచి స్నేహితులం మాత్ర‌మేన‌ని అన్న‌ది. హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతోన్న టైమ్‌లో య‌ష్మి కూడా మేము గుడ్ ఫ్రెండ్స్ అంటూ చెప్పింది. మా మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఏంట‌నే విష‌యంలో మాకు క్లారిటీ ఉంది. ఈ విష‌యంలో ఎవ‌రికి స‌మాధానం చెప్పాల్సిన ప‌నిలేద‌ని నిఖిల్ అన్నాడు.

ఆ భేదాలు లేవు...

తెలుగు, క‌న్న‌డ అనే భేదాలు లేవ‌ని, అంతా ఒక్క‌టేన‌ని నిఖిల్ అన్నాడు. తెలుగు, క‌న్న‌డ ఎక్క‌డికి వెళ్లిన త‌న‌ను నిఖిల్ అనే పిలుస్తార‌ని, భాష మారినంత మాత్రానా మ‌నుషుల ప్రేమ‌, అభిమానం మార‌ద‌ని నిఖిల్ అన్నాడు.

నాలుగు వారాల్లోనే ఎలిమినేట్ అవుతాన‌నుకున్నా...

బిగ్‌బాస్ నుంచి నాలుగో వారంలోనే వెళ్లిపోవాల‌ని అనుకున్నాన‌ని, హౌజ్‌లో ఉండ‌టం నా వ‌ల్ల కాలేక ఎమోష‌న‌ల్ అయిపోయాన‌ని నిఖిల్ అన్నాడు. కానీ విన్న‌ర్ వ‌ర‌కు వ‌స్తాన‌ని అనుకోలేద‌ని చెప్పాడు.

బిగ్‌బాస్ విన్న‌ర్‌గా నిలిచిన సినిమాలు, సీరియ‌ల్స్ నుంచి ఆఫ‌ర్స్ వ‌చ్చాయ‌ని, త్వ‌ర‌లోనే వాటిపై క్లారిటీ ఇస్తాన‌ని చెప్పాడు. డ‌బ్బులు ఎక్కువ కావాలి, రెమ్యున‌రేష‌న్ బాగా తీసుకోవాల‌నే ఆలోచ‌న‌తో సినిమాలు చేయ‌కూడ‌ద‌ని అనుకుంటున్నాన‌ని, మంచి ఆఫ‌ర్ కోసం ఎదురుచూస్తున్న‌ట్లు తెలిపాడు.

తదుపరి వ్యాసం