తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Abhijeet: 40 ఏళ్లు దాటాక అలా చేయలేరు.. బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ కామెంట్స్

Abhijeet: 40 ఏళ్లు దాటాక అలా చేయలేరు.. బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

01 February 2024, 8:21 IST

google News
  • Abhijeet About Miss Perfect: బిగ్ బాస్ 4 తెలుగు సీజన్ విన్నర్, హీరో అభిజీత్ నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. మెగా కోడలు లావణ్య త్రిపాఠీ హీరోయిన్‌గా చేసిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్‌పై తాజాగా హీరో అభిజీత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలోనే 40 ఏళ్ల తర్వాత లైఫ్ గురించి చెప్పుకొచ్చాడు.

40 ఏళ్లు దాటాక అలా చేయలేరు.. బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ కామెంట్స్
40 ఏళ్లు దాటాక అలా చేయలేరు.. బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ కామెంట్స్

40 ఏళ్లు దాటాక అలా చేయలేరు.. బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ కామెంట్స్

Miss Perfect OTT Streaming Date: బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ నటించిన వెబ్ సిరీస్ "మిస్ పర్ఫెక్ట్". ఈ వెబ్ సిరీస్‌లో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది. అలాగే యూట్యూబ్ సిరీస్‌ల ద్వారా పాపులర్ అయిన అభిజ్ఞ ఉతలూరు మరో కీ రోల్ చేసింది. "మిస్ పర్ఫెక్ట్" వెబ్ సిరీస్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో "మిస్ పర్ఫెక్ట్" స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా మిస్ పర్ఫెక్ట్ సిరీస్ హైలైట్స్ వివరించారు హీరో అభిజీత్.

"మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్‌లో నేను రోహిత్ అనే క్యారెక్టర్‌లో నటిస్తున్నాను. చాలా లేజీ పర్సన్‌గా కనిపిస్తా. జీవితంలో ఎలాంటి లక్ష్యమంటూ ఉండదు. ఏదో డబ్బు కోసం ఉద్యోగం చేస్తుంటాడు గానీ అదీ సీరియస్‌గా తీసుకోడు. రోహిత్‌కు ఇష్టమైన విషయం ఒక్కటే వంట చేయడం. అది మాత్రం శ్రద్ధగా చేస్తుంటాడు. నా రియల్ లైఫ్‌లో రోహిత్ లాంటి క్యారెక్టర్స్‌ను చాలామందిని చూశాను. నా ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్లు ఉన్నారు" అని బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ తెలిపాడు.

"ఉద్యోగంలో ఇష్టంతో ఉండలేక బయటకు వచ్చి బిజినెస్‌తో రిస్క్ చేయలేక ఆ సంఘర్షణలో ఉండిపోతారు. ఎవరైనా ఉద్యోగం కాదని వేరే పనిచేయాలనుకుంటే అది 30-35 ఇయర్స్‌ లోనే చేయాలి. 40 ఏళ్లు దాటిన తర్వాత మీరు రిస్క్ చేయాలన్నా చేయలేరు. అప్పుడు ఇంకా బాధ్యతలు పెరిగిపోతాయి. నా రియల్ లైఫ్‌లో రోహిత్‌తో కొంత పోల్చుకుంటా. గానీ యాక్టర్‌గా నా కెరీర్ విషయంలో మాత్రం సీరియస్ గానే ఉన్నా. మా అమ్మ పెళ్లి చేసుకోమని పోరు పెడుతుంటుంది" అని అభిజీత్ అన్నాడు.

"లైఫ్‌లో చాలా సెలెక్టివ్ గా ఉంటా. అది కూడా నాకు కొద్దిగా మైనస్ అవుతోంది. ఇంత సెలెక్టివ్‌గా ఉండటం అవసరం లేదేమో. ఇంతకుముందు పెళ్లి గోల, మోడరన్ లవ్ అనే సిరీస్‌లు చేశాను. ఆ తర్వాత నటించిన వెబ్ సిరీస్ ఇదే. "మిస్ పర్ఫెక్ట్" అనేది రొమాంటిక్ కామెడీ సిరీస్. ఏదైనా కథ విన్నప్పుడు నేను చేయగలనా, నాకు సెట్ అవుతుందా అనేది ఆలోచిస్తా. మనకు నచ్చనివి చేసి రిలీజ్ చేయడం ఈజీ. కానీ ఆడియెన్స్ కు నచ్చదు. ఏదో చేసేస్తే వాళ్లు చూసే ట్రెండ్ ఇప్పుడు లేదు" అని అభిజీత్ అభిప్రాయపడ్డాడు.

"మనకు సెట్ అయ్యే మూవీ, క్యారెక్టర్ చేస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. బయటి వాళ్లకు నేను బాగా సెలెక్టివ్ అనుకున్నా సరే వచ్చిన అవకాశాలన్నీ ఒప్పుకోవడం లేదు. ఫిలింమేకర్స్‌గా, యాక్టర్స్‌గా మేము ముందు ఆ కథను పూర్తిగా నమ్మాలి. కన్విక్షన్‌తో రూపొందించాలి. బ్యాడ్ కంటెంట్‌ను ఆడియెన్స్ ఇష్టపడే పరిస్థితి ఇప్పుడు ఏమాత్రం లేదు. మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ మంచి రోమ్ కామ్. అయితే ఇందులో ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక అపార్ట్ మెంట్‌లో కొన్ని క్యారెక్టర్స్ మధ్య జరుగుతుంది. క్యారెక్టర్స్ మధ్య నవ్వించే డైలాగ్స్ ఉంటాయి. ప్లెజంట్‌గా ఎంటర్ టైనింగ్‌గా ఎపిసోడ్స్ వెళ్తుంటాయి. షూటింగ్ మాత్రం సమ్మర్ లో చేశాం. ఆ హీట్ కు ఇబ్బందిపడ్డాం" అని అభిజీత్ పేర్కొన్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం