Miss Perfect Lavanya Tripathi : విశాఖ బీచ్ లో మిస్ పర్ఫెక్ట్ లావణ్య త్రిపాఠి సందడి-visakhapatnam news in telugu actress lavanya tripathi participated in rk beach clean up ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Miss Perfect Lavanya Tripathi : విశాఖ బీచ్ లో మిస్ పర్ఫెక్ట్ లావణ్య త్రిపాఠి సందడి

Miss Perfect Lavanya Tripathi : విశాఖ బీచ్ లో మిస్ పర్ఫెక్ట్ లావణ్య త్రిపాఠి సందడి

Bandaru Satyaprasad HT Telugu
Jan 28, 2024 03:54 PM IST

Miss Perfect Lavanya Tripathi : విశాఖ ఆర్కే బీచ్ క్లీన్ కార్యక్రమంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి సందడి చేశారు. ఫిబ్రవరి 2న డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతున్న మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

ఆర్కే బీచ్ లో లావణ్య త్రిపాఠి
ఆర్కే బీచ్ లో లావణ్య త్రిపాఠి

Miss Perfect Lavanya Tripathi : విశాఖ ఆర్కే బీచ్ లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి సందడి చేశారు. జాతీయ పరిశుభ్రత దినోత్సవ సందర్భంగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు లావణ్య త్రిపాఠి. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో పాటు వాలంటీర్స్ వైఎంసీ వద్ద బీచ్ ను పరిశుభ్రం చేశారు. విశాఖ నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని లావణ్య త్రిపాఠి పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 2న డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతున్న మిస్ ఫర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ను అందరూ చూడాలని ఆమె కోరారు. ఈ వెబ్ సిరీస్ లో పరిశుభ్రత పట్ల అంకితభావం కలిగిన మహిళగా తన పాత్రను తెరకెక్కించారన్నారు.

బీచ్ క్లీన్ కార్యక్రమం

తాను నటిచింన వెబ్ సీరీస్ "మిస్ పెర్ఫెక్ట్ " ప్రమోషన్ లో భాగంగా బీచ్ క్లీన్ కార్యక్రమంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాల్గొన్నారు. వైజాగ్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బీచ్ క్లీనింగ్ లో మిస్ పర్ఫెక్ట్ టీం, డిస్నీ హాట్ స్టార్ సంయుక్తంగా ఈ కార్యక్రమంలో బాగస్వాములు అయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ వైజాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని అనేక సూపర్ హిట్ సినిమాలు ఇక్కడే షూట్ చేశారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలతో పాటు నగరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బీచ్ క్లీనింగ్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్

"మిస్ పర్ఫెక్ట్" వెబ్ సిరీస్ లో మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ లావణ్య రావు పాత్రలో లావణ్య త్రిపాఠి నటించారు. పరిశుభ్రతకు అంటే ఇష్టపడే లావణ్య జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసే హాస్యభరితమైన టామ్ అండ్ జెర్రీ కథలా ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సహకారంతో, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. పరిశుభ్రత అంబాసిడర్‌గా లావణ్య త్రిపాఠి ఈ పాత్రను పోషించారు. పరిశుభ్రత పట్ల ఆమెకున్న అంకితభావం ఆమె పాత్ర లావణ్యరావులో కనిపిస్తుంది.