Syed Sohel: మా నాన్న రిటైర్‌మెంట్ పైసలు సినిమాకు పెట్టా.. కన్నీళ్లు పెట్టుకున్న బిగ్ బాస్ సోహెల్
Bootcut Balaraju Pre Release Event: బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ కంటెస్టెంట్ సయ్యద్ సోహెల్ హీరోగా నటించిన మరో సినిమా బూట్ కట్ బాలరాజు. తాజాగా జరిగిన బూట్ కట్ బాలరాజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమాను వాళ్ల నాన్న రిటైర్‌మెంట్ డబ్బులతో చేసినట్లు చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు సోహెల్.
Bigg Boss Sohel About Bootcut Balaraju: బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్‌లో నటించిన సినిమా బూట్ కట్ బాలరాజు. శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్ ఫిలిమ్స్ అండ్ కథ వేరుంటాది బ్యానర్స్‌పై ఎండీ పాషా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సోహెల్‌కు హీరోయిన్‌గా మేఘ లేఖ నటించింది. అలాగే సునీల్, బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంత్, ఇంద్రజ, అనన్య నాగళ్ల, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, సీనియర్ నటుడు అవినాష్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మంచి రెస్పాన్స్
ఇప్పటికే విడుదలైన బూట్ కట్ బాలరాజు చిత్రం పాటలు, టీజర్, ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బూట్ కట్ బాలరాజు మూవీ ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బూట్ కట్ బాలరాజు ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ నిర్వహించారు. ఈ వేడుకకు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, హీరోలు సందీప్ కిషన్, మంచు మనోజ్, రోషన్ కనకాల, దర్శకులు శ్రీకాంత్ ఓదెల, సాయి రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఫైనాన్సియల్‌గా ఇబ్బందులు
బూట్ కట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమా గురించి చెబుతూ సయ్యద్ సోహెల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మోకాళ్లపై కూర్చుని మరి సినిమా చూడమని వేడుకున్నాడు. "పాషా గారి లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం. ఆయన మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చారు. సినిమా అంటే ప్యాషన్‌తో చాలా హార్డ్ వర్క్ చేసి సినిమాని నిర్మించారు. ఈ సినిమా నిర్మాణం యాభై శాతం పూర్తయిన తర్వాత ఫైనాన్సియల్‌గా కొంత ఇబ్బంది ఎదురవ్వడంతో నిర్మాత కాస్త ఒత్తిడికి లోనయ్యారు. ఆయన్ని ఒత్తిడి తీసుకోవద్దని చెప్పాను" అని సయ్యద్ సోహెల్ తెలిపాడు.
ఇల్లు కోసం దాచిన డబ్బు
"మా నాన్న రిటైర్‌మైంట్ పైసలు, నేను సంపాదించినా పైసలు, ఇల్లు కొనుక్కుందామని ఉంచుకున్నవి అన్ని ఈ సినిమాకు పెట్టాను. ఈ సినిమాతో నిర్మాతల కష్టాలు మరింతగా అర్థమయ్యాయి. నిర్మాత దిల్ రాజు గారికి మా పరిస్థితి చెప్పాం. ఆయన చాలా గొప్ప మనసుతో 'నైజాం నేను చూసుకుంటా, మీరు ఒత్తిడి తీసుకోవద్దు' అని చెప్పారు. ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏలూరు విజయ్ గారు సినిమా నచ్చి తీసుకున్నారు. వారికి ధన్యవాదాలు" బిగ్ బాస్ సోహెల్ అన్నాడు.
రెండేళ్ల పాటు
"బ్రహ్మానందం గారు , సందీప్ కిషన్, మంచు మనోజ్, రోషన్ శ్రీకాంత్ ఓదెల, సాయి రాజేష్ గారు, సుమగారు ఇలా అందరూ ఈ వేడుకకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు. వారందరికీ కృతజ్ఞతలు. దర్శకుడు కోనేటి గారు రెండేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డారు. భీమ్స్ అన్న అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సినిమాలో పని చేసిన అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఇంత మంచి అవుట్ పుట్ రావడానికి కారణం బెక్కం వేణుగోపాల్ గారు" అని బూట్ కట్ బాలరాజు హీరో సయ్యద్ సోహెల్ చెప్పుకొచ్చాడు.
ఫన్ అండ్ ఎమోషన్
"హీరోయిన్ మేఘలేఖ చక్కగా నటించడమే కాకుండా మా పరిస్థితి అర్ధం చేసుకొని సపోర్ట్‌గా నిలిచింది. ఇంద్రజ గారు చాలా సపోర్ట్ చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమాకి వెళ్లండి. బిగ్ బాస్‌లో ఉనప్పుడు నా ఒరిజినాలిటీ చూసి ప్రేక్షకులు ప్రోత్సహించారు. బూట్ కట్ బాలరాజుని కూడా అలానే థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు. చాలా ఫన్ ఎమోషన్ ఉంటుంది. ఇందులో చాలా మంచి డ్యాన్స్ కూడా చేశాను" అని సయ్యద్ సోహెల్ అన్నాడు.
శిరస్సు వంచి
"మనం జీవితంలో ఓడిన గెలిచినా ఒక తల్లికి కొడుకు మీద ప్రేమపోదు. అదే ఈ సినిమాలో అద్భుతంగా చూపించాం. ఫిబ్రవరి 2న థియేటర్స్‌లో బూట్ కట్ బాలరాజు సినిమా చూడాలని తెలుగు ప్రేక్షలందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను'' అంటూ స్టేజీపై మోకాళ్లపై కూర్చుని మరి వేడుకున్నాడు సయ్యద్ సోహెల్. స్పీచ్ మధ్యలో తన బాధలు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టున్నాడు. దీంతో సోహెల్ కామెంట్స్ వైరల్ అయ్యాయి.