తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 8 Telugu Wild Card Entries: బిగ్ బాస్ హౌజ్‌లోకి నలుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. ఆ ఇద్దరు సెలబ్రిటీలు కన్ఫమ్

Bigg Boss 8 Telugu Wild Card Entries: బిగ్ బాస్ హౌజ్‌లోకి నలుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. ఆ ఇద్దరు సెలబ్రిటీలు కన్ఫమ్

Hari Prasad S HT Telugu

23 September 2024, 14:30 IST

google News
    • Bigg Boss 8 Telugu Wild Card Entries: బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్ లోకి ఒకేసారి నాలుగు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయి. ఈవారమే వాళ్లు హౌజ్ లోకి రానున్నట్లు తెలుస్తోంది. అందులో ఇద్దరు సెలబ్రిటీల పేర్లు కూడా కన్ఫమ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
బిగ్ బాస్ హౌజ్‌లోకి నలుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. ఆ ఇద్దరు సెలబ్రిటీలు కన్ఫమ్
బిగ్ బాస్ హౌజ్‌లోకి నలుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. ఆ ఇద్దరు సెలబ్రిటీలు కన్ఫమ్

బిగ్ బాస్ హౌజ్‌లోకి నలుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. ఆ ఇద్దరు సెలబ్రిటీలు కన్ఫమ్

Bigg Boss 8 Telugu Wild Card Entries: బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ పెద్దగా ఆసక్తికరంగా అనిపించడం లేదు. తొలి వారంలో ఉన్న టీఆర్పీ రేటింగ్స్ క్రమంగా తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ షోని కాస్త రక్తి కట్టించేందుకు నిర్వాహకులు వైల్డ్ కార్డు అస్త్రాన్ని వాడబోతున్నారు. ఈ వారమే ఈ వైల్డ్ కార్డు ద్వారా నలుగురు కొత్త కంటెస్టెంట్లు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బిగ్ బాస్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్

బిగ్ బాస్ 8 తెలుగు మొత్తం 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన విషయం తెలుసు కదా. మూడు వారాల్లో ముగ్గురు ఇప్పటికే ఇంటికెళ్లిపోయారు. తొలి వారం బెజవాడ బేబక్క, రెండో వారం శేఖర్ బాషా, మూడో వారం అభయ్ నవీన్ హౌజ్ వదిలి వెళ్లాల్సి వచ్చింది. అయితే వీళ్ల స్థానంలో కొత్తగా నలుగురు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

అందులో ఇద్దరి పేర్లు ఇప్పటికే కన్ఫమ్ అయినట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది. అందులో ఒకరు ముక్కు అవినాశ్ కాగా.. మరొకరు టేస్టీ తేజ. ఈ ఇద్దరూ గతంలో బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసినవాళ్లే కావడం గమనార్హం. మరో ఇద్దరి పేర్లు బయటకు రావాల్సి ఉంది. ఈ వీకెండ్ కల్లా వీళ్లు హౌజ్ లోకి వెళ్లబోతున్నారు.

డల్లుగా బిగ్ బాస్

బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఈసారి హౌజ్ లోకి వచ్చిన కంటెస్టెంట్లు ఎవరూ జనానికి పెద్దగా తెలియదు. పైగా షోని రక్తి కట్టించడానికంటూ వాళ్లతో రకారకాల గేమ్స్ ఆడిస్తున్నారు. వాళ్లు ఒకరిపై మరొకరు గట్టిగా అరుచుకోవడం, కొట్లాటలు చాలా కామన్ అయిపోయాయి. దీంతో తొలి వారం ఉన్న టీఆర్పీ రేటింగ్స్ ఇప్పుడు దారుణంగా పతనమయ్యాయి.

బిగ్‌బాస్ 8 లాంఛింగ్ ఎపిసోడ్‌కు ఏకంగా 18.9 టీఆర్‌పీ వ‌చ్చింది. బిగ్‌బాస్ చ‌రిత్ర‌లోనే హ‌య్యెస్ట్ టీఆర్‌పీని ద‌క్కించుకుంది. బిగ్‌బాస్ సెకండ్ వీక్‌లో మాత్రం టీఆర్‌పీ రేటింగ్ బాగా ప‌డిపోయిన‌ట్లు స‌మాచారం. రెండో వారంలో వీకెండ్ ఎపిసోడ్‌కు 5.55 టీఆర్‌పీ రాగా... వీక్ డేస్ ఎపిసోడ్స్‌కు 4.09 టీఆర్‌పీ వ‌చ్చింది. అర్బ‌న్ ఏరియాలో మాత్రం బిగ్‌బాస్‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. అర్బ‌న్ ఏరియాలో వికెండ్ ఎపిసోడ్‌కు 7.01 టీఆర్‌పీ రాగా... వీక్ డేస్‌లో 4.92 వ‌చ్చింది.

బిగ్ బాస్ నామినేషన్లు

ఇక బిగ్ బాస్ తెలుగు 8 నాలుగో వారం నామినేషన్లు మొదలయ్యాయి. ఈసారి మొత్తం ఏడుగురి పేర్లు ఇందులో ఉన్నాయి. నాలుగో వారం నామినేష‌న్స్ కూడా గొడ‌వ‌ల‌తో సాగిన‌ట్లుగా బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమోలో చూపించారు. సోమ‌వారం రిలీజ్ చేసిన ప్రోమోలో ఆదిత్య‌, పృథ్వీ ఒక‌రినొక‌రు గ‌ట్టిగా వాదించుకున్నారు.

ఆ త‌ర్వాత న‌బీల్ త‌న‌ను నామినేట్ చేయ‌డం సోనియా స‌హించ‌లేక‌పోతుంది. ఈ ఇద్ద‌రు గొడ‌వ‌ప‌డిన‌ట్లుగా ప‌డిన‌ట్లుగా ప్రోమోలో చూపించారు. మొత్తంగా నాలుగో వారంనామినేష‌న్స్‌లో మ‌ణికంఠ‌, ప్రేర‌ణ‌, ఆదిత్య‌, పృథ్వీ, సోనియా, న‌బీల్, నైనిక ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

తదుపరి వ్యాసం