Lavanya Tripathi: నిహారికకు ఆడపడుచు కట్నం.. అందుకే అలా చేస్తాను.. లావణ్య త్రిపాఠి కామెంట్స్ వైరల్-lavanya tripathi reveals niharika konidela dowry in miss perfect promotions ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lavanya Tripathi: నిహారికకు ఆడపడుచు కట్నం.. అందుకే అలా చేస్తాను.. లావణ్య త్రిపాఠి కామెంట్స్ వైరల్

Lavanya Tripathi: నిహారికకు ఆడపడుచు కట్నం.. అందుకే అలా చేస్తాను.. లావణ్య త్రిపాఠి కామెంట్స్ వైరల్

Sanjiv Kumar HT Telugu
Jan 28, 2024 09:15 AM IST

Lavanya Tripathi Niharika Konidela Dowry: మెగా డాటర్ నిహారిక కొణిదెలకు ఆడపడుచు కట్నంగా ఎంత ఇచ్చారు అనే ప్రశ్న మెగా కోడలు లావణ్య త్రిపాఠికి ఎదురైంది. మిస్ పర్ఫెక్ట్ ఓటీటీ సిరీస్ ప్రమోషన్స్ సందర్భంగా ఎదురైన ఈ ప్రశ్నకు లావణ్య త్రిపాఠి ఆసక్తికర సమాధానం చెప్పింది.

నిహారికకు ఆడపడుచు కట్నం.. అందుకే అలా చేస్తాను.. లావణ్య త్రిపాఠి కామెంట్స్ వైరల్
నిహారికకు ఆడపడుచు కట్నం.. అందుకే అలా చేస్తాను.. లావణ్య త్రిపాఠి కామెంట్స్ వైరల్

Lavanya Tripathi About Niharika Konidela Dowry: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్, మెగా కొత్త కోడలు లావణ్య త్రిపాఠి ఈ మధ్య కాలంలో ఓటీటీ సిరీసులు ఎక్కువగా చేస్తోంది. ఇంతకుముందు పులి మేక అనే వెబ్ సిరీసులో పోలీస్ ఆఫీసర్‌గా ఆకట్టుకున్న లావణ్య త్రిపాఠి ఇప్పుడు మిస్ పర్ఫెక్ట్‌గా రాబోతుంది. రొమాంటిక్ కామెడీ జోనర్‌లో లావణ్య త్రిపాఠి, బిగ్ బాస్ 4 సీజన్ టైటిల్ విన్నర్ అభిజీత్ దుద్దాల హీరోహీరోయిన్లుగా నటిస్తున్న వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ ఈ మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. ఇందులో లావణ్య త్రిపాఠి, అభిజీత్‌తోపాటు యూట్యూబ్ ఫేమ్ అభిజ్ఞ ఉతలూరు, హర్షవర్దన్, ఝాన్సీ, హర్ష్ రోషన్, మహేశ్ విట్టా, సతీష్ సారిపల్లి తదితరులు పలు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

మిస్ పర్ఫెక్ట్ ఓటీటీ విడుదల సందర్భంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది లావణ్య త్రిపాఠి. ఇందులో భాగంగానే అభిజ్ఞ వుతలూరుతో కలిసి లావణ్య త్రిపాఠి వైజాగ్ వైఎంసీఏ బీచ్‌లో క్లీనింగ్ క్యాంపెయిన్‌లో పాల్గొంది. మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీసులో హీరో ప్లాట్‌లో పనిమనిషిగా లావణ్య పాత్ర పోషిస్తుంది. అందుకే వైజాగ్ బీచ్‌లో చీపురు చేతపట్టి క్లీనింగ్ నిర్వహించి వెబ్ సిరీసుకు ప్రమోషన్స్ నిర్వహించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లావ్యణ్య త్రిపాఠికి ఆడపడుచు కట్నంగా నిహారికకు ఎంతిచ్చారు అనే ప్రశ్న ఎదురైంది.

మీరు నిహారికతో చాలా క్లోజ్‌గా ఉంటారు కదా. పెళ్లిలో ఆమెకు మీరు ఏమైనా కట్నం ఇచ్చారా అని అడిగారు. దానికి స్పందించిన లావణ్య త్రిపాఠి అలాంటిది ఏం ఇవ్వలేదని తెలిపింది. "నిహారికకు కట్నం, కానుకలు అంటూ ఏం ఇవ్వలేదు. డబ్బులు కూడా ఏం ఇవ్వలేదు. అసలు నా నుంచి తను ఏం ఎక్స్‌పెక్ట్ చేయదు. అయితే తను ఫ్యామిలీ మెంబర్ కాబట్టి నిహా కోసం ఏదైనా చేస్తా. తనకు అవసరమైనప్పుడు ఏం చేయడానికైనా నేను రెడీగా ఉంటాను" అని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది.

"ప్రస్తుతం నిహారిక నిర్మాతగా చాలా బిజీగా ఉంది. ఏదైనా మంచి కథ వస్తే నిహారిక బ్యానర్‌లో నటిస్తాను. మేం ఒకటే ఫ్యామిలీ కాబట్టి తన నుంచి ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా నటిస్తాను. నిహారిక అంటే నాకు చాలా ఇష్టం. తను నాకు మంచి స్నేహితురాలు. పెళ్లికి ముందు నుంచే మేమిద్దరం చాలా క్లోజ్. పెళ్లికి ముందు, పెళ్లికి తర్వాత తనలో ఎలాంటి తేడ లేదు. అప్పుడు ఎలా ఉన్నామో. ఇప్పుడు అలాగే ఉన్నాం. కాకపోతే ఒకేచోట కలిసి ఉన్నాం అంతే. చాలా హ్యాపీగా ఉన్నాం" అని లావణ్య త్రిపాఠి తెలిపింది.

ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీలోకి కొత్త కోడలుగా అడుగు పెట్టింది బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. నవంబర్ 1న ఇటలీలో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పెళ్లి ఘనంగా జరిగింది. చాలా కాలం పాటు సీక్రెట్‌గా ప్రేమించుకున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెద్దలను ఒప్పించి వివాహబంధంతో ఒక్కటయ్యారు. కాగా లావణ్య ఇలా ఓటీటీ సిరీసులతో బిజీగా ఉంటే వరుణ్ తేజ్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఆపరేషన్ వాలంటైన్, మట్కా చిత్రాలతో వరుణ్ తేజ్ బిజీగా ఉన్నాడు.

IPL_Entry_Point